For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటీస్ వ్యాధి నివారణ చిట్కాలు!

By Staff
|

Karela
మన దేశంలో షుగర్ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. దీనికి కారణం మనం తినే అలవాట్లు, జీవన విధానంగా చెపుతున్నారు. అదే విధంగా గర్భిణీ స్త్రీలలో సైతం షుగర్ వ్యాధి సర్వ సాధారణంగా వచ్చేస్తోంది. ఇతర దేశాలలో కంటే కూడా మన దేశంలో టైప్ 2 డయాబెటీస్ తో బాధపడే రోగుల సంఖ్య అధికంగా వుందని తాజా గణాంకాలు చెపుతున్నాయి. ప్రతిరోజూ టాబ్ లెట్లు వేసుకునే దానికి బదులుగా ఇన్సలిన్ తీసుకోవడం కూడా రోగులు చేస్తున్నారు. స్వీట్లు వంటి తీపి పదార్ధాల కారణంగానే కాక, ీ వ్యాధి ఒత్తిడితోను, వంశానుగతంగాను అధికంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ మందులు వేసుకునే కంటే కూడా ఈ వ్యాధిని నియంత్రించుకోడానికి కొన్ని ఆహారపుటలవాట్లను మార్చుకోవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు. షుగర్ వ్యాధిని నివారించటానికి ఇంట్లోనే చేపట్టగలిగిన కొన్ని చర్యలు పరిశీలించండి.

- ఉసిరికాయ రక్తంలోని షుగర్ స్ధాయిలను బాగా తగ్గిస్తుంది. కనుక ఉసిరి రసం, లేదా ఉసిరిని ఇతర ఆహార పదార్ధాలలో కలిపి వాడటం కూడా షుగర్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

- ఉదయంవేళ ఖాళీ కడుపుతో కాకర రసం తీసుకుంటే షుగర్ వ్యాధి అరికట్టవచ్చని రుజువైంది. రసంగానే కాకరకాయను కూరగాను, వేపుడుగాను కూడా వాడవచ్చు.

- ఒక చెంచా మెంతి గింజలు రాత్రంతా నానపెట్టి, ఉదయం దంతాలు బ్రష్ చేసిన తర్వాత వాటిని కొద్దిపాటి నీటితో నమిలి క్రమం తప్పకుండా ప్రతిరోజూ తింటే షుగర్ వ్యాధిని అరికట్టవచ్చని నిపుణులు చెపుతున్నారు.

- నేరేడు పండు షుగర్ వ్యాధికి మంచి మందుగా పని చేస్తుంది. అది నేరుగా పానిక్రియాస్ గ్రంధిపై ప్రభావం చూపుతుంది. వీటి విత్తనాలను ఎండబెట్టి, పౌడర్ చేసి నీటితో రోజుకు రెండు సార్లు తింటే మంచి ఫలితాలనిస్తుంది.

కాఫీ, టీ లవంటి వాటిలో షుగర్ కు బదులు ప్రత్యామ్నాయంగా తేనె వాడకం షుగర్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
- ప్రతిరోజూ క్రమం తప్పకుండా షుగర్ లేని బ్లాక్ కాఫీ తాగితే టైప్ 2 డయాబెటీస్ నియంత్రణలోకి వచ్చేస్తుంది.
- గ్రీన్ టీ కూడా బ్లడ్ షుగర్ స్ధాయిని తగ్గించి, శరీరంలోని ఇన్సులిన్ స్ధాయిలను పెంచుతుంది.

పై ఆహారాలతోపాటుగా రోజువారీ నడక, వ్యాయామం వంటి శారీరక చర్యలు షుగర్ వ్యాధి రోగులకు వ్యాధిని తగ్గించటంలో ఎంతో తోడ్పడతాయి.

English summary

Diabetes ...How To Cure At Home! | డయాబెటీస్ వ్యాధి నివారణ చిట్కాలు!

Talk to the eldest member in your family and am sure they will come up with a number of home remedies to prevent diabetes. Besides, make regular walk and exercise part of your routine. Among other benefits, green tea is also helpful in reducing the blood sugar and insulin levels in the body.
Desktop Bottom Promotion