మధుమేహం వ్యాధిగ్రస్తులు తినకూడని ఆహారాలివే !

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

డయాబెటిస్ లేదా షుగర్ లేదా మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచకపోతే అది ఇతర వ్యాధులకు దారి తీస్తుంది. గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, అంధత్వంతో పాటు ఇతర సమస్యలు వస్తాయి. మధుమేహం శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, రక్త పీడనాన్ని అధికం చేస్తుంది. మధుమేహం శరీరంలో ఎల్డీఎల్ లేదా చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎప్పటికప్పుడు వారు తీసుకునే ఫుడ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. రక్తంలో చక్కర స్థాయిలు, కొవ్వు పదార్థాల స్థాయిలు పెరిగితే కాలేయంలోని 'రిసెప్టార్స్' లేదా 'గ్రాహకాలు' చక్కరతో పూత పూయబడతాయి. దీని వలన రక్తంలో ఉండే కొవ్వు పదార్థాలను బయటకి పంపటంలో కాలేయం తన సామార్థ్యాన్ని కోల్పోతుంది. మధుమేహా వ్యాధిగ్రస్తులలో ఇన్సులిన్ స్థాయిలు పెరగటం వలన శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు పెరుగుతాయి. మీకు మధుమేహం వున్నప్పుడు మీరు తీసుకునే ఆహారం చాలా ప్రభావం చూపుతుంది. మీరు మీ డైట్ ను తయారు చేసుకుంటున్నప్పుడు, పిండి పదార్థాలు, ఫైబర్, కొవ్వు అనే కీలక విషయాల మీద దృష్టి పెట్టాలి. అలాగే మధుమేహవ్యాధిగ్రస్తులు అస్సలు తీసుకోకూడని కొన్ని ఆహారాలుంటాయి. మరి అవి ఏమిటో చూద్దామా. ఈ కింద ఇచ్చిన ఆహారపదార్థాలు, పానీయాలకు షుగర్ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండాలి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు..

1. పంచదార, తియ్యగా ఉండే పానీయాలు

1. పంచదార, తియ్యగా ఉండే పానీయాలు

పంచదార తీసుకోవడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు అంత మంచిదికాదు. చక్కెర ఎక్కువగా ఫ్రక్టోజ్‌ను కలిగి ఉంటుంది. శరీరంలో ట్రైగ్లిసరైడ్‌ల స్థాయిలను, ఎల్డీఎల్ ను, రక్తంలో చక్కెరల స్థాయిలను చక్కెర పెంచుతుంది. అలాగే వీటిలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మధుమేహవ్యాధిగ్రస్తులకు అంత మంచిదికాదు. పంచదార, తియ్యటి శీతలపానీయాలను ఎక్కువగా వినియోగిస్తే ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతుంది. అలాగే మధుమేహం వ్యాధి తీవ్రత మరింత పెరుగుతుంది.

2. ట్రాన్స్ ఫాట్స్

2. ట్రాన్స్ ఫాట్స్

మనం తినే ఆహారంలో ట్రాన్స్ ఫాట్స్, శాచ్యురేటెడ్ ఫాట్స్ ఉంటాయి. అయితే ట్రాన్స్ ఫాట్స్ ఉన్న ఆహారాలు తీసుకోవడం అసలు మంచిది కాదు. అందువల్ల ట్రాన్స్ ఫాట్స్ ఉండే ఆహారాలను తీసుకోకుండా ఉండడం మంచిది. అందువల్ల వీలైనంత వరకు ట్రాన్స్ ఫాట్స్ ఉండే ఆహారాలు తీసుకోకుండా ఉండండి.

3. వైట్ బ్రెడ్, పాస్తా, బియ్యంతో తయారు చేసిన పదార్థాలు

3. వైట్ బ్రెడ్, పాస్తా, బియ్యంతో తయారు చేసిన పదార్థాలు

వీటిలో ఎక్కువగా పిండి పదార్థాలుంటాయి. అలాగే ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్. వీటిని ఎక్కువగా శుద్ధి చేస్తారు. ఇలాంటి పిండి పదార్ధాలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీంతో టైప్ 1, టైప్ 2 మధుమేహం పెరిగిపోతుంది. అందువల్ల వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండండి.

4. ఫ్రూట్-ఫ్లేవర్డ్ యోగర్ట్

4. ఫ్రూట్-ఫ్లేవర్డ్ యోగర్ట్

ఫ్రూట్-ఫ్లేవర్డ్ యోగార్ట్ లో తక్కువ ఫ్యాట్, పాలు, పిండి పదార్థాలు, చక్కెరతో తయారు చేస్తారు. ఒక కప్పు ఫ్రూట్-ఫ్లేవర్డ్ యోగర్ట్ లో చక్కెర 47 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇందులో దాదాపు 81% చక్కెరకు సంబంధించిన కేలరీలుంటాయి. అందువల్ల ఫ్రూట్-ఫ్లేవర్డ్ యోగర్ట్ ను మధుమేహ వ్యాధిగ్రస్తులు అస్సలు తినకూడదు. దీనికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి.

5. స్వీట్డ్ బ్రేక్ ఫాస్ట్ సెరల్స్

5. స్వీట్డ్ బ్రేక్ ఫాస్ట్ సెరల్స్

వీటిని అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే వీటిని ఎక్కువగా ప్రాసెస్ చేసి ఉంటారు. అలాగే వీటిలో ఎలాంటి ప్రోటీన్స్ ఉండవు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పెంచుతాయి. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటికి వీలైనంత దూరంగా ఉండాలి.

6. ఫ్లేవర్డ్ కాఫీ డ్రింక్స్

6. ఫ్లేవర్డ్ కాఫీ డ్రింక్స్

వీటిలో ఎక్కువగా పిండి పదార్థాలుంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందువల్ల ఫ్లేవర్డ్ కాఫీ డ్రింక్స్ ను ఎక్కువగా తీసుకోకూడదు. వీలైనంత వరకు మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటికి దూరంగా ఉండాలి.

7. తేనె, అగ్వే నిక్టర్, మేపల్ సిరప్

7. తేనె, అగ్వే నిక్టర్, మేపల్ సిరప్

వీటిలో ఉండే చక్కెర బ్లడ్ షుగర్ కు కారణం అవుతుంది. వీటిని ప్రాసెస్ చేయకపోయినప్పటికీ వీటిలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటికి వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది.

8. డ్రై ప్రూట్స్

8. డ్రై ప్రూట్స్

డ్రై ప్రూట్స్ లో నీరు మొత్తం పోవడం వల్ల వీటిలో చక్కెర మోతాదు అధికంగా ఉంటుంది. మధుమేహం వ్యాధిగ్రస్తులు డ్రై ప్రూట్స్ ను తీసుకోకుండా ఉండడం మంచిది. అంజీర్, బాదం, పిస్తా, అక్రోట్టు, ఆఫ్రికాట్, చెర్రి, ఖర్జూర, కాజు, కిస్మిస్, అల్ బుకార, ఖుర్బాని, అమ్ల, బెర్రి, పైన్, సారపప్పులు ఉంటాయి. అలాగే ఖర్జూరలో ఖమియా ఖర్జూర, అజ్‌వా ఖర్జూర, కిస్‌మిస్‌లో ఇరాని కిస్‌మిస్, బాదంలో ప్రత్యేకమైన ముమ్రా బాదం, కాజులో కిమియా కాజు తదితర వెరైటీ రకాలుంటాయి. వీటన్నింటినీ వీలైనంత వరకు మధుమేహవ్యాధిగ్రస్తులు దూరంగా ఉండాలి.

9. ప్యాక్డ్ స్నాక్ ఫుడ్స్

9. ప్యాక్డ్ స్నాక్ ఫుడ్స్

ప్యాకేజీ స్నాక్ ఫుడ్స్ ను అస్సలు తినకూడదు. వీటిని ఎక్కువగా శుద్ధి చేసిన పిండితో తయారు చేస్తారు. వీటిలో ఎలాంటి పోషకాలుండవు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందువల్ల ప్యాక్డ్ స్నాక్ ఫుడ్స్ కు వీలైనంత దూరంగా ఉండాలి.

10. ఫ్రూట్ జ్యూస్

10. ఫ్రూట్ జ్యూస్

పలు రకాల ఫ్రూట్ జ్యూస్ షుగర్ వ్యాధిగ్రస్తులకు అంత మంచివి కావు. ఇవి రక్తంలో చక్కెరను పెంచుతాయి. అందువల్ల పండ్ల రసం, సోడా వంటి వాటిని తీసుకోకూడదు. చక్కెర కలిపినటువంటి సోడా మామూలు సోడాకంటే చాలా ప్రమాదకరం. వీటన్నింటికీ మధుమేహ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉంటే కాస్త ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే వ్యాధి తీవ్రత మరింత పెరుగుతుంది.

English summary

Are You A Diabetic? Then Avoid These Foods Right Away!

Diabetes is a chronic disease that has reached great proportion among people, the world over. When diabetes is uncontrolled, it can have serious complications such as heart disease, kidney disease, blindness and other complications. What is more important is that, eating the wrong foods can raise your blood sugar and insulin levels and this also promotes inflammation that can raise the risk of this disease.
Story first published: Tuesday, November 14, 2017, 12:00 [IST]
Subscribe Newsletter