ప్రపంచ ఆరోగ్య దినోత్సవం: బ్లడ్ షుగర్ లెవల్స్, డయాబెటిస్ ను తగ్గించే 8 ఎఫెక్టివ్ టిప్స్.!!

Posted By:
Subscribe to Boldsky

మధుమేహం తియ్యటి శత్రువు. చాప కింద నీరులా చల్లగా మన ఒంట్లోకి చేరిపోతుంది. ఏమరుపాటుగా ఉంటే జీవితంలోని తీపిని దూరం చేసి చేదును మిగులుస్తుంది. భారత దేశం మొత్తాన్ని ఎక్కువగా బాధిస్తున్న వ్యాధి మధుమేహం అదే చక్కర వ్యాధి , షుగర్ వ్యాధి. ఇది భారత దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి కచ్చితంగా ఉంది అంటున్నారు మన ఆరోగ్య నిపుణులు.... మన దురదృష్టం ఏమిటంటే ఇంత వరకు ఈ వ్యాధికి సరైన మందు కనుగొనలేదు.కానీ సరైన ఆహార నిమయమాలు పాటిస్తే కచ్చితంగా దీనివలన మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటున్నారు నిపుణులు.

World Health Day; 8 Effective Ways To Lower Blood Sugar & Thereby Diabetes

ప్రస్తుత రోజుల్లో డయాబెటిస్ ను ఒక కామన్ లైఫ్ స్టైల్ వ్యాధిగా పేర్కొంటున్నారు. కాబట్టి, ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా బ్లడ్ షుగర్ లెవల్స్ ను ఏవిధంగా కంట్రోల్ చేసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలియజేస్తున్నాము.

ఈ రోజుల్లో జీవనశైలి ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా స్ట్రెస్ , ఆహారపు అలవాట్లు, పోషకాహర లోపం, నిద్రలేమి, వ్యాయామ లేమి ఇవన్నీ కూడా డయాబెటిస్ కు ప్రదాన కారణాలుగా సూచిస్తున్నాయి.

మీకు షుగర్(డయాబెటిస్)వ్యాధి ఉందనడానికి ప్రధాన లక్షణాలు

డయాబెటిస్ క వస్తుందేమన్న భయం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లైతే తప్పకుండా వ్యాధిని నివారించుకోవచ్చు. ఇప్పటికే మధుమేహంతో బాధపడే వారు, ఈ నియమాలు పాటించడం వల్ల వ్యాధిని కంట్రోల్ చేసుకోవాలి. మరో బాధకరమైన విషయం ఏంటంటే ఈ మద్య కాలంలో పిట్టే పిల్లల్లో కూడా డయాబెటిస్ భారిన పడుతున్నారు.

కాబట్టి, మదుమేహాన్ని లేదా బ్లడ్ షుగర్ లేవల్స్ ను కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ మార్గాలను ఈ క్రింది విధంగా సూచించడం జరిగింది.,..

రెగ్యులర్ డైట్ లో బార్లీ వాటర్ ను చేర్చుకోవాలి:

రెగ్యులర్ డైట్ లో బార్లీ వాటర్ ను చేర్చుకోవాలి:

బార్లీ వాటర్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. దీర్ఘకాలంలో ఇది మెటబాలిజం రేటు పెంచి గ్లూకోజ్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

 నడక :

నడక :

డయాబెటిస్ ఉన్నవారు రెగ్యులర్ వాకింగ్ చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ క్రమబద్దంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే డయాబెటిస్ ను నివారించుకోవచ్చని సూచిస్తున్నారు. 15 నిముసాలు ప్రతి రోజూ వాకింగ్ చేడయంవల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి,.

మెంతులు :

మెంతులు :

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచడానికి మెంతులు గ్రేట్ గా సహాయపడుతాయి. ఒక టీస్పూన్ మెంతి పొడి తీసుకుని, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి, తాగాలిజ ఇలా రెగ్యులర్ గా ప్రతి రోజూ తింటుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లోకి వస్తాయి.

పండ్లు :

పండ్లు :

జ్యూసులకు బదులుగా ఫ్రూట్స్ ను నేరుగా తినడం మంచిది. జ్యూసులతో కంపేర్ చేస్తే ఫ్రెష్ ఫ్రూట్స్ ను తినడం ఇటు ఆరోగ్యానికి మరియు అటు బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఆపిల్ మరియు ఆరెంజ్ ఫ్రూట్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.

గ్రీన్ వెజిటేబుల్స్ :

గ్రీన్ వెజిటేబుల్స్ :

గ్రీన్ వెజిటేబుల్స్ లో స్ట్రార్చ్ ఉండదు కాబట్టి, బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఆకుకూరలు, కాలీ ఫ్లవర్, లెట్యూస్, కేల వంటి రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

నీళ్లు ఎక్కువగా తాగాలి:

నీళ్లు ఎక్కువగా తాగాలి:

రోజులో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కూడా బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసపుకోవచ్చు. రక్తంలో నీటిశాతం తగ్గడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కాబట్టి, రోజంతా శరీరంను హైడ్రేషన్ లో ఉంచుకోవడం వల్ల బ్లడ్ షుగర్ వెల్స్ కంట్రోల్లో ఉంటాయి.

విటమిన్ డి:

విటమిన్ డి:

శరీరంలో విటమిన్ డి లోపించడం వల్ల ఇన్సులిన్ లెవల్స్ పెరుగుతాయి. దాంతో బ్లడ్ షుగర్ వెల్స్ పెరుగుతాయి. కాబట్టి , శరీరంలో విటమిన్ డి తగ్గకుండా చూసుకోవాలి. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గకుండా నివారిస్తుంది.

అలోవెర:

అలోవెర:

అలోవెర జెల్ ను , పసుపు, బే లీఫ్ ను వాటర్ లో మిక్స్ చేసి తాగడం వల్ల కూడా బ్లడ్ షుగర్ వెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఈ వాటర్ ను రోజూ రాత్రి డిన్నర్ కు ముందు తాగడం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది.

English summary

World Health Day; 8 Effective Ways To Lower Blood Sugar & Thereby Diabetes

If you are ailing with diabetes, then you need to check out the foods that you eat as well as the exercises. A few effective ways to lower the blood sugar level are discussed in this article.
Please Wait while comments are loading...
Subscribe Newsletter