For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  జీ–తెలుగు 2018 అప్సర అవార్డ్స్ వేడుకల్లో దివాస్ దుస్తులలో మెరిసిన అందాల తారలు

  |

  సౌత్ ఇండియా అందాల తారలకు మరోసారి చూపరుల కళ్ళు జిగేల్ అనిపించేలా రెడ్ కార్పెట్ పరచింది జీ-తెలుగు అప్సరా అవార్డ్స్-2018. ఈ మిరుమిట్లు గొలిపే వేదికపై ప్రదర్శించిన అనేక ప్రదర్శనలు ఆహాఓహో అరుపులతో చూపరులను విస్మయంలో ముంచెత్తాయి. ప్రత్యేకించి డిజైన్ చేయబడిన శారీల నుండి కళ్ళు తిప్పుకోలేని సపరేట్స్ వరకు అనేక రకాల ఫాషన్ దుస్తులకు వేదికై, హీరోయిన్ల అందాలతో నక్షత్రాలు నిండిన రాత్రికి మరింత అందాన్ని జోడించినట్లైoది.

  ఇండస్ట్రీలో గొప్ప బహుమతుల కార్యక్రమాలలో ఒకటైన అయిన జీ-తెలుగు అప్సరా అవార్డ్స్-2018 వేదికపై తళుక్కుమన్న తారల గురించి ఒక లుక్కేద్దాం

  The Best Dressed Divas from Zee Telugu Apsara Awards 2018

  తాప్సీ పన్ను:

  అందాల తాప్సీని ఈ సంవత్సరం “ఎంటర్టైనర్ ఆఫ్ ది యియర్” అవార్డ్ వరించింది. ఈ వేదికపై ప్రేక్షకుల చేత వావ్ అనిపించే, వరుణ్ బాల్ డిజైన్ చేసిన ప్రత్యేకమైన దుస్తులలో కనువిందుచేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . పింక్ సినిమాలో తన ప్రతిభను వెలికితీసి బాలీవుడ్లో చెరగనిముద్ర వేసుకున్న తాప్సీ, ఎంబ్రాయిడ్ చేసిన సాల్మన్-పింక్ ఫుల్లీ స్లీవ్డ్ దుస్తులలో అంచువద్ద ప్లీట్(దగ్గరికి చేర్చి కుట్టిన క్లాత్) చేయబడిన స్ట్రక్చరల్ దుస్తులను ధరించింది. మరియు వైన్ రంగులోని లిప్ షేడ్ తో, డైమండ్ చెవిరింగులతో, మద్య పాపిటి హెయిర్ స్టైల్ కూడుకుని ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది.

  శ్రుతి హాసన్:

  తర్వాతి వరుసలో ఉన్న మన “ఐస్ ఐస్ బేబీ” శృతిహాసన్ డిజైనర్ పల్లవీమోహన్ రూపొందించిన, ఐస్ బ్లూ మరియు సిల్వర్ రంగుల మేళవింపుతో, సూక్ష్మంగా పింక్ టచ్ ఉన్న గౌన్ ధరించి అభిమానులకు సరికొత్త అందాన్ని పరిచయం చేసింది. అసమానమైన అబ్బురపరచే కాఫ్టన్ స్టైల్డ్ స్లీవ్స్ కలిగి ఉన్న ఆ గౌన్ చూపరుల దృష్టిని మరల్చనీయకుండా చేసింది, మరియు బుజానికి ఒకవైపుగా జాలువారినట్లు ఉన్న హెయిర్ స్టైల్ మరింత అందాన్ని పెంచింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఇంత అందమైన గౌన్లో మరింత అందంగా ఇమిడిపోయిన శ్రుతిహాసన్ “ఐకానిక్ యాక్ట్రెస్ డికేడ్”(దశాబ్దపు ఉత్తమనటి) అవార్డును గెల్చుకున్నారు.

  The Best Dressed Divas from Zee Telugu Apsara Awards 2018

  తమన్నా భాటియా:

  బాహుబలిలో తన అసమాన ప్రతిభా పాటవాలను చాటిన తమన్నా భాటియా, ఈ జీతెలుగు అప్సరా అవార్డ్స్-2018 లో భాగంగా “శ్రీదేవి అవార్డు” ను కైవసం చేసుకుంది. ఇక దుస్తులపరంగా శారీలకు, గౌన్స్ కు భిన్నంగా డిజైనర్ అనామికాఖన్నా రూపొందించిన సపరేట్స్ లో తళుక్కుమంది. పూల డిజైన్ తో అలంకరించిన సల్ట్రీ క్రాప్ టాప్, అదే కలయికలోని ప్లాజూ పాంట్ మరియు టాప్ పైన మ్యూటెడ్ గోల్డ్ ఫ్లోర్ లెంగ్త్ జాకెట్ ధరించి ఆకర్షణీయంగా కనిపించింది. తద్వారా సపరేట్స్ కు గ్లామర్ టచ్ ఇచ్చిన అనుభూతి కలిగింది. న్యూడ్ మేకప్ ద్వారా ముఖాన్ని ఎంతో ఆకర్షణీయంగా ఉంచేలా చేయడంలో తమన్నా కేర్ తీసుకుందనే చెప్పవచ్చు.

  కాజల్ అగర్వాల్:

  ఎక్కువగా ఆన్–స్క్రీన్ పై సాంప్రదాయిక దుస్తులకే అత్యధిక ప్రాదాన్యతనిచ్చే కాజల్ అగర్వాల్, రొటీన్ కి భిన్నంగా ఆఫ్ స్క్రీన్ లో ఫాషన్ ఐకాన్ లా కనిపిస్తుంది. అదేవిధంగా జీ-తెలుగు అప్సరా అవార్డ్స్-2018 కార్యక్రమంలో భాగంగా స్టైలిష్ బ్లాక్ కలర్ శారీలో అబ్బురపరచే విధంగా కనిపించి ప్రేక్షకుల మతులు పోగొట్టింది. అబూ జానీ మరియు సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన ప్లంగింగ్ వీ షేప్ నెక్ లైన్ తో, ఎటువంటి జ్యూవలరీని నెక్ లైన్ వద్ద ధరించకుండా మరియు అందంగా తీర్చబడిన అంచులతో కూడిన శారీ ధరించి కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరియు ఉత్తమ నటి అవార్డును కైవసం చేసుకుంది.

  The Best Dressed Divas from Zee Telugu Apsara Awards 2018

  మెహ్రీన్ పిర్జాడా:

  ఈ సంవత్సరo “ ట్రెండ్సెట్టర్ ఆఫ్ ది యియర్” అవార్డును కైవసం చేసుకున్న మెహ్రీన్, కార్యక్రమానికి కూడా డిజైనర్ నిఖిల్ థంపి రూపొందించిన ట్రెండ్ సెట్ చేసే దుస్తులతో హాజరై వేదికనే షేక్ చేసింది. ఈ వన్ షౌల్డర్ లెమన్-ఎల్లో దుస్తులలో మిలియన్ డాలర్ బేబీ లా కనిపించింది. మెహ్రీన్ ధరించిన బాన్డేజ్ ఇన్స్పైర్డ్ , గోల్డెన్ డాంగ్లర్స్ కలిగిన సాన్డల్స్ ప్రత్యేక ఆకర్షణగా కనిపించాయి.

  English summary

  The Best Dressed Divas from Zee Telugu Apsara Awards 2018

  The glitterati from the South Indian film industry once again descended on the pink carpet and wowed us with their looks at Zee Telugu's Apsara Awards 2018. The divas looked amazeballs as they rocked their stunning ensembles with a lot of oomph and aplomb. From sartorial saris to striking separates, here's a round-up of the starlets, who stole the limelight
  Story first published: Monday, April 30, 2018, 15:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more