For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  30 డేస్ లో డయాబెటిస్ ను బీట్ చేసే 10 మిరాకిల్ ఫుడ్స్

  By Sindhu
  |

  ఆది నుంచి మనిషికి ఆహారమంటే వల్లమాలిన ప్రీతి. తన ఆహారం పట్ల ఏ ఆంక్షలు ఉండకూడదనుకుంటాడు. ఏది పడితే అది తినగలిగే స్వేచ్చను కోరుకుంటారు. ఏమైనా నియమాలను పాటించవలసి వస్తే అదో పెద్ద శిక్షగా భావిస్తారు.

  కానీ ఆరోగ్యాన్ని కోరుకున్నప్పుడు కొన్ని నియమాలు పాటించడం అనివార్యమవుతాయి. నిజానికి మధుమేహ వ్యాధిగ్రస్తులకు సూచించే ఆహారం ఎంతో ఆరోగ్యకరమైనది. నియమాలు వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకం కాదు. అవి ఆరోగ్యాన్ని కోరుకునే ప్రతీ ఒక్కరూ ఆచరించవలసిందే.

  మధుమేహం (డయాబెటిస్‌) జబ్బు కాదు. కానీ ఎన్నో జబ్బులకు కారణం! ఇది ఒక శారీరక స్థితి... డైజెస్టివ్‌ డిజార్డర్‌! పెద్ద ఎత్తున ప్రజల్ని పీడిస్తోంది.డయాబెటిస్‌. దాదాపుగా మన దేశంలో ప్రతీ కుటుంబంలో ఒకరైనా డయాబెటిస్ బారిన పడుతున్నారు.

  ప్రతీ నలుగురిలో ఒకరు డయాబెటిస్‌ బాధితులు ఉండనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే మనదేశం డయా బెటిస్‌కి కాపిటల్‌. మనదేశంలో హైద్రాబాద్‌ డయాబెటిస్‌కి ముఖ్య కేంద్రం. డయాబెటిస్ కంట్రోల్ చేసుకోవాలన్నా..డయాబెటిస్ రాకుండా ఉండాలన్నా హెల్తీ డైట్ తీసుకోవాలి . హెల్తీ డైట్ ద్వారా30 రోజుల్లో డయాబెటిస్ ను నేచురల్ గా బీట్ చేయవచ్చు.

  Miracle Foods That Beat Diabetes In 30 Days

  మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల ద్వారానే డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవచ్చవని వివిధ పరిశోధనల ద్వారా వెల్లడైనది. కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా వరీరంలో షుగర్ లెవల్స్ క్రమంగా తగ్గించుకోవచ్చు. అదే విధంగా ఇన్సులిన్ ను క్రమబద్దం చేసుకోవచ్చు.

  ఈ హెల్తీ ఫుడ్స్ ను రెగ్యులర్ గా మన డైలీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా డయాబెటిస్ అండర్ కంట్రోల్లో రావడానికి లేదా నివారించుకోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఈ క్రింది తెలిపిన ఫుడ్ లిస్ట్ లోని ఆహారాలను డయాబెటిస్ కుటుంబంలో ఏఒక్కరిలో ఉన్న, మిగిలిన కుటుంబ సభ్యులు, డయాబెటిస్ లేనివారు కూడా తీసుకోవచ్చు. దాంతో మునుముందు డయాబెటిస్ కానీ, లేదా ఇతర జబ్బులను కానీ రాకుండా అరకట్టవచ్చు. మరి డయాబెటిస్ ను ఒకే ఒక నెలలో కంట్రోల్ చేసే ఆహారాల లిస్ట్ ఏంటో ఒక సారి చూద్దాం...

  MOST READ:మహిళలూ....మీ హార్ట్ ట్రబుల్లో ఉందని తెలిపే 10 లక్షణాలు

  1. క్యారెట్స్:

  1. క్యారెట్స్:

  డయాబెటిస్ 30 రోజుల్లో కంట్రోల్ చేసుకోవాలంటే క్యారెట్ ఒక ఉత్తమ ఆహారం . అందుకు ముఖ్య కారణం క్యారెట్ లో ఉండే బీటాకెరోటీన్. ఇంకోరకంగా చెప్పాలంటే, ఆరెంజ్ కలర్ వెజిటేబుల్స్ లో చాలా తక్కువ షుగర్స్ ఉండటం వల్ల శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

  2. చేపలు:

  2. చేపలు:

  చేపల్లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ డయాబెటిస్ కు చాలా మంచిది . శరీరంలోని ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తుంది. కాబట్టి వారంలో రెండు సార్లు చేపలు తినడం మంచిది.

  3. ఆలివ్ ఆయిల్:

  3. ఆలివ్ ఆయిల్:

  ప్రస్తుత రోజుల్లో వంటలకు ఆలివ్ ఆయిల్ వాడకం ఎక్కువైనది. చాలా మంది వంటలకోసం ఆలివ్ ఆయిల్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ నూనెలో మంచి ఫ్యాట్స్ ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మరియు శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. మరియు ఇది డయాబెటిస్ రాకుండా కాపాడుతుంది.

  4. బ్రెడ్:

  4. బ్రెడ్:

  బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది టేబుల్ సాల్ట్ కు సమానం. ముఖ్యంగా మల్టీ గ్రెయిన్ బ్రెడ్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా జీర్ణక్రియను ఆలస్యం చేస్తుంది . మరియు తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది . మరియు ఇది బరువు మరియు డయాబెటిక్ రిస్క్ ను పెరగనివ్వదు.

  MOST READ:వివిధ రకాల వ్యాధులకు తమలపాకు వంటకాలు

  5. సిట్రస్ ఫ్రూట్:

  5. సిట్రస్ ఫ్రూట్:

  సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజ్ చాలా మంచి ఆహారం. వారంలో రెండు సార్లు ఒక్కో ఆరెంజ్ ను తీసుకోవడం ద్వారా డయాబెటిస్ ను 30 రోజుల్లో కంట్రోల్ చేసుకోవచ్చు. ఆరెంజ్ లో డయాబెటిస్ మరియు ఇతర సమస్యలను బీట్ చేసే ఫోటోన్యూట్రీయంట్స్ , ఫ్లెవనాయిడ్, కెరోటినాయిడ్స్, టెర్పైన్స్, పెక్టిన్స్ మరియు గులిటిన్ అధికంగా ఉండటం వల్ల 30 రోజుల్లో డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి సాధ్యం అవుతుంది.

  6. బాదం:

  6. బాదం:

  డయాబెటిస్ తో బాధపడే వారికి బాదం ఒక బెస్ట్ ఫ్రెండ్. ఈ నట్స్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి. ఎందుకంటే వీటిలో ఫైబర్ మరియు ప్రోటీనులు అధికంగా ఉన్నాయి. ఇవి 30రోజుల్లో డయాబెటిస్ ను బీట్ చేసి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

  7. గ్రీన్ టీ:

  7. గ్రీన్ టీ:

  గ్రీన్ టీలో ఉండే ఫైటో న్యూట్రీషియన్స్ మరియు క్యాటిచిన్స్ మరియు టానిన్స్ శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. 30 రోజుల్లో డయాబెటిస్ ను బీట్ చేయాలంటే.. రోజులో రెండు సార్లు గ్రీన్ టీ త్రాగడం అలవాటు చేసుకోవడం .

  8. బీన్స్:

  8. బీన్స్:

  బీన్స్ ఆరోగ్యానికి మంచిదని ఎందుకు చెబుతారో మీకు తెలుసా?ఎందుకంటే బీన్స్ లో డిఫరెంట్ టైప్ ఫైటోన్యూట్రీయంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి డయాబెటిస్ ను ఫాస్ట్ గా రివకర్ చేయడానికి సహాయపడుతాయి . డైలీ డైట్ లో బీన్స్ జోడించి త్వరగా బరువు తగ్గించుకోండి.

  9. ఆపిల్స్:

  9. ఆపిల్స్:

  రోజుకొక్క ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదనేది అక్షరాల నిజం. ఎందుకంటే రెడ్ మరియు గ్రీన్ ఆపిల్ తినడం వల్ల హార్ట్ హెల్తీ గా మరియు డయాబెటిస్ ను కంట్రోల్ చేయడంలో మరియు కొలెస్ట్రాలన్ ను కరిగించడంలో మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

  10.ఓట్స్:

  10.ఓట్స్:

  ఓట్స్ లో పొట్టలో డైజెస్టివ్ ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేయడంలో గొప్పగా సహాయపడుతుంది. అలాగే మీరు తీసుకొనే భోజనం నుండి శరీరానికి అందిన కార్బోహైడ్రేట్స్ బ్లడ్ షుగర్ గా మారడాన్ని ఆలస్యం చేస్తుంది.

  English summary

  Miracle Foods That Beat Diabetes In 30 Days

  Have you just gotten to know that your diabetic? Well, firstly don't get scared and worry much as it is a common health problem faced by every second person in the world. To get started, you need to know the status of your sugar level and maintain a healthy diet so that you are able to beat diabetes naturally and in the right way in a span of 30 days.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more