For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుర్గాపూజ రోజులకి సరిగ్గా సరిపోయే జాకెట్ డిజైన్లు

దుర్గాపూజ క్యాలెండర్ లో ప్రతిరోజుకీ సరిపోయే, మేటిగా కన్పించే బ్లౌజు డిజైన్లని ఎంచుకోండి.

|

దుర్గాపూజకి బెంగాలీ స్త్రీలను చీరలు మేటిగా కన్పించేలాగా చేస్తాయి. కానీ మీరు బ్లౌజు డిజైన్లు ఎంచుకోవటంలో వైవిధ్యత చూపించవచ్చు. ప్రతిరోజుకి ఒక్కో చీరను సెలక్ట్ చేసినప్పుడు ఆరోజుకి సరిపడే జాకెట్ ను కూడా ముందే ఎంచుకోండి.

దుర్గాపూజ క్యాలెండర్ లో ప్రతిరోజుకీ సరిపోయే, మేటిగా కన్పించే బ్లౌజు డిజైన్ల లిస్టుని మీకు అందిస్తున్నాం.

పంచమి

పంచమి

దుర్గాపూజని బెంగాలీలు మొదలుపెట్టే మొదటిరోజు పంచమి. అందుకని ఈరోజు ప్రత్యేకమైన జాకెట్ డిజైన్ ను సూచించడమైనది. మీరు ఈరోజు ఒకవైపు భుజం మాత్రమే ఉన్న బ్లౌజును వేసుకుని ట్రెండ్ ను అనుసరించండి.

ఇలా చేయటం వల్ల మీరు పండగను స్టైలిష్ గా మొదలుపెట్టవచ్చు. ఒక భుజం ఉన్న దుస్తులను వేసుకోడానికి ఇబ్బందిపడేవాళ్ళు ఖాళీగా ఉన్న మరోవైపు జాలీని జతపర్చి లుక్ ను మార్చవచ్చు.

షష్టి

షష్టి

మండప ఉత్సవాలలో షష్టి మీ మొదటిరోజు కావచ్చు, అందుకని ఈరోజు జాకెట్ ట్రెండీగానేకాక, హుందాగా కూడా ఉండాలి. నడుము వరకూ వచ్చే పొడవున్న జాకెట్ ను జార్జెట్ లేదా సిల్క్ చీరతో ప్రయత్నించండి. ఇది మీరు సులభంగా అటు ఇటు తిరగటానికి కూడా ఉపయోగపడుతుంది పైగా మీరు స్టైలింగ్ లో నిపుణులులాగా కన్పిస్తారు.

సప్తమి

సప్తమి

సప్తమి ఉత్సవాలలో మధ్యమరోజు. ఈ రోజు మీరేదన్నా రంగురంగులలో ఉండేది ధరిస్తే మంచిది. గ్రాఫిక్ ప్రింటెడ్ జాకెట్ ను వేసుకోండి. ఇది మీ రొటీన్ ను పోగొట్టడమేకాక, మీరు చాలా అందంగా కన్పించేట్టు చేస్తుంది.

అష్టమి

అష్టమి

దుర్గాపూజ క్యాలెండరులో అష్టమి చాలా ముఖ్యమైన రోఉ. ఏ బెంగాలీకైనా ఆరోజు పొద్దున ‘పుష్పాంజలి'కి సంప్రదాయంగా వెళ్ళాలని ఉంటుంది. మీకు దేశవాళీ బట్టలు నచ్చకపోయినా ఆరోజు సాంప్రదాయ బట్టలు వేసుకోవాలనుకుంటే, చైనీస్ కాలర్ ఉన్న జాకెట్ ను ప్రయత్నించండి.ఇది మిమ్మల్ని చాలా తెలివిగల వారుగా కన్పించేలా చేస్తూ సాంప్రదాయం కూడా నిలబడుతుంది.

నవమి

నవమి

నవమి ఆఖరునుండి రెండవ రోజు. ఈరోజు, మీరు ఆ సంవత్సర మండప ఉత్సవాలకు ముగింపు చెప్పాల్సి వస్తుంది. చీరకి సరిపోయేవిధంగా బోట్- నెక్ జాకెట్ ను ధరించి హాట్ గా కన్పించండి. ఈ ఏడాది బోట్ నెక్ జాకెట్ అన్నిటికన్నా ట్రెండింగ్ లో ఉన్న డిజైన్. దీన్ని ఆఖరివరకూ ఉంచి నవమినాడు ధరించండి.

English summary

Select the most trending blouse designs for each day of Durga Puja.

Select the most trending blouse designs for each day of Durga Puja. Have a look.
Story first published:Friday, September 15, 2017, 15:47 [IST]
Desktop Bottom Promotion