పండ్ల రసాలు లేదా పండ్ల గుజ్జును చర్మ సౌందర్యానికి లేపనంగా..

By: Mallikarjuna
Subscribe to Boldsky

మారుతున్న కాలానికి అనుగుణంగా ముఖ అందాన్ని పరిరక్షించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా.. ఆయా కాలాల్లో లభ్యమయ్యే పండ్లలో లభ్యమయ్యే పోషకాలకు అనుగుణగా ముఖానికి ఫేస్ ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆరోగ్యం మొత్తానికి పండ్లు చాలా గ్రేట్. పండ్లు తినడం వల్ల మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, పండ్లను రెగ్యులర్ గా తినడం వల్ల శుద్దమైన చర్మం, మెరిసే చర్మాన్ని పెంపొందించుకోవచ్చు. పండ్లతో మీ ముఖానికి ఫేస్ మాస్క్, లేదా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇంకా ఫేస్ స్రబ్ గాను, టోనర్ గాను, క్లెన్సర్ గా కూడా పండ్లు బాగా ఉపయోగపడుతాయి. ఫ్రూట్ ఫేషియల్ గురించి మనందరం ఏదో ఒక సందర్భంలో వినే ఉంటాం లేదా చదివే ఉంటాం. ఫ్రూట్ ఫేషియల్ అంత కష్టమైన పనేం కాదు. జస్ట్ అనుసరించే పద్దతి వల్ల చర్మ శుభ్రపడే విధానం మరియు మాయిశ్చరైజ్ చేసే విధానం తెలుసుకుంటే చాలు. ఫ్రెష్ ప్రూట్స్ తో ఫేషియల్ చేసుకొన్నట్లే.

పండ్ల రసాలు లేదా పండ్ల గుజ్జును చర్మ సౌందర్యానికి లేపనంగా..

అందుకు నేచురల్ గా దొరికే పండ్లను ఉపయోగిస్తే చాలు.. ఇంట్లోటే ఫ్రూట్ ఫేషియల్ చేసేసుకోవచ్చు. అందుకు స్పా లేదా సలోన్ లకు వెళ్ళి కెమికల్ బేస్డ్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ తో అందాన్ని చెరుపుకొనే కొంటే ఇంట్లోనే సహజసిద్దంగా ఫ్రూట్ ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. కొన్ని ఆర్గానిక్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ కూడా అన్ని రకాల స్కిన్ టోన్ లకు సరిపోవు. కాబట్టి కొన్ని సింపుల్ ఫ్రెండ్లీ ఫ్రెష్ ఫ్రూట్స్ తో ఇంటి వద్దే ఫేషియల్ చేసుకోవచ్చు.

ముఖం అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి బనానా ఫేస్ ప్యాక్ రిసిపిలు

అరటి :

అరటి :

ముఖానికి రిఫ్రెషనస్ బనానా అరటిపండును చర్మ సంరక్షణ గ్రేట్ మాయిశ్చరైజర్ అని చెప్పవచ్చు. బనానా మాయిశ్చరైజర్ తో ముఖానికి రిఫ్రెషనస్ వస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది. అరటి పండుతో వేసుకొనే ఫేస్ ప్యాక్ ల వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.

బాగా పండిన బానానాకు ఆలివ్ ఆయిల్, రోజ్ వాటర్, కోకో బాటర్ కలిపి ఫేస్ ప్యాక్ వేసుకొని తర్వాత పాలు లేదా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే మెరిసే, తాజా చర్మం మీ సొంతం అవుతుంది.

చర్మంను కాంతివంతంగా మార్చే విటమిన్ సి ఫ్రూట్ ఫేస్ ప్యాక్

పుచ్చకాయ:

పుచ్చకాయ:

జ్యూసీ వాటర్ మెలోన్ ఒక మంచి రెడ్ ఫ్రూట్. ఇది ఆరోగ్య పరంగానే కాదు, సౌందర్య పరంగా కూడా ఎక్కువ మేలు చేస్తుంది. పుచ్చకాయను ముక్కలుగా కట్ చేసి ముఖం మీద మసాజ్ చేయాలి. తడి ఆరిన తర్వాత మరో తాజా ముక్కను తీసుకొని మల్లీ మసాజ్ చేయాలి. ఇలా మూడు నాలుగు సార్లు చేసిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దాంతో చర్మం శుభ్రపడటమే కాదు కాంతివంతంగా మారుతుంది.

స్ట్రాబెర్రీ:

స్ట్రాబెర్రీ:

చర్మ సంరక్షణకు ఉపయోగించదగ్గ ఒక బెస్ట్ రెడ్ ఫ్రూట్ ఇది. స్ట్రాబెర్రీ చర్మం మెరిసేలా చేస్దుంది. స్ట్రాబెరీ ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అరకప్పు స్ట్రాబెరీలను మెత్తగా పేస్ట్ చేసి, అందులో సోర్ క్రీమ్ ను మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేసి 10-15నిముషాలు అలాగే ఉంచి , తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల , ఇది చాలా ప్రభావవంతంగా మొటిమలను నివారిస్తుంది.

దానిమ్మ:

దానిమ్మ:

ఎరన్ని ముదురు రంగు పండ్లలో దానిమ్మ ఒకటి. దీన్ని హోం మేడ్ ఫేస్ ప్యాక్ గా ఉపయోగించుకోవచ్చు. ఒక కప్పు దానిమ్మ గింజలను పేస్్ట చేసి 3/4కప్పు క్రీమ్ మిక్స్ చేసి ముఖం, మెడ కు అప్లై చేయాలి. ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత 20నిముషాలు అలాగే ఉండి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ఆయిల్ స్కిన్ తొలగిపోతుంది. చర్మం ప్రకాశవంతంగా క్లియర్ గా ఉంటుంది.

యాపిల్స్:

యాపిల్స్:

ముఖ చర్మంలో అన్ని రకాల సమస్యలను నివారించడంలో రెడ్ ఆపిల్ చాలా బెస్ట్. మీ ముఖంలో స్కార్స్ ఉన్నట్లైతే, ఆపిల్ ఫేస్ మాస్క్ తో చెక్ పెట్టవచ్చు. పొట్టుతో సహా ఆపిల్ ముక్కలను మెత్తగా పేస్ట్ చేసి, ఒక స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. తడి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

జిడ్డుగా ఉన్న ముఖాన్ని కాంతివంతంగా మార్చే ఫ్రూట్ ప్యాక్స్....!

కర్బూజ:

కర్బూజ:

మెలోన్ ఫ్యామిలికి చెందిన కర్బూజ చర్మ సంరక్షణకు గొప్ప వరం వంటిది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి అధికంగా ఉండే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. కర్బూజ తొక్క తీసి ముక్కలు చేసి పేస్ట్ చేయాలి. తర్వాత ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.

ద్రాక్ష:

ద్రాక్ష:

స్కిన్ కేర్ కు రెడ్ గ్రేప్ అద్భుతంగా పనిచేస్తుంది. రెడ్ గ్రేప్ జ్యూస్ ను టీజోన్ ప్రదేశంలో అప్లై చేయవచ్చు. దాంతో ముఖంలో జిడ్డు వెంటనే తొలగిపోతుంది. దాంతో ముఖంలో నల్లటి వలయాలు, చారాలను తొలగించుకొని వయస్సు పైబడకుండా కనబడేలా చేస్తుంది.

పైనాపిల్:

పైనాపిల్:

పైనాపిల్లో న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి మొటిమలు, మచ్చలను , వ్రాట్స్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . బ్లాక్ స్పాట్స్ మరియు ఇతర మచ్చలను తొలగిస్తుంది. పైనాపిల్లోని విటమిన్ ఎ స్కిన్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

పైనాపిల్ ముక్కలు చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. దీన్ని మొటిమలు మచ్చలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

English summary

Fruits For Skin | Fruits To Apply On Skin | How To Use Fruits On Skin

Get smooth and soft skin now using these fruits directly on your skin in a pureed or juice form.
Story first published: Sunday, July 23, 2017, 14:00 [IST]
Subscribe Newsletter