For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిస్: రక్తంలో షుగర్ లెవల్స్ ను వెంటనే తగ్గించే మెంతులు, దాల్చిన చెక్క, కలబంద...

డయాబెటిస్: రక్తంలో షుగర్ లెవల్స్ ను వెంటనే తగ్గించే మెంతులు, దాల్చిన చెక్క, కలబంద...

|

డయాబెటిస్ ఉన్న వారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించికో గలిగితే ప్రయోజనం పొందవచ్చు. టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారికి మరియు ఇప్పుడిప్పుడే మధుమేహ లక్షణాలు ఉన్నవారికి వెంటనే కంట్రోల్లో వచ్చే కొన్ని ఇన్ స్టాంట్ మందులు ఉన్నాయి.

మీకు డయాబెటిస్ ఉంటే మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చాలా ముఖ్యం. గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే ఆహారాలను తినడం లేదా స్వీట్స్, సాప్ట్ డ్రింక్స్ , కొన్నిరకాల ఆహారాలు తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. అదనపు గ్లూకోజ్‌ను భర్తీ చేయడానికి ఇన్సులిన్ అవసరం అవుతుంది.

10 Supplements Which Can Lower Blood Sugar Levels Instantly

మీ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమద్దంగా ఉంచడం వల్ల మీ మొత్తం ఆరోగ్యం మరియు ఎనర్జీ పొందడానికి సహాయపడుతుంది. తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగిన ఆహారాలతో సహా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం ద్వారా సహజంగానే చక్కెర స్థాయిలను క్రమబద్దం చేసుకోవచ్చు.

మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి

మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి

మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మీరు తాజా పండ్లు మరియు కూరగాయలు మరియు సంక్లిష్ట పిండి పదార్థాల ఎంపిక చేసుకుని తీనడం మంచిది. కానీ డయాబెటిస్ ఉన్నవారు తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఆ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సప్లిమెంట్స్ తీసుకోవడం సహాయపడుతుంది. ఇటువంటి మందులు టైప్ 2 డయాబెటిస్ మరియు ప్రీ-డయాబెటిస్ ఉన్న రోగులకు ప్రయోజనం చేకూరుస్తాయి.

రక్తంలో చక్కెరను తగ్గించడానికి

రక్తంలో చక్కెరను తగ్గించడానికి

రక్తంలో చక్కెరను తగ్గించడానికి డయాబెటిస్‌ మందులతో పాటు ఆయుర్వేద ఔషధాలు తీసుకోవడం వల్ల ఆ చక్కర స్థాయిల పరిమాణాన్ని తగ్గించవచ్చు. అయితే, మందులను పూర్తిగా సప్లిమెంట్లతో భర్తీ చేయలేమని గమనించాలి. ఈ వ్యాసంలో మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడే కొన్ని సప్లిమెంట్ల గురించి మేము చెప్పబోతున్నాము..

ప్రొబయోటిక్స్ :

ప్రొబయోటిక్స్ :

ప్రోబయోటిక్స్ శరీరంలో జీర్ణక్రియ, జీవక్రియ మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే అనేక ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను ప్రోబయోటిక్స్ అందిస్తాయి. మీ ఆహారంలో తగినంత ప్రోబయోటిక్స్ చేర్చడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. పెరుగు, సౌర్క్క్రాట్, కొంబుచా, మరియు కేఫీర్ ప్రోబయోటిక్స్ మూలాలు. వీటిని రెగ్యులర్ డైట్ లో తీసుకోవచ్చు.

జిమ్నెమా సిల్వెస్ట్ర్

జిమ్నెమా సిల్వెస్ట్ర్

ఇది భారతదేశంలోని ఉష్ణమండల అడవులలో పెరుగుతుంది. ఈ మొక్క ఆకులు ఇన్సులిన్ స్థాయిని పెంచడానికి మరియు గ్లూకోజ్ శోషణను తగ్గించడానికి సహాయపడతాయి, తద్వారా శరీరంలోని చక్కెర స్థాయిలను పరిమితం చేస్తుంది.

దాల్చిన

దాల్చిన

దాల్చిన చెక్క సప్లిమెంట్లను దాల్చినచెక్క పొడి లేదా దాల్చిన చెక్క సారం నుండి తయారు చేస్తారు. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువ చేసే గుణాలు దాల్చినచెక్కలో ఉంటాయి. ఈ సప్లిమెంట్ శరీరంలోని కణాలు ఇన్సులిన్ కోసం బాగా సహకరించేలా చేస్తుంది. ఇది కణాలలో చక్కెరను అనుమతిస్తుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో దాల్చినచెక్క సహాయపడుతుంది.

కలబంద

కలబంద

కలబంద (అలోవెరా) రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే లక్షణాలను కలిగి ఉంది. అలోవెరా ఆకుల నుండి తయారైన మందులు రక్తంలో చక్కెరను వేగంగా తగ్గించటానికి సహాయపడతాయి. ప్యాంక్రియాటిక్ కణాలలో ఇన్సులిన్ ఉత్పత్తిని అలోవెరా ప్రేరేపిస్తుందని తేలింది.

విటమిన్ డి

విటమిన్ డి

టైప్ -2 డయాబెటిస్‌కు విటమిన్ "డి" లోపం ప్రమాదకరం. విటమిన్ "డి" సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా సెల్యులార్ కదలికను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ మెరుగైన కదలిక ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది మరియు శరీరం యొక్క ఇన్సులిన్ సహకారాన్ని పెంచుతుంది.

మెగ్నీషియం

మెగ్నీషియం

టైప్ -2 డయాబెటిస్ ఉన్న చాలా మందిలో మెగ్నీషియం లోపం సాధారణం. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించని వ్యక్తులకు మెగ్నీషియం లోపం కూడా సాధారణం. మెగ్నీషియం మందులు తీసుకోవడం శరీర కణజాలాలలో ఇన్సులిన్ స్రావం మరియు ఇన్సులిన్ పనితీరును సాధారణీకరించడానికి సహాయపడుతుంది.

క్రోమియం

క్రోమియం

శరీరంలో క్రోమియం లోపం కార్బోహైడ్రేట్లను శక్తి చక్కెరలుగా మార్చే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ అవసరాన్ని పెంచుతుంది. క్రోమియం మందులు ఇన్సులిన్ ప్రభావాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి ఇన్సులిన్ స్రావం మరియు ప్యాంక్రియాటిక్ కణాలకు సహాయపడతాయి.

ఆల్ఫా లిపోయిక్ ఆమ్లం

ఆల్ఫా లిపోయిక్ ఆమ్లం

ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనేది కొవ్వు మరియు నీటిలో కరిగే యాంటీఆక్సిడెంట్, ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్ పై దాడి చేయడం ద్వారా అవయవాలు మరియు కణజాలాలను రక్షిస్తుంది. రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడానికి, ఆల్ఫా లిపోయిక్ ఆమ్లం గ్లూకోజ్‌ను శక్తిగా మారుస్తుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణీకరిస్తుంది.

మెంతులు

మెంతులు

మీరు నమ్మినా, నమ్మకపోయినా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మెంతులు నిజంగా సహాయపడతాయి. ఇది మీ జీర్ణక్రియను మరియు కార్బోహైడ్రేట్ల సాంద్రతను తగ్గించడం ద్వారా శరీరంలోని చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. అధిక మొత్తంలో అమైనో ఆమ్లాల ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రారంభించవచ్చు. మెంతి విత్తనాలు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.

బెర్బెర్ మొక్క

బెర్బెర్ మొక్క

బెర్బెరిన్ (బెర్బెరిన్) ఒక మూలిక, చేదు రుచుల మిశ్రమం. ఇది గోల్డెన్‌సీల్ మరియు ఫెలోడెండ్రాన్ వంటి మొక్కల మూలాలు మరియు కాండం నుండి తీసుకోబడుతుంది. డయాబెటిస్‌ ఉన్న వారు బెర్బరిన్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. బెర్బెరిన్ ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది.

English summary

10 Supplements Which Can Lower Blood Sugar Levels Instantly

here we are talking about the food Supplements Which Can Lower Blood Sugar Levels Instantly.
Story first published:Friday, November 8, 2019, 13:07 [IST]
Desktop Bottom Promotion