For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షుగర్ వ్యాధిగ్రస్తుల భావాలు ఎలా ఉంటాయి?

By B N Sharma
|
షుగర్ వ్యాధి ఉన్న వారిలో సాధారణంగా వ్యతిరేక భావనలైన ...కోపం, అసహనం, నిరాశ, భయం, తప్పు చేశామన్న భావన, సిగ్గుపడటం వంటివి ఉంటాయి. కొన్ని పరిశోధనల మేరకు, ఒక వ్యక్తి డయాబెటీస్ గా నిర్దారించబడితే, వారి మానసిక ప్రవర్తన మారుతుంది. వారిలో నిరాశ, వారిపట్ల వారికి నమ్మకం లేకపోవటం, తిరస్కార ధోరణి, కోపం, మరియు మనోవేదన వంటివి అధికంగా కనపడుతూంటాయి. ప్రత్యేకంగా ఒత్తిడి వీరిలో ఉంటుంది. ఒత్తిడి అనేది ఎన్నో అనారోగ్యాలకు దోవతీస్తుంది. సాధారణ వ్యక్తులపైనే తీవ్రమైన దుష్పరిణామాలు చూపిస్తుంది. అలాంటిది డయాబెటిక్స్ మీద దాని దుష్పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయి.

మీరు ఒత్తిడికి గురయ్యారంటే, ఒత్తిడి హార్మోన్లు రిలీజవుతాయి. వీటిని ఎదుర్కొనే ప్రయత్నంలో మన రక్తంలోకి ఎక్కువ మోతాదులో గ్లూకోజ్ రిలీజవుతుంది. అయితే, ఈ గ్లూకోజ్ ను శక్తిగా మార్చే ఇంధనం డయాబెటిక్స్ లో ఉండదు కనుక ఈ అదనంగా విడుదలైన గ్లూకోజ్ శక్తిగా మారి కణాలను చేరి స్ట్రెస్ హార్మోన్లను ఎదుర్కొనలేదు. దీనితో రక్తంలో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది. కొన్ని సందర్భాలలో ఒత్తిడి చాలా కాలం ఉంటుంది. పెద్ద నష్టం వాటిల్లితే, ఆత్మయుల మరణం, పెద్ద జబ్బునుండి బయటపడటం ఇలా అనేక సమస్యలు మనిషిపై దీర్ఘకాలిక ఒత్తిడిని కలిగిస్తాయి. దీనితో వీరిలో బ్లడ్ షుగర్ స్ధాయిలు దీర్ఘకాలంపాటు అధికంగా ఉండిపోతాయి.

సహజంగా స్ట్రెస్ కు గురయినవారు, వారి గురించి వారి ఆరోగ్యం గురించి కూడా సరిగా పట్టించుకోరు. వేళకు ఆహారం తీసుకోరు. వేళకు మందులు వేసుకోరు. వేళకు నిద్రపోరు. విశ్రాంతి తీసుకోరు. వ్యాయామం చేయరు. ఒత్తిడితో ఉన్నపుడు సిగరెట్, ఆల్కహాల్ వంటివి కూడా తాగుతారు. ఫలితంగా వారి బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండదు. ఉంచుకునే ప్రయత్నం చేసే స్ధితిలో వారు ఉండరు.
టైప్ 2 డయాబెటిక్స్ లో ఒత్తిడి బ్లడ్ షుగర్ ను పెంచే హార్మోన్లు రిలీజ్ చేస్తుంది. కనుక బ్లడ్ షుగర్ స్ధాయిలు పెరుగుతాయి. కనుక డయాబెటిక్స్ ఒత్తిడి నుండి ఎంత వీలయితే అంతగా రిలీవ్ అవటానికి తీవ్రంగా ప్రయత్నించాలి. ఇందుకు రిలాక్సేషన్ టెక్నిక్స్ ను ఉపయోగించుకోవాలి.
ఇందుకు శ్వాస సంబంధిత వ్యాయామాలు, ప్రొగ్రెసివ్ రిలాక్సేషన్ ధిరపీ, వ్యాయామం, పాజిటివ్ ఆలోచనలు, ఇవన్నీ ఒత్తిడినుండి మీకు రిలీఫ్ ఇచ్చే అంశాలే. అంతేకాదు, మీలో బ్లడ్ షుగర్ స్ధాయిలను పెంచే ఈ ఒత్తిడి నుంచి మీరు బయటపడే మార్గాలు వెతికేకన్నా అసలు స్ట్రెస్ మీ నీడను తాకకుండా తాకినా క్షణం కూడా మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండకుండా ఎలా జీవించాలో ఆలోచించండి.

మీకు ఒత్తిడి కలిగించే అంశాలన్నింటినీ మీ జీవితం నుంచి తరిమేయండి. ఇలాంటి సంఘటనల ఏరివేతను ఈ క్షణం నుంచే ప్రారంభించండి. ఒత్తిడి నుంచి బయటపడటానికి మార్గాలు లేవనుకోవద్దు. సంగీతం వినండి. సంగీతం నేర్చుకోవటం సాధన చేయండి. ఒ మంచి కామెడీ ఫిలిం చూడండి. టి.వి.లో కార్టూన్ ఫిలింస్ చూడండి. ఎప్పుడూ నవ్వుతూ నవ్వించే మిత్రులతో మాట్లాడండి. పిల్లలు ఆడుకుంటూంటే కాసేపు వారి ఆటపాటల్ని గమనించండి. పసిపిల్లల్ని దగ్గరకు తీసి ముద్దాడండి. పెంపుడు జంతువులకు దగ్గరుండి ప్రేమగా ఆహారం తినిపించండి. సమాజసేవ చేయండి. ఆలయాలలో, ఆశ్రమాలలో మీరు చేయగలిగిన సేవ చేయండి. ఇలా ఒత్తిడికి దూరంగా ఉండేందుకు అన్నివిధాలా ప్రయత్నించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. డయాబెటీస్ బాధితులకు ఒత్తిడి అధిక హాని కలిగిస్తుందనే వాస్తవాన్ని గుర్తించండి.

English summary

Diabetes and Emotions! | రోగాలకు మూలం ఒత్తిడి?


 Mindfulness training has been shown to address depression, stress, anxiety, chronic pain all of which have been implemented with better glycaemia control, diabetes management and greater reported quality of life:
Story first published: Tuesday, July 3, 2012, 12:36 [IST]