For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహంతో కూడిన 7 ఊహించని దుష్పరిమాణాల గురించి తెలుసుకోండి !

|

ఈ రోజుల్లో డయాబెటిస్ (మధుమేహం) అనేది ఒక సాధారణమైన ఆరోగ్య పరిస్థితిగా చెప్పవచ్చు. కొందరికైతే అది ఒక ఇంటి పేరుగా కూడా మారిపోయిందంటే ఆశ్చర్యం లేదు. ఆఖరికి నీకెన్ని కేజీల షుగర్ ఉంది అంటే, నీకెంత అంటూ జోకులు వేసుకునే పరిస్థితిలో ఉన్నారు అనేకులు.

ప్రపంచంలో ఉన్న మొత్తం మధుమేహ రోగుల్లో, భారత్ అత్యధిక సంఖ్యలో ఉన్నట్లు అంచనా కూడా వేయబడింది. 2040 సంవత్సరం నాటికి ప్రపంచంలోని డయాబెటీస్ రోగుల సంఖ్య 123 మిలియన్లకి చేరుకుంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి కూడా !

7 Unexpected Side Effects Of Diabetes You Must Know!

ఈ వ్యాధి ఎన్ని సంవత్సరాలుగా మనుగడలో ఉంది, మరియు మారుతున్న ప్రజల జీవనశైలి వంటివి మధుమేహం పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈరోజుల్లో ఒక వ్యక్తి, ఏదైనా ప్రత్యేకమైన వ్యాధికి ప్రభావితం అయినప్పుడు, అది తీవ్రమైనదైనా (లేదా) సాధారణమైనదైనా కొన్ని దుష్ప్రభావాలు మాత్రం సంభవిస్తాయి. ఉదాహరణకు, ఏదైనా ఫ్లూ, కోల్డ్ వంటి సాధారణ జ్వరానికి ప్రభావితమైనా, తగ్గిన తర్వాత కూడా, అలసటతో బాధపడడం, చర్మం సున్నితంగా మారి గాయాలు, పుండ్లు ఏర్పడడం లేదా పగుళ్ళకు గురవడం వంటి దుష్ప్రభావాలు కలుగుతుంటాయి. చికెన్ పాక్స్ తర్వాత కొన్ని మచ్చలు జీవితాంతం మిగిలిపోవడం కూడా జరుగుతుంటుంది. అదేవిధంగా చికెన్ గున్యా, డెంగ్యూ వంటి జ్వరాలు కూడా నరాలు లాగడం, కీళ్ళ నొప్పులు వంటి దుష్ప్రభావాలను మిగులుస్తుంటాయి.

ఈవిధంగా, అనేక వ్యాధులు, నయమయిన తర్వాత కూడా కొన్ని ప్రత్యేకమైన ప్రతికూల పరిస్థితులను మిగిల్చి వెళ్తుంటాయి. అయితే, కొన్నిసార్లు, కొన్ని వ్యాధులు లేదా ప్రమాదాల కారణంగా కొన్ని అసాధారణమైన లేదా ఊహించని దుష్ప్రభావాలు ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు.

మధుమేహం విషయానికి వస్తే, రక్తంలో చక్కెర స్థాయిలలో పెరుగుదలతో పాటు, అలసట, బరువు తగ్గడం, మొదలైనవి ఈ వ్యాధి సాధారణ దుష్ప్రభావాలుగా ఉన్నాయి. అంతేకాకుండా, కొన్ని ఊహించని పరిస్థితులు ప్రాణాంతకంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకోండి.

1. అసమానమైన స్కిన్ పాచెస్ :

1. అసమానమైన స్కిన్ పాచెస్ :

మీరు ఏ కారణం లేకుండా, శరీరం మీద అసమానమైన "వెల్వెట్" మరియు డార్క్, స్కిన్ పాచెస్ వృద్ధి చెందినట్లు గమనించినట్లయితే, అవి మధుమేహం యొక్క ప్రధాన దుష్ప్రభావం కావచ్చు. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం కారణంగా, ప్రధానంగా రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా, ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి మీద ప్రభావాన్ని చూపుతుంది. చర్మం మీద పాచెస్ ఏర్పడినప్పుడు, శరీరంలో తిరుగుతూ ఉన్న అదనపు ఇన్సులిన్ హార్మోను, త్వరితగతిన చర్మాన్ని పునరుద్ధరించడానికి చర్మకణాలను ప్రేరేపిస్తుంది మరియు చర్మంలో అధిక మోతాదులో మెలనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, క్రమంగా మందపాటి, డార్క్ పాచెస్ ఏర్పడుతాయి.

2. హై కొలెస్ట్రాల్ :

2. హై కొలెస్ట్రాల్ :

మీరు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను ఎదుర్కొంటుంటే, మీరు డయాబెటీస్తో బాధపడుతున్నప్పుడు, అధిక కొలెస్ట్రాల్ మధుమేహం యొక్క మరొక ప్రధాన దుష్ప్రభావంగా ఉంది. శరీరంలోని ఇన్సులిన్ సమర్థవంతంగా ఉపయోగించబడని కారణంగా రక్తంలోని చక్కెర స్థాయిలు అధికంగా పేరుకుని పోయి, శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను తగ్గిస్తుంది. క్రమంగా అనారోగ్య కొవ్వు కణాలను మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.

3. మెదడు సంబంధిత సమస్యలు :

3. మెదడు సంబంధిత సమస్యలు :

మధుమేహంతో ఉన్న అనేక మంది, ఊహించని పక్షవాత సమస్యను సైతం అనుభవించిన దాఖలాలు కోకొల్లలు. మధుమేహం వారి జ్ఞాపకశక్తిని మందగించేలా చేయడంతో పాటు, మెదడు పనితీరులో క్షీణత, అల్జీమర్స్ మరియు చిత్తవైకల్యం వంటి మెదడు సంబంధిత వ్యాధులకు సైతం దారితీస్తుంది. కొంతమంది మధుమేహ రోగులలో మెదడుకు రక్తం ప్రవాహం అసాధారణంగా ఉంటుందని, ఒక్కోసారి అసమతుల్యత ఏర్పడడం కారణంగా, అనేక మెదడు సంబంధిత సమస్యలకు కారణమవుతుందని, కొన్ని అధ్యయనాలు సైతం సూచిస్తున్నాయి.

4. గమ్ డిసీజ్ :

4. గమ్ డిసీజ్ :

కొలంబియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ప్రజారోగ్య అధ్యయనం, మధుమేహంతో ఉన్నవారు గమ్ సంబంధిత వ్యాధులకు మరింత ఎక్కువగా గురవుతుంటారని తేల్చింది. ఇది ఊహించని దుష్ప్రభావాల్లో ఒకటిగా ఉంది. రక్తంలో అధిక చక్కెర స్థాయిలను పెంచడం, చిగుళ్ళలో కొల్లాజెన్ కణజాలాలను సవరించడం ద్వారా మధుమేహం కలిగిన రోగులలో గమ్ వ్యాధులు సంభవించవచ్చునని అధ్యయనం తేల్చింది, ఇవి ఇన్ఫ్లమేషన్(వాపు), మరియు కొన్ని రకాల అంటురోగాలకు సైతం అవకాశాన్ని కల్పిస్తాయి. అలాగే, మధుమేహ రోగులలో గాయాలను తగ్గించే సామర్థ్యం నెమ్మదిస్తుంది, క్రమంగా గమ్ ఆధారిత అంటువ్యాధులు తగ్గడానికి చాలాకాలం సమయం పడుతుంది.

5. వినికిడి నష్టం :

5. వినికిడి నష్టం :

డయాబెటిస్ సమస్య ఉన్నవారు వినికిడి నష్టానికి సైతం గురవుతున్నారని, అనేక పరిశోధనలు మరియు సర్వేలు గుర్తించాయి. ఇది కూడా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ప్రధానంగా ఎదుర్కొంటున్న దుష్ప్రభావాల్లో ఒకటి. డయాబెటిస్ వ్యాధికి గురయ్యాక, కొన్ని సంవత్సరాల తరువాత, చెవి లోపలి రక్త నాళాలు దెబ్బతినడం జరిగే అవకాశాలు ఉన్నాయి. క్రమంగా బలహీనమైన వినికిడికి దారితీస్తుంది. ఇది శాశ్వతంగా కూడా మిగిలిపోవచ్చు.

6. కిడ్నీ వైఫల్యం :

6. కిడ్నీ వైఫల్యం :

కిడ్నీ వైఫల్యం కూడా, మధుమేహం యొక్క తీవ్రమైన మరియు ఊహించని దుష్ప్రభావాలాలో ఒకటిగా ఉందని తెలుసా? ఒక వ్యక్తి సుదీర్ఘకాలం మధుమేహంతో బాధపడుతున్న ఎడల, రక్తంలో చక్కెర స్థాయిలు మూత్రపిండాల కణాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా రక్తాన్ని వడపోసే ప్రక్రియలో ఈ ప్రభావం ఉంటుంది.

క్రమంగా ఈసమస్య, మూత్రపిండ వ్యాధులు, అంటురోగాలు మరియు మూత్రపిండాల వైఫల్యానికి దారితీయవచ్చు, ఇది చికిత్సకు సైతం లొంగని ప్రాణాంతకమైన, వైద్యపరమైన అత్యవసర పరిస్థితిగా చెప్పబడింది.

7. లైంగిక అసమర్థత :

7. లైంగిక అసమర్థత :

మధుమేహం ఉన్న అనేకమంది లైంగిక అసమర్థతలను సైతం ఎదుర్కొంటున్నారు. మధుమేహం కారణంగా అకాల స్ఖలనం, వంద్యత్వం, జననాంగాలు పొడిబారడం మొదలైన సమస్యలను అనుభవించే పరిస్థితి నెలకొంటుంది. క్రమంగా ఇది డయాబెటిస్ యొక్క మరొక దుష్ప్రభావంగా కూడా గుర్తించబడింది. రక్తంలోని అధిక చక్కెరలు మరియు పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిల అసమతుల్యత ఏర్పడడం కారణంగా లైంగిక సంబంధ సమస్యలు కూడా తలెత్తుతాయని అధ్యయనాలు పేర్కొన్నాయి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈవ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

7 Unexpected Side Effects Of Diabetes You Must Know!

Diabetes is a health condition so common these days, that it has become a household name! It has been estimated that India has the highest number of diabetes patients in the world and by the year 2040, the number of diabetes patients in the world would be around 123 million!
Story first published: Sunday, September 16, 2018, 12:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more