For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పర్యావరణ కాలుష్యంతో షుగర్ వ్యాధి!

By B N Sharma
|

Environmental Pollution Causes Diabetes!
ఇప్పటివరకూ జీవన శైలి, ఆహారపుటలవాట్ల కారణంగా స్థూలకాయం, మధుమేహం వంటి వ్యాధులు వస్తాయని పరిశోధకులు చెపటం, వాటిని వాస్తవంలో మనం పొందుతూండటం జరుగుతోంది. కానీ కాలుష్యం వల్ల కూడా అధిక బరువు, స్థూలకాయం, మధుమేహం సమస్యలు తలెత్తుతాయంటున్నారు ఓహియో యూనివర్శిటికీ చెందిన పరిశోధకులు.

ముఖ్యంగా కాలుష్యం బారిన పడే పది సంవత్సరాల వయసులోపలి చిన్నపిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తోందని వెల్లడించారు. వాహనాలనుంచి వెలువడే కాలుష్యం.. అంటే ఇంధనం, రబ్బరు సంబంధిత కాలుష్య రేణువులు చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీంతో యుక్త వయస్సు చేరుకునేసరికి వారిలో స్థూలకాయం, టైప్ 2 డయాబెటీస్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు.

పరిశోధకులు కాలుష్యమయమైన ప్రాంతంలో నివాసముండే చిన్నపిల్లలపైనా, కాలుష్య రహిత ప్రాంతంలో నివాసముండే పిల్లలపైనా పరిశోధనలు నిర్వహించారు. కాలుష్యమయమైన ప్రాంతంలో ఉన్న పిల్లల్లో అధికబరువుతోపాటు మధుమేహం టైప్ 2 వ్యాధి సమస్యలు తలెత్తడం గుర్తించారు. ఇక కాలుష్య రహిత ప్రాంతంలో ఉన్న పిల్లల్లో ఆరోగ్యవంతమైన ఎదుగుదలను గమనించారు. పర్యావరణ కాలుష్యం అనేక రోగాలనే కాదు... శరీర బరువులో తేడా కూడా తీసుకురావడంపైనా ప్రభావం చూపుతుందని, దీని కారణంగా పిల్లలకు చిన్నతనంలోనే ఊబకాయం కలుగుతోందని తేల్చారు.

English summary

Environmental Pollution Causes Diabetes! | కాలుష్య రక్కసి కాటేస్తే?


 Especially, kids under ten years of Age are more prone to environmental pollution. Pollution emanating from the vehicles such as particles of rubber, diesel, gas etc. are showing severe bad effects on the children health. With the result by the time these children attain their youth they are getting obese and type 2 diabetes disease, the researchers revealed.
Story first published:Friday, March 30, 2012, 12:42 [IST]
Desktop Bottom Promotion