For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిస్ ను అండర్ కంట్రోల్లో ఉంచే 15 మార్గాలు

|

మధుమేహం అనేది రక్తంలో అసాధారణ అధిక గ్లూకోజ్ స్థాయిలు గల ఒక వ్యాధి.అధిక మూత్రవిసర్జన మరియు నిరంతర దాహం అనే లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. సాదారణంగా మధుమేహం అనేది ఇన్సులిన్ లోపం వల్ల వస్తుంది. సాధారణంగా మధుమేహ రోగులలో రక్తంలో చక్కర శాతం ఎక్కువ ఉంటుంది.

ఈ వ్యాధి వారసత్వంగా రావటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మధుమేహం రావటానికి వయసు, సరైన ఆహారం లేకపోవటం, ఒత్తిడి, స్థూలకాయం, రక్తపోటు మొదలైన కారణాల వల్ల వస్తుంది.

మధుమేహంను పరిష్కరించడం చాలా క్లిష్టమైన సమస్య. అయితే మధుమేహలక్షణాలను గుర్తించి, సరైన నియంత్రణ పద్దతులను పాటించి నివారించుకోవచ్చు. మధుమేహం సోకకుండా ఉండేదుకు మీకు కొన్ని సూచనలను అందిస్తున్నాం.. వీటిని కనుక ఫాలో అయినట్లైతే తప్పకుండా షుగర్ మీ దరిచేరదు. మరి ఆ సూచనలేంటో చూద్దాం...

1. వ్యాయామం:

1. వ్యాయామం:

కొన్ని పరిశోధనల ప్రకారం ప్రతి రోజూ వ్యాయామం చేయడం ద్వారా రక్తప్రసరణను మెరుగుపరచి, రక్తంలోని షుగర్ లెవల్స్ ను క్లియర్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల జీవక్రియ క్రమంగా పనిచేసి, షుగర్ రాకుండా సహాయపడుతుంది.

 2. నో షుగర్:

2. నో షుగర్:

చక్కెర వినియోగం ద్వారా రక్తలోని షుగర్ స్థాయిలను కనుక్కోవచ్చు. అయితే కృత్రిమంగా తయారు చేసినటువంటి తియ్యంటి ఆహారాలు మరియు విషపూరిత పానీయాల వినియోగం ద్వారా మధుమేహం యొక్క ఆగమనం ఫలితంగా ఇన్సులిన్ ఉత్పత్తిని నిషేదించి, అధిక చక్కెర శాతాన్ని కలిగి ఉంటుంది. అందువలన పంచదారతో తయారు చేసినటువంటి ఉత్పత్తుల వాడకంను పూర్తిగా నివారించడం మధుమేహగ్రస్తులకు ఉత్తమమైన విధానం.

3. ఫైబర్:

3. ఫైబర్:

నిత్యం ఫైబర్ తీసుకోవండ వలన మధుమేహం, క్యాన్సర్, గుండెకు సంబంధించిన జబ్బులు దరిచేరవు. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో ఉన్న షుగర్ లెవల్స్ కంట్రోచేయడానికి, చెక్కర స్థాయిని నియంత్రించడానికి చాలా సహాయపడుతుంది. ఫైబర్ ఆహారం తసుకోవడం వల్ల రక్తంలో ఉన్న షుగర్ ను గ్రహించి క్లోమ గ్రంథి ఉత్తేజితమై ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధమై మధుమేహం నియంత్రణ అవుతుంది. మొలకెత్తిన గింజలు, ఓట్స్, పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, వేరుశనగ పప్పులు, రాగి, బాదం వంటి వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని రోజూ పరిమితంగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. మధుమేహం, ఊబకాయం దరిచేరవు.

4. తాజా పండ్లు మరియు కూరగాయలు:

4. తాజా పండ్లు మరియు కూరగాయలు:

ప్రతిరోజు పండ్లు, కూరగాయలు, మీ ఆహారంలో ఉండేలా చర్యలు తీసుకోండి.ఇందులో రెండు నుంచి నాలుగు తాజా పండ్లు ఉండాలి. పెసలు ... పీచు పదార్ధాలు తీసుకోకుండా వుంటే మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశముంది. కాబట్టి మధుమేహ గ్రస్తులు తాజా పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. కొన్ని పరిశోధనల ప్రాకారం విటమిన్ ఎ మరియు విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోలోనూ, ఎముకలు దడంగాను ఉంటాయి. అలాగే తాజా కూరగాయల్లో శరీరానికి అవసరమైన ఐరన్, జింక్, పొటాషియం, కాల్షియం మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్రోటీనులు శరీరానికి కావలసిన ఇన్సులిన్ ఉత్పత్తిని అందిస్తుంది.

 5. గ్రీన్ టీ:

5. గ్రీన్ టీ:

రెగ్యులర్ గా గ్రీన్ టీ త్రాగేవారికి హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశఆలు తక్కువ. ... గ్రీన్ టీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. డయాబెటిస్ రాకుండా నివారించడం లేదా ఆలస్యం చేయడం. గ్రీన్ టీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయం చేస్తుంది . టీలో ఉండే పాలీఫెనాల్స్‌ మెటాబాలిజంను ప్రేరేపిస్తుంది. గ్రీన్‌ టీ తక్కువ ప్రాసెస్‌ అయి ఉండడమే కాక అందులో యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది.

 6. కాఫీ:

6. కాఫీ:

కాఫీ ప్రియులకు ఓ శుభవార్త. కాఫీతో కొన్ని ఆరోగ్యకరమైన లాభాలు కూడా ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలడం విశేషం. టైప్‌ 2 డయాబెటిస్‌, గుండె సంబంధింత వ్యాధులు, సమస్యలతో బాధపడేవారికి కాఫీ మేలు చేస్తుందని తెలిసింది. చాయ్‌ని రోజూ తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగడంతో పాటు ధమనుల గోడలు దృఢంగా తయారవుతున్నాయని, డయాబెటిస్ రాకుండా టీ నివారిస్తుందని పరిశోధకులు అంటున్నారు. చాయ్ ద్వారా శరీర నిర్మాణానికి అవసరమైన ఎంజైమ్‌లు, కార్బోహైవూడేట్‌లు, ప్రొటీన్‌లు, లిపిడ్‌లు అందుతున్నాయని తేలింది.

7. భోజనం:

7. భోజనం:

ప్రతి రోజూ ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి.సమయానుగుణంగా ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. మీరు తీసుకునే అహారంలో పీచు పదార్థాలు అధికంగా వుండేలా చూసుకోవాలి. అంటే రోజుకు సుమారు 400 నుంచి 500గ్రాములు కూరగాయలు తీసుకోవాలి. డైట్‌లో చిరుధాన్యాలు ఒక భాగంగా చేసుకోవాలి. ప్రతిరోజూ ఒకే రకమైనవి కాకుండా కలగలిపి తీసుకోవాలి. రైస్ మాత్రమే తీసుకోకుండా రైస్‌తో పాటు గోధుమలు, జొన్నలు, రాగులు..ఇలా రెండు, మూడు రకాల ధాన్యాలను కలిపి తీసుకోవాలి. డయాబెటిస్ ఉందని తెలిసినప్పుడు డైటీషియన్ను కలిసి ఎలాంటి ఆహారం తీసుకోవాలో వివరంగా తెలుసుకుంటే మంచిది.

8. దాల్చిన చెక్క:

8. దాల్చిన చెక్క:

మీరు తీసుకొనే ఆహారంలో దాల్చిన చెక్క పొడిను తీసుకోవడం మంచిది. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. గోరువెచ్చని నీటితో చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధికి గుడ్ బై చెప్పవచ్చు.

 9. ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలి:

9. ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలి:

మధుమేహం ఉన్నవారు ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలి. ఈ ఒత్తిడి ఏదో ఒక రోజు కాకుండా, రోజూ ఎదుర్కుంటూ ఉంటే హార్మోన్ల పనితీరు మందగించి, ఒకవేళ ఇన్సులిన్ సరిగ్గాఉత్పత్తి అయినా ఆ మోతాదు శరీరానికి సరిపోదు. ఫలితంగా డయాబెటిస్ వస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళను అధికంగా ఉంటాయి కాబట్టి వాటిని పూర్తిగా తగ్గించుకోవాలి.

 10. ప్రోటీన్ డయట్:

10. ప్రోటీన్ డయట్:

శరీరంలో శక్తి పెంపొందించుకోవడానికి ప్రోటీనులను అంధించే ఆహారం తీసుకోవడం చాలా మంచిది. అదే ప్రొటీన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటే త్వరగా నిండిన ఫీలింగ్ కలుగుతుంది. సరిపడా నిద్ర - శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. అందుకోసంఅధిక ప్రోటీన్ ఉన్న పదార్ధాలు అంటే చేప, మాంసం, కాయగూరలు, బీన్స్ తినాలి.

11. ఫ్యాట్ ఫుడ్స్:

11. ఫ్యాట్ ఫుడ్స్:

ఫ్యాట్ ఫుడ్స్ ను పూర్తిగా తినడం మానుకోవాలి. తీపి పదార్థాలు, ఐస్‌క్రీములు,ఫాస్ట్ పుడ్స్ మానుకో వాలి. అతి పరిమితంగా తీసుకున్నప్పుడు అయితే, ఆరోజు మామూలుగా తీసు కునే ఆహార పదార్థాల మోతాదును బాగా తగ్గిం చాలి. అలాగే నూనె పదార్థాలు కూడా బాగా తగ్గించాలి.

12. ఉప్పు వినియోగం తగ్గించాలి:

12. ఉప్పు వినియోగం తగ్గించాలి:

ప్రకృతిలొ మనకి లభించే..ఉప్పు, చక్కెర. నెయ్యి వరమే కాదు ఒక్కోసారి శాపంగా కూడా మారుతాయి.అందుకే ఇవి ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఉప్పు, కొవ్వులు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరభాగాల్లో సమస్యలు మొదలై బీపీ, షుగర్ వ్యాధులకు కారణమవుతాయి. ఏ రకం.. ఏ సమస్య.. టైప్ 1 రకం మధుమేహం ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. బీటా కణాలు దెబ్బతినడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.

13. ఎక్కువ నీళ్ళు తాగాలి:

13. ఎక్కువ నీళ్ళు తాగాలి:

నీటిని ఎంత ఎక్కువ తాగితే అంత ఆరోగ్యానికి మంచిది. రక్తంలో ఉన్న హై షుగర్ కంటెంట్ను కంట్రోల్ చేసి ఒత్తిడిని, ఇరిటేషన్ ను తగ్గిస్తుంది. ప్రతి రోజూ రెండున్నర లీటర్లు నీటిని తీసుకోవాలి. నీరు సేవించడం వల్ల ఆరోగ్యానికే కాకుండా డయాబెటిక్ లక్షణాలను దరిచేరనివ్వదు.

14. వెనిగర్:

14. వెనిగర్:

వెనిగర్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ ఉంచే ఓ అద్భుతమైన డైటేరియన్ ఫుడ్ అని చెప్పవచ్చు. భోజనానికి ముందు రెండు టీస్సూన్ల వెనిగర్ ను తీసుకోవడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

15. సోయా:

15. సోయా:

డయాబెటిస్ పేషంట్స్ సోయా ఉత్పత్తులను విరివిగా వాడవచ్చు. రక్తంలోని షుగర్ కంటెంట్ ను కంట్రోల్లో ఉంచి శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. కాబట్టి ఇటువంటి చిన్నచిన్న సూచనలు తప్పకుండా పాటిస్తే డయాబెటిస్ రాకుండా అదుపు చేసుకోవచ్చు. ఈ సూచనలు డయాబెటిస్ పేషంట్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి.

English summary

15 Ways to Keep Diabetes Under Control

Diabetes a polygenic disease characterized by abnormally high glucose levels in the blood; any of several metabolic disorders marked by excessive urination and persistent thirst. In simple words, diabetes occurs due to a relative or absolute deficiency of insulin.
Story first published:Saturday, April 30, 2016, 14:19 [IST]
Desktop Bottom Promotion