ప్రతి స్త్రీ తన వార్డ్ రోబ్ లో కలిగి ఉండాల్సిన 10 రకాల బ్లేజర్లు

Subscribe to Boldsky

ఫార్మల్స్ మరియు బ్లేజర్స్ ఒకదానితో ఒకటి కలిపి ధరిస్తేనే వాటి అందం ఇనుమడిస్తుంది మరియు కేవలం మగవారు మాత్రమే ఫార్మల్ దుస్తుల స్టైల్స్ తో ఆడవారిని ఇంప్రెస్ చేయగలరని మీరు విని వుంటే, అది తప్పు. ఆడవారు కూడా ఫార్మల్ దుస్తుల్లో తక్కువ హాట్ గా ఏం ఉండరు.

మన వార్డ్ రోబ్ లో కనీసం ఒక రకమైన బ్లేజర్ అయినా తప్పక ఉంటుందనటంలో ఏ సందేహం లేదు. తప్పనిసరిగా ప్రతి స్త్రీ వార్డ్ రోబ్ లో ఉండాల్సిన ఫార్మల్ దుస్తులంటే మొదటగా వచ్చేవి బ్లేజర్లు. మీ ఫార్మల్ దుస్తులను వేసుకుని మెరవటానికి శీతాకాలం మంచి సమయం అయినా, బ్లేజర్లు ఏడాదంతా ధరించవచ్చు.

types of blazers for women

వార్డ్ రోబ్ లో ప్రతి స్త్రీకి ఉండాల్సిన ప్రాథమిక దుస్తుల లిస్టులో, మీకు అవసరమయ్యే వివిధ రకాల బ్లేజర్లను ఇక్కడ పొందుపరిచాం.

సింగిల్ – బ్రెస్టెడ్ బ్లేజర్

సింగిల్ – బ్రెస్టెడ్ బ్లేజర్

బుల్ బ్రెస్టెడ్ బ్లేజర్ ఇప్పుడు అస్సలు స్టైల్ కాదు మరియు ప్రతి మహిళకి ఇప్పుడు అవసరమయ్యే ప్రాథమిక బ్లేజర్ సింగిల్ బ్రెస్టెడ్ బ్లేజర్.

అయితే, సింగిల్ బ్రెస్టెడ్ బ్లేజర్ అంటే ఏమిటి?ఈ రకపు బ్లేజర్లలో రెండు వివిధ సగాలు ఉండి బటన్లతో కలపబడతాయి. అదే డబుల్ బ్రెస్టెడ్ బ్లేజర్ లో మీకు చుట్టూ చుట్టుకున్న ఫీలింగ్ కలుగుతుంది.

ఏమన్నా అర్థమైందా? అయితే మీ దగ్గర ఇదివరకే ఉండి ఉండాలి లేదా తొందరగా ఒకటి తీసుకోండి.

లెదర్ బ్లేజర్

లెదర్ బ్లేజర్

కాదు, లెదర్ జాకెట్లు మరియు లెదర్ బ్లేజర్లు ఒకటే కాదు. వాటిమధ్య సన్నని తేడా ఉంది. లెదర్ బ్లేజర్లు చాలా ఫార్మల్ గా ఉంటే లెదర్ జాకెట్లు మీకు బికినీ గర్ల్ లుక్ ని ఇస్తాయి. అందుకని వార్డ్ రోబ్ ను తిరిగి నిర్మిస్తున్నప్పుడు తీసేయాల్సినవాటిలో లెదర్ జాకెట్లు కూడా ఒకటి.

కేప్ బ్లేజర్

కేప్ బ్లేజర్

కేప్ బ్లేజర్లు ఎల్బిడిలతో బాగా నప్పుతాయి మరియు మీరు ఏదన్నా ఫార్మల్ సమావేశం లేదా నైట్ క్లబ్ కి వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే మీ మినీడ్రస్ కి కేప్ బ్లేజర్ సరిగ్గా సరిపోయి అందంగా కూడా కన్పిస్తాయి.మీరు వీటిని జీన్స్ లో టక్ చేసిన ఇన్ ఫార్మల్ టీషర్ట్ పైన కూడా వేసి దాన్ని ఫార్మల్ లుక్ లోకి మార్చేయవచ్చు. మ్యాజిక్ కదూ?

రంగుల బ్లేజర్

రంగుల బ్లేజర్

మీ వార్డ్ రోబ్ లో ప్రాథమిక తటస్థ రంగులతోపాటు రంగుల బ్లేజర్లు కూడా ఉండటం ముఖ్యం. ఫార్మల్ మీటింగ్స్ లో రంగులు బాగా కన్పించి మిమ్మల్ని ప్రముఖంగా చూపిస్తాయి. రంగులు వయొలెట్, ఎరుపు మరియు పీచ్ తీసుకోండి. లేత లేదా ముదురు రంగులు మీకు నచ్చినట్లు ఎంచుకోండి.

ప్రింటెడ్ బ్లేజర్లు

ప్రింటెడ్ బ్లేజర్లు

రంగుల బ్లేజర్ల లాగానే ప్రింటెడ్ బ్లేజర్లు కూడా మీ లుక్ కి ఆకర్షణని పెంచి,ఏదో క్లాసీ వ్యక్తిలా మిమ్మల్ని మార్చేస్తాయి. సమావేశాలకి వెళ్ళేటప్పుడు సంప్రదాయ ప్రింట్లతోనే వెళ్ళండి. ప్రింట్లంటే పోల్కా చుక్కలు, ఫిష్ నెట్లు, గీతలు ఫార్మల్ వి. ఫార్మల్ కాని వేడుక ఏదన్నా హాజరవుతుంటే, పువ్వుల ప్రింట్ల వంటి ప్రయోగాలు చేయవచ్చు.

కాకపోతే మీ వార్డ్ రోబ్ లో ఇలాంటి బ్లేజర్ తప్పక ఒకటి ఉండాలి.

జలపాత బ్లేజర్

జలపాత బ్లేజర్

వాటర్ ఫాల్ బ్లేజర్లు బ్లేజర్ల డిజైన్ ను అందంగా మార్చేసిన ఒక ప్రయోగం. ఇవి క్లాసీగా, సెక్సీగా కూడా కన్పిస్తాయి. మీ బృందంలో మీరు అందరూ వెళ్ళని దారిలో నడిచేవారు అయితే ఈ స్టైల్ ను ఫార్మల్ మరియు ఇన్ ఫార్మల్ కార్యక్రమాలు రెండిటికీ ధరించవచ్చు. ఒక బ్లేజర్ ఇలాంటిది ఉండటం మంచిది.

లేసు బ్లేజర్

లేసు బ్లేజర్

బ్లేజర్లు క్లాసీగానే ఉంటాయి కానీ లేసు ఉన్న బ్లేజర్లు మీ క్లాసీతనాన్ని అందంగా కూడా మార్చేస్తాయి. ఐరోపా దేశాల్లో లేసుతో కూడిన బ్లేజర్లు ప్రసిద్ధమయ్యాయి ఇక అప్పటినుండి, మన దేశంలో కూడా ఈ స్టైల్ హవా మొదలైంది. మీ దగ్గర కూడా ఒకటి ఇది ఉండాలి.

పెప్లం బ్లేజర్

పెప్లం బ్లేజర్

ఇది బ్లేజర్ల ట్రెండ్లో నడిచే స్టైల్ ను అందంగా కొత్తరకంగా మలచిన ఒక రకం. పెప్లం బ్లేజర్లకి కింద పెప్లం ఆకారంలో వంపు ఉండి దాన్ని చాలా చాలా అందంగా కన్పించేలా చేస్తుంది. మీకు బ్లేజర్లు ప్రాణమైతే, మీకు ఇదొకటి తప్పక ఉండాలి.

డెనిమ్ బ్లేజర్లు

డెనిమ్ బ్లేజర్లు

లేసు బ్లేజర్లలాగానే, డెనిమ్ బ్లేజర్లు కూడా ఉన్నాయి. ఇవి డెనిమ్ లేదా ఛాంబ్రే చొక్కాలు మిమ్మల్ని క్యాజువల్ గా ఎలా చూపిస్తాయో, డెనిమ్ లేదా ఛాంబ్రే బ్లేజర్లు మిమ్మల్ని ఫార్మల్ గా కన్పించేట్టు చేస్తాయి. అందుకని మీకు ఛాంబ్రే ఇష్టమయి, ఫార్మల్స్ వేసుకోటం కూడా ప్రాణమైతే, ఈ రకం కొనుక్కోండి మీకు నచ్చితీరుతుంది.

టక్సెడో లేదా బ్లేజర్ డ్రస్

టక్సెడో లేదా బ్లేజర్ డ్రస్

బ్లేజర్లు పూర్తి లేదా మధ్యమ సైజుల్లో వస్తాయి మరియు డ్రస్ రూపంలో కూడా ఉంటాయి. ఈ లుక్ మీకు సెక్సీ మరియు క్లాసీ ఫీల్ ను ఇస్తుంది. అందుకని దీన్ని మీరు మీ ఆఫీసు పార్టీలు, సమావేశాలు లేదా ఏదైనా ఫార్మల్ కార్యక్రమానికి ఎంచుకోవచ్చు.

ఈ బ్లేజర్లన్నిటినీ ప్రయత్నించి మీ సర్కిల్ లో ఫార్మల్ స్టైల్ కి ఐకాన్ గా మారిపోండి.

అయితే, ఇంకా దేని కోసం ఎదురుచూస్తున్నారు?

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    Read more about: women fashion fashion
    English summary

    Types Of Blazers For Women

    Formals and blazers go hand-in-hand and if you hear people saying that men can impress a girl with his formal style book, you are following the wrong people. From the list of the basic things every woman should possess in their wardrobe, we have listed down the different types of blazers you MUST have.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more