కత్రినా కైఫ్ నుండి కరణ్ జోహార్ వరకు, ఎవరెవరు సోనమ్ సంగీత వేడుకలో సందడి చేసారు?

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

సోనమ్ కపూర్ మరియు ఆనంద్ ఆహూజాల వివాహానికి ముందు జరిగే వేడుకలు ఉత్సాహంతో ఊపందుకున్నాయి. నిన్న వారి జుహూ బంగ్లాలో జరిగిన మెహెంది ఫంక్షన్లో కేవలం కుటుంబ సభ్యులు మరియు ఆప్త మిత్రులైన కరణ్ జోహార్ మరియు రాణీ ముఖర్జీ వంటి వారే పాలు పంచుకున్నారు.

ఈ రోజు జరిగిన సంగీత వేడుకకు బాలీవుడ్ ప్రముఖులందరూ హాజరయ్యి , ఆనందం మరియు ఆహ్లాదం పాళ్ళను ఆకాశమంతా ఎత్తుకు తీసుకెళ్ళారు. ముంబైలోని సన్ టెక్ సిగ్నేచర్ ఐలాండ్ లో జరిగిన ఈ సంబరంలో, మీ అభిమాన బాలీవుడ్ తారలంతా వెలుగు జిలుగులతో విస్తుగోలిపే దుస్తులలో సందడి చేసారు.

Katrina To Karan Johar: Who Are Dazzling At Sonam’s Sangeet

కత్రినా కైఫ్ పువ్వుల అప్లిక్ వర్క్ కలిగిన ఆధునిక సంప్రదాయ మేళనలతో సృష్టించిన దుస్తులలో చూపరులకు ఊపిరి సలపనివ్వలేదు. ఆమె సోదరి ఇసబెల్లా మెరిసే దంతం రంగు స్కర్ట్ మరియు అందాలను కళ్ళ ముందే ఆరబోసే నీలిరంగు ట్యాంక్ టాప్ ధరించిది. అక్కాచెల్లెళ్ళిద్దరూ సోనమ్ తో కలిసి పోజులిస్తూ ఆహూతుల మది దోచుకున్నారు.

సోనమ్ చెల్లెళ్ళయిన జాహ్నవి మరియు ఖుషీల గురించి ఎంత చెప్పినా తక్కువే! తరుణ్ తహిల్యాని డిజైన్ చేసిన సంప్రదాయ దుస్తులలో అక్కాచెల్లెళ్ళిద్ద్దరూ తళుకులీనే తారలవలె మెరిసిపోయారు.

Katrina To Karan Johar: Who Are Dazzling At Sonam’s Sangeet

సోనమ్ ప్రాణస్నేహితురాళ్ళు కూడా ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. ఆమె స్నేహితురాలైన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అందమైన గ్రే మరియు తెల్లని ప్రింట్ కలిగిన లెహెంగాకు జతగా భుజానికి ఒకవైపు దుపట్టా ధరించి గారాలు పోయింది. సోనమ్ వలే ఈమె కూడా జుట్టును ముడిపెట్టి పూలను పెట్టుకుని హొయలు ఒలకబోసింది.

"వీర్ దీ వెడ్డింగ్" సినిమాలో ఆమె సహనటి అయిన స్వర భాస్కర్, మనీష్ మల్హోత్రా చేత డిజైన్ చేయబడిన పూల ప్రింట్ కలిగిన లెహెంగా ధరించి కెమేరాకు అలవోకగా ఫోజులిచ్చింది.

శిల్ప శెట్టి కుంద్రా పూల సరాగాలున్న సంప్రదాయ దుస్తులకు ఆధునిక సోబగులద్దింది. కరిష్మా కపూర్ మరియు రాణి ముఖర్జీ తెల్లని దుస్తులలో తమదైన శైలిని ప్రతిబింబిస్తూ దివినుండి భువికేగిన దేవకన్యల్లా కనిపించారు.

కరణ్ జోహార్ ప్రకృతి స్పూర్తితో డిజైన్ చేయబడిన షేర్వాణి ధరించి ఉత్సాహాన్ని పంచుతూ కనిపించారు. అర్జున్ కపూర్ నీలి వన్నెలున్న సంప్రదాయ దుస్తులలో తాజాదనాన్ని విరజిమ్ముతూ హడావిడి చేసాడు. సోనమ్ తండ్రి అయిన అనీల్ కపూర్ పూల డిజైన్ ఉన్న ఏనుగు దంతం రంగు బంద్ గలా షేర్వాణి ధరించి నిరాడంబరంగా కనిపించారు.

ఈ రంగరంగ వైభవంగా జరిగిన సంబరంలో పాలుపంచుకున్న వారిలో ఫరా ఖాన్, మొహిత్ మార్వా, అంత్రా మోతివాలా , వరుణ్ ధావన్, అనైత ష్రాఫ్ మరియు రేఖ కూడా ఉన్నారు.

English summary

Katrina To Karan Johar: Who Are Dazzling At Sonam’s Sangeet

The pre-wedding festivities of Sonam Kapoor and Anand Ahuja's wedding have kicked off with all the fervor and fanfare. Yesterday, at mehendi ceremony, her close family members and friends including Karan Johar and Rani Mukerji were seen taking part in the merrymaking at her Juhu residence.
Story first published: Tuesday, May 8, 2018, 13:30 [IST]