Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
“మెట్ గాలా 2018” లో రిహాన్నా కూడా డిసప్పాయింట్ చేసిందా?
“మెట్ గాలా 2018” లో రిహాన్నా కూడా డిసప్పాయింట్ చేసిందా?
మెట్ గల 2018 అసలు నేపద్యం “ హెవెన్లీ బాడీస్ : ఫాషన్ మరియు కాథలిక్ ఇమాజినేషన్”. ఈ నేపధ్యాన్ని అనుసరించి జరిగిన ప్రైవేట్ కార్యక్రమమైన “మెట్ గల” లో పోప్ దుస్తులు ధరించి వస్తే, ఆ వస్త్రధారణకు అధికంగా కట్టుబడి ఉండాల్సిందే. ఎంత ధైర్యం కూడుకుని ఉండాలో కదా ?
అలాంటి పరిస్థితే “మెట్ గల 2018”లో సహ అద్యక్షకురాలి పాత్ర పోషించిన రిహాన్నా కూడా ఎదుర్కొంది. పాప్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ముద్ర కలిగిన పాప్ ఆల్బం మేకర్ గా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖుల్లో రిహన్నా కూడా ఒకరు అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. పోప్ దుస్తులను ధరించి ఇచ్చిన గ్రాండ్ ఎంట్రీ కార్యక్రమానికే ఒక ఎత్తుగా నిలిచింది మరి. ఇక్కడ రిహాన్నా అందరి అంచనాలను చేరుకుందా ?

PC: @RihannaDaily
మర్గీలా అనే డిజైనర్ రూపొందించిన ఈ దుస్తులు ముత్యాలతో, రకరకాల ఆభరణాలను పొదగబడి ఎంతో ఆకర్షణీయంగా ఉండి, కాథలిజం స్పూర్తి తో తయారు చేయబడినట్లుగా ఉంది. ఈ దుస్తులలో సిలువ కలిగిన నెక్లెస్ ధరించి, ముత్యాల గజ్జెలు ధరించిన రిహన్నా ఇచ్చిన పోస్ అమోఘం. కానీ ఈ అద్భుతమైన దుస్తులతో పాటు, పైన ధరించిన ఓవర్ కోట్ రీరి (రిహాన్నా ముద్దు పేరు) పూర్తిగా పోప్ ఇన్స్పైర్డ్ లుక్ తీసుకుని రాలేదనే చెప్పాలి. కనీసం బిషప్ టోపీ కూడా కాస్త నిరాశ పరచిందనే అందరి అభిప్రాయం.
మధ్యయుగ కాలం యొక్క పాపల్ శిరస్త్రాణాలు జ్ఞాపకం వచ్చేలా, ఆమె గుండ్రటి కాథలిక్ శిరస్త్రాణాన్ని ధరించి అద్భుతంగా కనిపించింది. పోప్ లుక్ మాత్రమే తీసుకురాలేకపోయింది కానీ, రిహాన్నాకు ఆ దుస్తులు మాత్రం బాగానే నప్పాయి.

కానీ గత సంవత్సరం, శిల్ప- పూల దుస్తులు ధరించి వాస్తవికతకు కాస్త దూరంగా కనిపించిన రిహాన్నా, ఈ సంవత్సరం మాత్రం లుక్ పరంగా కాస్త శ్రద్ధను తీసుకున్నట్లుగా కనిపించింది.
ఖచ్చితంగా, ఈసారి ఆమె అద్భుతమైన కాథలిక్ దుస్తులలో కనిపించి మెస్మరైజ్ చేశారు అనడంలో ఆశ్చర్యమే లేదు. కాని రిహన్న నుండి మరింత ఎక్కువ ఆశిస్తాం కదా. కావున, కాస్త డిసప్పాయింట్మెంట్ ఉందని చెప్పక తప్పదు. రిహాన్నా తో పోలిస్తే, సారా జెస్సికా పార్కర్, జెన్నిఫర్ లోపెజ్, కేటి పెర్రీ, మడోన్నా, మరియు మరికొంతమంది వారి వారి బోల్డ్ లుక్స్ తో అదరగొట్టారు.
సో, మీరు ఈ రీరి ఫ్యాషన్ పోప్ దుస్తుల గురించి ఏమనుకుంటున్నారు ? సరిహద్దులను దాటిందా లేక చక్కగా తన అంచనాలను చేరుకుందా ? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలుపండి.



Click it and Unblock the Notifications