For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మదుమేహం సంబధించిన ఈ అపోహలు-వాస్తవాలు వింటే ఆశ్చర్యపోవడం గారెంటీ...!

|

మనుషులను తప్పుదారి పట్టించడానికి మధుమేహంతో సంబంధం ఉన్న అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. మీకు మధుమేహం అనేది ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ప్రభావితం చేసే అత్యంత విస్తృతమైన వ్యాధులలో ఒకటని తెలుసా? ఈ వ్యాసంలో, మధుమేహం గురించిన వాస్తవాలు మరియు అపోహల గురించిన వివరాలను పొందుపరుస్తున్నాము.

ఈ వ్యాధికి సంబంధించిన కొన్ని వాస్తవాలను గురించిన అవగాహన ప్రజలలో చాలా తక్కువగా ఉంది అన్నది సత్యం . అసంఖ్యాకమైన అపోహలు మరియు సమస్యాత్మక వివరణలు ప్రయోజనాలను ఇవ్వకపోగా సమస్యలను కలుగజేస్తుంటాయి. ఈ వ్యాసంలో, మనం మధుమేహం గురించిన అవాస్తవాలను, అపోహలను మరియు వాస్తవాల గురించి తెలుసుకుందాం.

These Myths And Facts About Diabetes Will Surprise You

మధుమేహం గురించిన తప్పుడు అంచనాలు మధుమేహానికి ప్రభావితం అయిన రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలను చూపగలవు. సులభమార్గాలను అన్వేషించడం అనే లక్షణం ద్వారా కోరి సమస్యలను తెచ్చుకుంటున్న చందాన అనేకమంది ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు అన్నది జగమెరిగిన సత్యం.

ఇంకనూ, అనేకమైన సరికాని ఆలోచనలు మనుగడలో ఉన్నాయి అంటే ఆశ్చర్యం కలుగకమానవు. అవి అవాస్తవాలు అని తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

మధుమేహం అపోహలు మరియు వాస్తవాల గురించిన వివరాలు తెలుసుకొనుటకు ఈ వ్యాసం మీకు ఉపయోగపడుతుంది.

క్రింది విభాగంలో మధుమేహం సంబంధించిన అపోహలు-వాస్తవాలు పొందుపరచబడి ఉన్నాయి.

# అపోహ : డయాబెటిస్ తీవ్రమైన వ్యాధి కాదు

# అపోహ : డయాబెటిస్ తీవ్రమైన వ్యాధి కాదు

వాస్తవం: ఎయిడ్స్ లేదా రొమ్ము క్యాన్సర్ కంటే మధుమేహం కారణంగా సంభవించిన మరణాల సంఖ్యే ఎక్కువని ఇటీవలి సర్వే ఒకటి వెల్లడించింది. మధుమేహం గుండెపోటు ప్రమాదాన్ని దాదాపు రెట్టింపు చేస్తుంది. అయితే, ఈ వ్యాధి నియంత్రించవచ్చు అని తెలుపడం కాస్త సంతోషించాల్సిన విషయం.

# అపోహ : మీరు ఊబకాయంతో భాదపడుతూ ఉంటే మీకు టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధి చెందే అవకాశాలు అధికంగా ఉన్నాయి

# అపోహ : మీరు ఊబకాయంతో భాదపడుతూ ఉంటే మీకు టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధి చెందే అవకాశాలు అధికంగా ఉన్నాయి

వాస్తవం: అధిక బరువు ఉండటం అనేది టైప్ -2 మధుమేహం అభివృద్ధి చెందే కారణాల్లో ఒకటి. కానీ కేవలం ఊబకాయమే కాకుండా, కుటుంబ చరిత్ర, వయస్సు మరియు జాతి వంటి అనేక ఇతర అంశాలు కూడా మధుమేహం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

# అపోహ : చక్కెర ఎక్కువగా తీసుకోవడం డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది

# అపోహ : చక్కెర ఎక్కువగా తీసుకోవడం డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది

వాస్తవం: కాదు, టైపు 1 మధుమేహం అనేది జన్యుపరమైన మరియు తెలియని అనేక కారకాల కలయిక వలన సంభవిస్తుంది. అయితే టైపు 2 డయాబెటీస్ జన్యు పరమైన లేదా జీవనశైలి కారకాలు రెండింటినీ కలిగి ఉంటుంది. మీరు మీ కుటుంబంలో వంశపారంపర్యంగా మధుమేహం చరిత్రను కలిగి ఉంటే, ఆరోగ్యవంతమైన సమతుల్య ఆహార ప్రణాళిక పాటించడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ద్వారా ఈ వ్యాధి నుండి వీలైనంత దూరంగా ఉండుటకు సహాయపడుతుంది.

# అపోహ : కఠినమైన ఆహార ప్రణాళిక అవసరమవుతుంది

# అపోహ : కఠినమైన ఆహార ప్రణాళిక అవసరమవుతుంది

వాస్తవం : ఆరోగ్యకరమైన ఆహారం అనేది సరైన ఆరోగ్యానికి ప్రాథమిక నియమం డయాబెటిక్ రోగికి అయినా, డయాబెటిక్ కాని వ్యక్తికి అయినా అదే నియమం వర్తిస్తుంది. మీ ఆహారాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీ ఆహార ప్రణాళికలో ఇప్పుడు చెప్పేవి కాస్త మధ్యస్తంగా తీసుకోవలసి ఉంటుంది. ధాన్యపు రొట్టెలు, పాస్తా, తృణధాన్యాలు, బియ్యం, బంగాళాదుంపలు, మొక్కజొన్న, పండ్లు, పాలు, పెరుగు, స్వీట్లు మరియు పండ్లు మొదలైనవి వంటి పిండిపదార్ధాల వంటివి తక్కువగా తీసుకునేలా ప్రణాళిక సిద్దం చేసుకోవాలి.

# అపోహ: మీరు డయాబెటిస్ కలిగి ఉంటే మీరు స్వీట్స్ అసలు తినకూడదు

# అపోహ: మీరు డయాబెటిస్ కలిగి ఉంటే మీరు స్వీట్స్ అసలు తినకూడదు

వాస్తవం: మీరు స్వీట్లను పూర్తిగా తగ్గించుకోవలసిన అవసరం లేదు. బదులుగా, వాటిని మితంగా తినడం మరియు క్రమం తప్పకుండా మీ శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్దీకరించడం కొనసాగించడం వంటివి మీకు సహాయపడుతాయి.

# అపోహ: మధుమేహం అంటురోగం

# అపోహ: మధుమేహం అంటురోగం

వాస్తవం: కాదు, మధుమేహం అంటురోగం కాదు! అయితే, మధుమేహం ఉన్న వ్యక్తికి దారితీసే కొన్ని కారకాలు ఉన్నాయి. సాధారణంగా, ఇది జీవనశైలి మరియు జన్యు కారకాల కారణంగా ఉంటుంది.

# అపోహ : వ్యాయామం అనేది మధుమేహ రోగులకు ప్రమాదకరమైనది

# అపోహ : వ్యాయామం అనేది మధుమేహ రోగులకు ప్రమాదకరమైనది

వాస్తవం: ఇది తప్పు! అనేక అధ్యయనాల ప్రకారం క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం, శారీరక శ్రమ అనునవి రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది. మరియు మధుమేహం తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ వ్యాయామాలు మితంగా, పర్యవేక్షకుని సలహా మేరకు చేయాలి.

 # అపోహ : అన్ని రకాల మధుమేహాలు ఒకటే

# అపోహ : అన్ని రకాల మధుమేహాలు ఒకటే

వాస్తవం: అనేక రకాలైన మధుమేహాలు మనుగడలో ఉన్నాయి. అత్యంత సాధారణంగా టైప్1 మధుమేహం,టైప్ 2 మధుమేహం మరియు డెలివరీ తర్వాత మధుమేహం మొదలైనవి ప్రముఖంగా ఉన్నాయి. మధుమేహం యొక్క ప్రతి రకం దానికి సంబంధించిన ప్రత్యేకమైన కారణాలను కలిగి ఉంటుంది. ఒక్కో రకం మధుమేహం ఒక్కోరీతిలో చికిత్స చేయవలసి ఉంటుంది. గర్భధారణ తర్వాత గర్భధారణ సంబంధిత మధుమేహం దూరంగా పోతుంది. కాని అది జీవితకాలంలో టైప్2 డయాబెటిస్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది.

# మధుమేహులు బంగాళదుంపలు మరియు బియ్యం తీస్కోవచ్చా

# మధుమేహులు బంగాళదుంపలు మరియు బియ్యం తీస్కోవచ్చా

అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, మధుమేహులకు 45 నుంచి 60 గ్రాముల కార్బోహైడ్రేట్ల భోజనం అవసరం బియ్యంతో కలిపి. ఉడికించిన బంగాళాదుంపలు తీసుకోవచ్చు, మరియు వేయించిన కట్లెట్లను మాత్రం తీసుకోరాదు అని చెప్పబడింది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు వీలైన మేర వైద్యుని పర్యవేక్షణలోనే ఆహారం, మరియు వ్యాయామ సంబందిత నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మధుమేహం గుండెపోటు వంటి ప్రమాదకర వ్యాధులకు కూడా దారితీయవచ్చు. కావున క్రమబద్దమైన ఆహార ప్రణాళిక, జీవన శైలి, మరియు పరిమితిలో వ్యాయామం అవసరం.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆరోగ్య సంబంధిత వివరాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

These Myths And Facts About Diabetes Will Surprise You

Misconceptions about diabetes could affect how diabetic patients take care of themselves. Eating well when you have diabetes can be a tough task but, it's not difficult either. The myths are diabetes isn't serious, obese increases the chances of type 2 diabetes, a strict diet needs to be followed, if you have diabetes cannot eat sweets, etc.
Story first published: Friday, July 6, 2018, 18:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more