For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటీస్ రోగులలో ద్వికర్బన పదార్ధాలు!

By B N Sharma
|

Diabetes and Ketones In the Body! |
శరీరం కనుక తనలోని కొవ్వును తాను దహించుకుంటే రక్తంలో కిటోన్స్ అనే కర్బన పదార్ధాలు ఏర్పడతాయి. ఈ కిటోన్స్ లేదా ద్వికర్బన పదార్ధాలు మీ రక్తప్రసరణలో అధిక స్ధాయిలో వుంటే, డయాబెటీస్ రోగులలో కొన్ని సమస్యలు వస్తాయి. వాటికి చికిత్స చేయకుండా వదిలితే అది కెటోయాసిడోసిస్ అనే వ్యాధికి దోవతీస్తుంది. శరీర కణాలకు ఇంధనంగా తగినంత ఇన్సులిన్ శరీరంలో లేనపుడు కిటోన్స్ అనేవి పెరుగుతాయి. కనుక టైప్ 1 డయాబెటిస్ రోగులకు అధిక స్ధాయిలో కిటోన్లు ఉండటం సహజమే. టైప్ 2 డయాబెటీస్ బాగా ముదిరిపోయినా ఈ కిటోన్లు రోగి శరీరంలో అధికంగా ఏర్పడతాయి. మీరు కనుక అధిక స్ధాయి కిటోన్లతో బాధపడుతూ వైద్య పరంగా చికిత్సలు పొందుతూంటే, వాటి నివారణకు గాను తక్షణ ఏర్పాట్లు చేసుకోవలసిందే.

అసలు ఈ కిటోన్స్ అంటే ఏమిటి? డయాబెటీస్ రోగానికి కిటోన్స్ ఉండటానికి సంబంధం ఏమిటి? శరీరంలోని కొవ్వు దానికది స్వంతంగా ఖర్చుఅయిపోయి ఒక యాసిడ్ అవశేషం మిగులుతుంది. శరీరంలో ఇన్సులిన్ తగినంత లేనపుడు, అది అపుడు రక్తంనుండి గ్లూకోజ్ ను పొందలేదు. శరీర కణాలకు అందించి తగిన శక్తిని తయారు చేయలేదు. దానికి బదులుగా కొవ్వును దహించి వేస్తూ ఉంటుంది.

శరీరంకనుక ఈ రకంగా అధిక కొవ్వును దహించివేస్తూ ఉంటే, ఇక రక్తప్రవాహంలో కిటోన్స్ అనే పదార్ధాలు ఏర్పడతాయి. మరి అవి కిటోన్లా కావా అనేది ఎలా? పరీక్షించాలి. కిటోన్ల పరీక్షను ఇంటివద్దే మీరు చేసుకోవచ్చు. మూత్రంలో కిటోన్లను పరీక్షించేందుకు నేడు మార్కెట్ లోకి అనేక పరికరాలు వస్తున్నాయి. అవి కూడా బ్లడ్ గ్లూకోజ్ మీటర్లవలెనే పనిచేస్తాయి. మన శరీరం తగినంత షుగర్ అందించలేనపుడు కిటోన్ల సమస్య వస్తుంది. మన శరీరానికి శక్తి కావాలంటే, షుగర్ అనేది ప్రధాన ఇంధనంగా గుర్తించారు. మన శరీరంలోని పాన్ క్రియస్ గ్రంధి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుందని అందరకు తెలిసినదే. ఈ ఇన్సులిన్ రక్తంలోని బ్లడ్ షుగర్ ను నియంత్రిస్తుంది.

శరీరం కనుక షుగర్ ను దహించలేకుంటే, అది మనలో నిల్వ ఉన్న కొవ్వును దహించివేస్తుంది. ఫలితంగా మనలో కిటోన్లు ఏర్పడతాయి. ఈ కిటోన్ల స్ధాయి కనుక శరీరంలో అధికం అయితే, కిటోయాసిడోసిస్ అనే పరిస్ధితి ఏర్పడి అది మిమ్మల్ని కోమాలోకి తీసుకు వెళుతుంది. సరైన సమయంలో కనుక చికిత్స జరుగకుంటే, రోగి ఈ పరిస్దితిలో కోమాలోకి మాత్రమే కాక, మరణించే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక డయాబెటిక్ రోగులు తమ రక్తంలో కిటోన్ల స్ధాయి అధికం కాకుండా ఎప్పటికపుడు బ్లడ్ షుగర్ ను నియంత్రించుకోవాలి. అందుకుగాను తీపి పదార్ధాలు తగ్గించడం. ఇన్సులిన్ శరీరంలో పెరిగే ఆహారాలు భుజించడం. ప్రతిరోజూ వేళకు కనీసం ఒక గంట సేపు తగిన శారీరక వ్యాయామాలు చేయడం వంటివి చేయాలి. ఇన్సులిన్ అధికంగా ఖర్చు కాని ఆహార పదార్ధాలు తినాలి. డయాబెటీస్ వ్యాధిని ఎపుడూ నియంత్రించుకునే వారికి ఈ కిటోన్ల సమస్య పెద్దగా వేధించదు.

English summary

Diabetes and Ketones In the Body! | మరణాన్ని కలిగించే కెటోయాసిడోసిస్?

Insulin, a hormone produced in the pancreas that metabolises blood sugar, is either deficient or non-existent in the blood of diabetes patients. If the body cannot burn sugar, it will burn stored fat, and ketone build up will begin.
Story first published:Thursday, July 12, 2012, 12:01 [IST]
Desktop Bottom Promotion