For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అధిక బరువుతో వచ్చే షుగర్ వ్యాధి!

By B N Sharma
|

Obes
నేటి రోజుల్లో చిన్న వయసులోనే అధిక బరువు సంతరించుకోవటానికి సాధారణంగా మనం అనేక పదార్ధాలలో వాడుతున్న షుగర్ వంటి తీపి పదార్ధాలు. ఫ్రక్టోస్ అధికంగా తీసుకుంటే లెప్టిన్ నిరోధకత తగ్గుతందని, ఈ చర్య అధిక ఫ్యాట్ లేదా హై కేలరీ ఆహారాలతో కలసి అధిక బరువు సంతరించుకునేలా చేస్తోందని, అధిక బరువు కారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులవుతున్నారని పరిశోధకులు చెపుతున్నారు.

తాజా పరిశోధనలు అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ లో ప్రచురించారు. లెప్టిన్ అనేది ఒక హార్మోన్ అని అది శరీరం తీసుకున్న ఆహారాన్ని , చేసిన ఎనర్జీ వ్యయాన్ని సమతుల్యత చేస్తుందని, ఈ హార్మోను సహకరించకపోతే శరీరం లావెక్కిపోవటం, షుగర్ వ్యాధి ఏర్పడటం జరుగుతుందని యూనివర్శిటీ ఆఫ్ ఫ్లారిడా కాలేజ్ ఆఫ్ మెడిసిన్ రీసెర్చర్లు వెల్లడి చేశారు.

ఫ్రక్టోస్ అనేది తాజా పండ్లలో వున్నప్పటికి వాటిని తింటే సమస్య లేదని, అయితే స్వీటు తినుబండారాలలో కలిపే సాధారణ స్వీటనర్లు అయిన టేబుల్ షుగర్, ఫ్రక్టోస్ అధికంగా వుండే కార్న సిరప్ మొదలైనవాటి వలననే వ్యక్తులు అధిక బరువు సంతరించుకోడం, షుగర్ వ్యాధి పాలవటం జరుగుతోందని వారు తెలిపారు.

English summary

Common Sweetener Ups Diabetes! | అధిక బరువుతో వచ్చే షుగర్ వ్యాధి!

The latest findings have been published in the American Journal of Physiology University of Florida College of Medicine Researchers in Gaines ville, who led the experiments, described lepton as a hormone that plays a role in helping the body to balance food intake with energy expenditure, and lepton resistance as a condition when the body stops responding to it.
Story first published:Monday, October 24, 2011, 16:42 [IST]
Desktop Bottom Promotion