ఆర్టిఫిషియల్ స్వీట్స్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ త్వరగా వచ్చే ప్రమాదం ఉంది

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మీరు తీసుకొనే చక్కెర శాతాన్ని తగ్గించుకొనే క్రమంలో భాగంగా కృత్రిమ చక్కెర పదార్ధాలను తీసుకోవడం ఒక మంచి ఎంపిక అని మీరు గనుక భావించినట్లైతే, మీరు తప్పుచేస్తున్నట్లు లెక్క.

ఈమధ్యనే జరిగిన కొత్త అధ్యయనం ప్రకారం కృత్రిమ చక్కెర పదార్ధాలు తీసుకోవడం వల్ల టైప్ 2 మధుమేహం వ్యాధి భారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని కనుగొన్నారు.

అలర్ట్ : ఈ 10 కారణాల వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు అధికం.!

causes of type 2 diabetes

ఆస్ట్రేలియా లో ఓ ప్రముఖ యూనివర్సిటీ కి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కృత్రిమ చక్కెర పదార్ధాలు రెండువారాలు గనుక తీసుకున్నట్లైతే వాటి ద్వారా మన శరీరానికి లభ్యమయ్యే గ్లూకోస్ వల్ల, మన శరీరంలో కలిగే మార్పులను అవి ఎంతగానో ప్రభావితం చేస్తాయి మరియు అలా జరగడానికి అవే కారణం అనే విషయాన్ని గుర్తించారు.

ఈ అధ్యయనానికి 27 మంది ఆరోగ్యవంతమైన మనుష్యులను ఎంపిక చేశారు. రోజుకు రెండు రకాల కృత్రిమ చక్కెర పదార్ధాలు సేవించమని వీళ్లకు ఇచ్చారు. ఆ రెండు చక్కెర పదార్ధాలు కలిపి ఒకటిన్నర లీటరు కృత్రిమ చక్కెర పానీయానికి సమానం.

causes of type 2 diabetes

రెండు వరాల అధ్యయనంలో భాగంగా వీళ్ళు ఇచ్చిన బిళ్లలను రోజుకు మూడు సార్లు ఆహరం తీసుకునే ముందు వేసుకోవాలి. ఇలా అందరూ రెండు వారాలు చేసిన తర్వాత వాటి ద్వారా లభించిన గ్లూకోస్ కి మన శరీరం ఎలా స్పందిస్తుంది అనే విషయమై పరీక్షించారు.

టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు ఖచ్చితంగా తినకూడని 7 ఫుడ్స్

ఈ పరీక్షలో భాగంగా కృత్రిమ చక్కెర పదార్ధాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ ని శరీరం పీల్చుకునే స్థాయిలు పెరిగిపోయాయి మరియు రక్తంలో కూడా గ్లూకోస్ నిల్వలు పెరిగిపోయాయి. కానీ ఆహారం తీసుకున్న తర్వాత శరీరం గ్లూకోస్ ని రక్తంలో కలవనివ్వకుండా చేసే శక్తిని కొంతమేర కోల్పోయింది.

ఈ అధ్యయనాన్ని ఈ మధ్యనే పోర్చుగల్ లో జరిగిన యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ అఫ్ డయాబెటిస్ ఇన్ లిస్బన్ వార్షిక సమావేశాల్లో ప్రదర్శించారు.

English summary

Artificial Sweeteners Can Increase Type 2 Diabetes Risk Quickly – Study

A new study has been found that artificial sweeteners can actually increase the risk of Type 2 diabetes.Know the details here on Boldsky.