For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లి గౌన్ లో ఏంజెల్ లా దర్శనమిచ్చిన అమెరికన్ ప్రిన్సెస్ మేఘన్ మార్కెల్

|

రాల్ఫ్&రస్సో నుండి అలెగ్జాoడర్ మెక్.క్వీన్ వరకు గొప్ప గొప్ప డిజైనర్ల మేలుకలయికతో రూపొందుకున్నాయన్న ఊహాగానాలతో, మేఘన్ మార్కెల్ పెళ్లి దుస్తులు ఇంటర్నెట్లో ఒక ప్రభంజనం సృష్టిస్తున్నాయి. కానీ, జీవితంలో తనకు ఎంతో ముఖ్యమైన ఈ శుభదినాన, తాను ధరించే దుస్తుల ఎంపికలో పైన చెప్పిన డిజైనర్లను ఆశ్రయించలేదు మేఘన్.

వాస్తవానికి, ఈ 'సూట్స్' సినిమా నటి మేఘన్ మార్కెల్, గివెన్చీ నుండి సేకరించిన సాంప్రదాయక గౌన్ నే తన పెళ్ళికి ఎంచుకుంది. క్లేర్ వెయిట్ కెల్లెర్ రూపొందించిన ఈ ఐవరీ సిల్క్ (దంతపు రంగు పట్టు వస్త్రం) దుస్తులలో తన మామగారైన ప్రిన్స్ చార్లెస్ తో కలిసి నడుస్తూ దేవకన్యలా కనిపించి, చూపరుల కళ్ళను తిప్పుకోలేని విధంగా చేసింది. ప్రిన్స్ హారీ ని పెళ్ళిచేసుకున్న ఈ అందాల తార పెళ్ళికి సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ప్రపంచమంతా అతిధులయ్యారు అనడంలో ఆశ్చర్యమే లేదు. అంతగా ఆకట్టుకున్న జంటగా వీరు వార్తలకెక్కారు.

Wow! You Must See How Divine Meghan Markle Looks In Her Wedding Gown,Meghan Markle didn’t wear Ralph & Russo or Alexander McQueen. So, what did she wear?

ఆమె అందం ఒక అద్భుతం, జగమెరిగిన సత్యం. ఇక ఆ అందానికి తగ్గ దుస్తులు ధరిస్తే ?

ఆమె ధరించిన దుస్తులు సాంప్రదాయక దుస్తులకు ఆధునికత జోడించినట్లు ప్రత్యేకంగా కనిపిస్తూ ప్రజల మనసులో యువరాణిలా స్థానం సంపాదించుకుంది.

భుజానికి ఫ్రేమింగ్ తో కూడిన బాటౌ నెక్లైన్ కలిగి మరియు ఒక ఏ - లైన్ సిల్హౌట్ కలిగిన మేఘన్ మార్కెల్ దుస్తులు పరిపూర్ణతకు అద్దం పట్టేలా ఉన్నాయి అనడంలో ఆశ్చర్యమే లేదు. భారీ వివాహ దుస్తుల వలె కాకుండా, ఈ అద్భుతమైన దుస్తులు అన్ని విషయాలలోనూ మెప్పు పొందేలా తయారుచేయబడ్డాయి. క్లేర్, ఈ దుస్తులకు తులిప్ ఆకారాన్ని జోడించడం అద్భుతమనే చెప్పాలి. ఇది ఖచ్చితమైన ప్రేమకు తార్కాణంగా ఉంటుంది.

Wow! You Must See How Divine Meghan Markle Looks In Her Wedding Gown,Meghan Markle didn’t wear Ralph & Russo or Alexander McQueen. So, what did she wear?

ఆమె 16.5 అడుగుల పట్టు టుల్లె – వీల్, చేతితో ఎంబ్రాయిడరీ చేయబడి ఎంతో ఆకర్షణీయంగా నిలిచింది. ఈ వీల్ ప్రతి కామన్వెల్త్ దేశంలో ఉన్న విలక్షణమైన అందమైన పూలను సూచిoచేలా అనేకరకాల పూలతో రూపొందించబడింది. మరియు మేఘన్ ప్రత్యేకంగా తనకు ఇష్టమైన పూలైన, వింటర్ స్వీట్, కాలిఫోర్నియా పాప్పీ పూలను అదనంగా ఈ వీల్ లో జోడించమని డిజైనర్స్ ను కోరింది కూడా.

ఇక ఈ పెళ్ళికూతురు తలపాగా ఏమిటో తెలుసా ? క్వీన్ మేరీ యొక్క వజ్రపు తలపాగా. ఇక కళ్ళు తలపాగాపైకి వెళ్ళకుండా ఉంటాయా చెప్పండి.

Wow! You Must See How Divine Meghan Markle Looks In Her Wedding Gown,Meghan Markle didn’t wear Ralph & Russo or Alexander McQueen. So, what did she wear?

English summary

Wow! You Must See How Divine Meghan Markle Looks In Her Wedding Gown

Meghan Markle is a vision in her pristine white custom wedding gown by Givenchy. Designed by Clare Waight Keller, her ivory silk attire is simply elegant and we can't stop looking at Meghan as she is walking down the aisle with Prince Charles. Her heavenly attire perfectly blends modern with traditional and she definitely looks like a people's princess now.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more