Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
బ్రేక్‌ఫాస్ట్ మానేసి పండ్లే తింటున్నారా? లాభాలు, నష్టాలు తెలుసుకున్నాకే తినండి
ఉదయం పూట అల్పాహారం చేయడం, చేయకపోవడంపై భిన్నమైన వాదనలు వినిపిస్తుంటాయి. కొందరు ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ చేయాలని అంటారు. మరికొందరేమో బరువు తగ్గడానికి అల్పాహారం మానేయాలని చెబుతుంటారు.
కొందరు ఉదయం అల్పాహారానికి బదులు ఆరోగ్యకరమైనవే కదా అని పండ్లు తినేస్తుంటారు. బ్రేక్‌ఫాస్ట్‌కు బదులు రకరకాల పండ్లు తినేస్తుంటారు. అయితే ఇలా అల్పాహారానికి బదులు పండ్లు తినడం వల్ల లాభాలు, నష్టాలూ రెండూ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్పాహారానికి బదులు పండ్లు తినడం వల్ల ప్రయోజనాలు:
పుష్కలమైన పోషకాలు:
పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే పండ్లు తినడం ద్వారా ఈ పోషకాలు శరీరానికి అందుతాయి.
హైడ్రేషన్:
పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పండ్లు తినడం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవచ్చు. పండ్లలోని పోషకాలు జీర్ణక్రియకు తోడ్పడతాయి.
తక్కువ కేలరీలు:
పండ్లలో కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడానికి పండ్లు గొప్ప ఎంపిక.

అల్పాహారం తినకపోవడం వల్ల నష్టాలు:
తక్కువ శక్తి:
అల్పాహారం తినకపోవడం వల్ల కార్బోహైడ్రేట్లు శరీరానికి అందవు. శరీరానికి శక్తిని ఇవ్వడంలో వీటి పాత్ర కీలకం.
ఆకలి పెరుగుతుంది:
అల్పాహారం తినకపోవడం వల్ల రోజంతా ఆకలి వేస్తుంది. దీని వల్ల పగటిపూట ఎక్కువ తినడం, బరువు పెరగడం జరుగుతుంది.
పోషకాహార లోపం:
అల్పాహారం మానేయడం వల్ల పోషకాల లోపం ఏర్పడుతుంది. పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటే, పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, అవి సమతుల్య ఆహారంలా అన్ని పోషకాలను అందించలేవు.
బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోతాయి:
సరైన అల్పాహారంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, ఫైబర్, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ అన్నీ ఉంటాయి. రాత్రి దాదాపు 7-9 గంటల ఉపవాసాన్ని బ్రేక్ చేస్తుంది. నిద్రలేచిన తర్వాత చేసే మొదటి భోజనం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉండొచ్చు. ఉదయం పూట అల్పాహారం మానేసి పండ్లు మాత్రమే తింటే, రక్తంలో చక్కెర స్థాయిలు స్వల్పంగా తగ్గుతాయి. ఎందుకంటే శరీరానికి పిండి పదార్థాల నుండి వచ్చే గ్లూకోజ్ రాదు కాబట్టి.
బరువు పెరగడానికి దారితీస్తుంది:
ఉదయంపూట అల్పాహారం తినడం మానేసి కేవలం పండ్లు మాత్రమే తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు పెరుగుతాయి. ఉదయం పూట పండ్లు మాత్రమే తినడం వల్ల రోజంతా ఆకలిగా అనిపిస్తుంది. దీని వల్ల పగటి పూట లేదా రాత్రి పూట ఎక్కువగా తినేస్తుంటారు.
మలబద్ధకం రావొచ్చు:
పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అయితే అల్పాహారాన్ని వదిలేసి కేవలం పండ్లు మాత్రమే తినడం వల్ల మలబద్ధకం రావొచ్చు. కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు కడుపులో పెద్ద మొత్తంలో ఏర్పడటానికి దారితీస్తాయి. దీని వల్ల మలబద్ధకం సమస్య తలెత్తుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications