For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాగి పాత్రలు లేదా కాపర్ వాటర్ బాటిల్లోని నీళ్ళు తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు క్రమబద్దీకరించబడుతాయా ?

|

డయాబెటిస్ మెల్లిటస్, రక్తంలోని (రక్తంలోని అధిక గ్లూకోజ్ స్థాయిలు) అధిక చక్కెరల వలన కలిగే వ్యాధుల సమూహాన్ని సూచిస్తుంది. WHO ప్రకారం, 18 సంవత్సరాలకు పైనున్న పెద్దవారిలో, ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ రోగుల ప్రాబల్యం 4.7% (1980 లెక్కల ప్రకారం) నుండి 8.5% (2014 లెక్కల ప్రకారం) వరకు పెరిగింది. ఈ నాలుగేళ్ళలో ప్రపంచవ్యాప్తంగా మారిన పరిస్థితుల ప్రకారం, దీని తీవ్రత మరింత పెరిగే అవకాశాలను చూపిస్తున్నాయి. 2030లో ప్రపంచవ్యాప్త మరణాలలో డయాబెటిస్ ఏడవ ప్రధాన కారణం అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆలస్యంగా సమస్యను గుర్తుంచడం, అవగాహనా లేమి, కొన్ని రకాల అపోహలు వంటివి ప్రధానంగా ఈ డయాబెటిస్ మిల్లిటస్ తలెత్తడానికి కారణాలుగా ఉన్నాయి. వాస్తవానికి రక్తంలో చక్కెర నిల్వలు 100 mg / dl కింద ఉండాలి. మీ రక్తంలో చక్కెర స్థాయిలు మొతాదులను దాటి ఉన్న ఎడల, సంబంధిత వైద్యుని సంప్రదించి, క్రమంగా సరైన మందులను తీసుకోవలసి ఉంటుంది. కానీ డయాబెటీస్ సమస్యలను ఉత్తమంగా నిర్వహించేందుకు ఒక సమర్ధనీయమైన గృహ నివారణా చిట్కా కూడా ఉంది, అదే రాగి పాత్రలలో నీటిని సేవించడం.

ఒక రాగి పాత్రలో నిల్వ చేయబడిన నీటిని సేవించడం, భారతదేశంలో తరతరాలుగా పాటిస్తున్న పురాతన ఆచారం. వాస్తవానికి, దేశంలో అందరికీ తెలిసిన నీటి శుద్ధీకరణ యొక్క పురాతన రూపాలలో ఒకటిగా ఉంది. ఒక రాగి పాత్రలో నీటిని నిల్వ చేయడం ద్వారా, సహజ శుద్దీకరణ ప్రక్రియను సృష్టిస్తుందని చెప్పబడింది. క్రమంగా నీటిలోని మలినాలు తొలగి స్వచ్చమైన నీటిని అందిస్తుందని చెప్పబడింది. రాగి నీరు తీసుకోవడం వలన అనేక రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది నీటిలో ఉన్న సూక్ష్మజీవులను, శిలీంధ్రాలు, ఆల్గే మరియు బ్యాక్టీరియాలను సమూలంగా నాశనం చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతే కాకుండా, ఒక రాగి పాత్రలో పూర్తిగా ఒక రాత్రి లేదా కనీసం నాలుగు గంటల పాటు నీటిని నిల్వచేయడం ద్వారా, రాగిలోని ప్రసిద్ద లక్షణాలు నీటిలో చేరి మరికొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుందని చెప్పబడింది.

How Diabetics Can Benefit from Drinking Copper Treated Water

కాపర్ వాటర్ బాటిల్ లేదా రాగి పాత్రలలోని నీళ్ళు తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు క్రమబద్దీకరించబడుతాయా ? ఎంతవరకు నిజం ? వైద్యులు ఏమంటున్నారు ?

రాగి, వ్యక్తి ఆరోగ్య శ్రేయస్సు కోసం

రాగి, వ్యక్తి ఆరోగ్య శ్రేయస్సు కోసం

రాగి, వ్యక్తి ఆరోగ్య శ్రేయస్సు కోసం సూచించబడిన మరియు ముఖ్యమైన ఖనిజము. దురదృష్టవశాత్తు, మన శరీరంలోని జీవక్రియలు, రాగిని స్వతహాగా తయారు చేయలేని కారణాన, ఆహారం ద్వారానే ఈ ఖనిజాన్ని శరీరానికి అందివ్వలసిన అవసరం ఉంటుంది.

రాగి ఖనిజంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు

రాగి ఖనిజంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు

రాగి ఖనిజంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గాయాలను నయం చేయడంలో, రోగనిరోధక పనితీరుని పెంచడంలో, ఎర్ర రక్త కణాలను మరియు చర్మ కణాల అభివృద్ధిని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపకరిస్తాయి. డయాబెటిక్స్ తరచుగా ఎదుర్కొనే చర్మ సమస్యలు, వాపు మరియు వైద్యానికి ఆలస్యంగా స్పందించడం వంటి సమస్యలను తగ్గించగలవు. ఇక్కడ రాగి నీరు అత్యద్భుతంగా పనిచేస్తుంది. మెగ్నీషియం మరియు మాంగనీస్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలతోపాటు రాగిని కూడా శరీరానికి అందివ్వగలిగితే, గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్దీకరించడంలో ఎంతగానో సహాయపడుతుందని చెప్పబడింది.

ఆయుర్వేదం ప్రకారం,

ఆయుర్వేదం ప్రకారం,

ఆయుర్వేదం ప్రకారం, రాగి నీరు లేదా 'తామ్ర జల్' అనేక ప్రయోజనాలతో నిండి ఉంది. చర్మం ఆరోగ్యాన్ని పెంచడం, బ్యాక్టీరియా మరియు మంటతో పోరాడటం ద్వారా జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మధుమేహం నిర్వహణలో దాని పనితీరు అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. డాక్టర్ వసంత్ లాడ్ చేత రచించబడిన 'ది కంప్లీట్ బుక్ ఆఫ్ ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీస్' లో, కఫ దోషం సంబంధిత క్రమరాహిత్యాన్ని నిర్వహించడానికి మరియు ఆరోగ్యకర రక్తశుద్దికి రాగి నీరు ఉత్తమంగా ఉంటుందని చెప్పబడింది. అంతేకాకుండా రక్తంలోని చక్కెరల వలన ప్రేరేపించబడే కడుపులో మంట వంటి ప్రతికూల అంశాలకు సైతం చికిత్సగా ఉండగలదు. "ఒక కప్పు నీటిని ఒక రాగి పాత్రలో ఒక రాత్రి ఉంచి, మరుసటి ఉదయం ఆ నీళ్ళను తీసుకోవలసి ఉంటుంది" అని డాక్టర్ వసంత్ లాడ్ పేర్కొన్నారు.

వాస్తవానికి డయాబెటిస్ సమస్యను నిర్వహించడం అంత సులువైన అంశం కాదు,

వాస్తవానికి డయాబెటిస్ సమస్యను నిర్వహించడం అంత సులువైన అంశం కాదు,

వాస్తవానికి డయాబెటిస్ సమస్యను నిర్వహించడం అంత సులువైన అంశం కాదు, అలాగని పోరాడలేమని అర్ధం కాదు. సరైన ఆహార ప్రణాళిక, వ్యాయామంతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలి మీ డయాబెటీస్ సమస్యను ఉత్తమంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. మీ ఆహారంలో తగినన్ని కార్బోహైడ్రేట్లు, ఫైబర్ మరియు తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగిన ఆహారాలు ఉన్నాయని నిర్ధారించుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

How Diabetics Can Benefit from Drinking Copper Treated Water

Based on various studies conducted over the last few decades it has been established that copper can help with the prevention as well as the treatment for several diseases
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more