For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదిరిపోయే ఫీచర్లతో రానున్న ఒప్పో ఎఫ్ 9 ప్రో స్మార్ట్ ఫోన్

By Deepthi
|

సాంకేతికత,స్టైల్ కలయిక ఎలా ఉంటుందో చూడాలనివుందా? అయితే ఒప్పో ఎఫ్ 9 ప్రో కోసం వేచిచూడండి. ఇంటర్నెట్ లో మంచి స్మార్ట్ ఫోన్ల కోసం సెర్చ్ చేసినప్పుడు మీకు ఒక పెద్ద లిస్టు కనపడుతూ ఉంటుంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోనులు మరింత స్మార్ట్ గా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

అయితే ప్రస్తుతం ఉన్న మీ ఫోన్ ను మార్చి మీరు ఏ కొత్త ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారని అడిగితే అందరూ కాస్త గందరోగోళానికి గురవుతారు. ఎందుకంటే మార్కెట్లో ఉన్న ఫోన్లలో ఏది తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి.

OPPO F9 Pro

త్వరలో మార్కెట్లోకి ఒప్పో ఎఫ్ 9 ప్రో

ఫోను కేవలం లోపలనుంచి స్మార్ట్ గా ఉండటమే కాదు, బయట కూడా అందంగా కన్పించాలి. మనందరికీ మన జీవనశైలితో కలిసిపోయే, అందరికన్నా ఫ్యాషనల్లో మేటిగా కన్పించే స్మార్ట్ ఫోన్ కావాలి.

అందుకే ఒప్పో తాజాగా ఒప్పో ఎఫ్ 9 ప్రో ప్రకటించి మార్కెట్లోకి విడుదల చేయబోతోంది.

సరికొత్త టెక్నాలజీ, అద్భుతమైన ఫ్యాషన్ స్టేట్ మెంట్ ల చక్కని కలయికతో ఈ ఫోన్ రానుంది. ఒప్పో తన రాబోయే ఒప్పో ఎఫ్ 9 ప్రో ఎలా ఉండబోతోందో టీజర్లు విడుదల చేసింది. వాటిని చూస్తే తెలుస్తుంది ఈ ఫోన్ ఎంత బాగుండనుందనే విషయం.

ఒప్పో వారి ప్రత్యేక, నియోటెరిక్ సాంకేతికత లోపల, బయట వైబ్రంట్ గా ఉండే రంగులతో ఈ ఫోన్ ఉండనుంది. ఈ సంపూర్ణమైన స్మార్ట్ ఫోన్ అన్ని రకాలుగా సూపర్బ్ గా ఉంటుంది. అంతేకాదు అందమైన సెల్ఫీలను కూడా తీసుకోవొచ్చు. ఈ విషయంలో ఒప్పో ఎఫ్9 ప్రో ఒక పూర్తి ప్రామిస్ చేస్తోంది. ఒప్పో ఎఫ్ 9 ప్రో గురించి మరింత తెలుసుకోవాలని ఆత్రంగా ఉందా? మీకోసమే ప్రత్యేకంగా వాటిని అందిస్తున్నాం. చదవండి. ఒప్పో ఎఫ్9 ప్రో, వివరంగా తెలుసుకోండి.

ఆగస్టులో విడుదలవ్వబోతున్న ఒప్పో ఎఫ్ 9 ప్రో ఇప్పటికే చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో తన ప్రత్యేక వాటర్ డ్రాప్ డిస్ప్లే తో ఉత్సుకతను పెంచింది. దీనిలో 90.8శాతం స్క్రీన్ బాడీ నిష్పత్తితో పైన ఆకారం నీటి చుక్క రూపంలో అందంగా మెరిసిపోతుంది. ఎంత క్లాసీగా ఉంటుందో ఊహించండి. అంతేకాదు, ఇంకా చాలా ఉన్నాయి.

ఒప్పో ఎఫ్ 9 ప్రో ఐదు దశల రక్షణతో కూడిన 3500 ఎంఎహెచ్ ఎఐ బ్యాటరీ, ఒప్పో వారి విఓఓసి ఫ్లాష్ ఛార్జ్ శక్తితో వస్తోంది.

విఓఓసి ఫ్లాష్ ఛార్జ్ అంటే ఏంటని ఆశ్చర్యపోతున్నారా? సరే మీకోసం సింపుల్ గా వివరిస్తాం. ఒప్పో ఎఫ్ 9 ప్రో లో కేవలం ఐదు నిమిషాలు ఛార్జింగ్ చేస్తే రెండు గంటలపాటు ఫోన్ లో ఆపకుండా మాట్లాడుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పనితీరును మీరే ఊహించుకోండి.ఇవన్నీ కాక, ఒప్పోవారి మేటి డ్యుయల్ కెమెరా ఫీచర్లతో ఎఫ్ 9ప్రో అద్భుతమైన ఫోటోలు,సెల్ఫీలు అందిస్తుంది.

OPPO F9 Pro

కానీ ఒప్పో ఎఫ్ 9ప్రో టెక్నికల్ ప్రత్యేకతలు అంత గొప్ప ఆదరణ పొందట్లేదు. ఈ స్మార్ట్ ఫోన్ రంగు, మొత్తం ఫోన్ డిజైన్ మిగతావాటికన్నా ప్రత్యేకంగా ఉండి ఆకట్టుకుంటోంది. అనేక కొత్త సాంకేతిక ఆవిష్కరణలతో,కొత్త రంగుల షేడ్లతో ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు వస్తున్న స్మార్ట్ ఫోన్లు అన్నిటికన్నా ప్రత్యేకంగా,కొత్తగా కన్పిస్తోంది.

మెరిసే ఊదా రంగు, సూర్యాస్తమయ ఎరుపు, వెన్నెల నీలిరంగు- అన్నీ ఆహ్లాదకరమైన పాటర్న్స్ లో.అదనంగా, ఎరుపు,నీలి రంగుల ఫోన్లకి వెనకవైపు డైమండ్ ఆకారపు పాటర్న్స్ వస్తాయి, అలాగే ఊదారంగు దానికి రాత్రి ఆకాశాన్ని సూచించేవిధంగా వెనకవైపు నక్షత్రాల డిజైన్ వస్తుంది.

మేము కూడా ఈ రాబోయే ఒప్పో ఎఫ్ 9 ప్రో, ఈ సెల్ఫీ నిపుణులైన సంస్థవారి నుంచే వచ్చే, స్టైల్, సాంకేతికత కలిసిన అద్భుతమైన కలయిక అని విశ్వసిస్తున్నాం. కొత్త ఒప్పో ఎఫ్9 ప్రోలో ఫ్యాషన్, టెక్నాలజీ ఒక అద్భుతమైన కలయికలో రాబోతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ తో,64 జిబిల రామ్ తో ఆగస్టు 21న విడుదల కాబోతుంది. మీరు సిద్ధంగా ఉన్నారా?

Read more about: oppo
English summary

Oppo F9 Pro Price in India, Release Date, Specifications and features

Fashion and technology is now going to find its seamless blend with the new OPPO F9 Pro.The smartphone is going to launch on 21st August with 6GB RAM and 64GB ROM.The F9 Pro will come in 3 basic color variants-Starry Purple, Sunrise Red and Twilight Blue-all in soothing gradient patterns.Are you ready?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more