Just In
- 5 hrs ago
పురుషుల్లో ప్రారంభంలోనే స్ఖలనం? నయం చేయడానికి చిట్కాలు!
- 7 hrs ago
అత్యాచారానికి పాల్పడిన వారిపై అత్యంత క్రూరమైన శిక్షలు వేసే దేశాలివే..
- 8 hrs ago
మీరు ఎంత టెన్షన్ లో ఉన్నా..వీటిలో ఒక్కటి తినండి చాలు..మీ టెన్షన్ మాయం..!!
- 9 hrs ago
వివాహానికి ముందు ఈ చిట్కాలు పాటించండి... ఒత్తిడికి గుడ్ బై చెప్పండి...
Don't Miss
- News
Disha case encounter: అందుకే ఎన్కౌంటర్ చేయగలిగారు: ఆయేషా మీరా తల్లి సంచలన వ్యాఖ్యలు
- Sports
తొలి టీ20 టీమిండియాదే: కోహ్లీ 94 నాటౌట్, మూడు టీ20ల సిరిస్లో 1-0 ఆధిక్యం
- Finance
కుబేరులనూ వదలని ఆర్థిక మాంద్యం: బిజినెస్ జెట్స్ కు గుడ్ బై!
- Movies
అలాంటి కామెంట్లు పెట్టారో అంతే సంగతి.. వారికి థ్యాంక్స్ చెప్పిన అనసూయ, చిన్మయి
- Technology
5జీ కోసం జియో,ఫ్లిప్కార్ట్,అమెజాన్లతో జట్టుకట్టిన క్వాల్కామ్
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
డయాబెటిస్ వారి కోసం బయోపాలిమర్ ఇంజెక్షన్: ఇన్సులిన్ ఇంజెక్షన్ కు ప్రత్యామ్నాయం
గణాంకాల ప్రకారం రోజురోజుకీ మధుమేహ రోగగ్రస్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 4.7 శాతం (1980) నుంచి 8.5 శాతం (2014) వరకు మధుమేహ రోగుల సంఖ్య పెరిగింది. 2016 గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,600,000 మరణాలు ప్రత్యక్షంగా మధుమేహం వలన సంభవిస్తున్నాయని చెప్పబడింది. ఒక వ్యక్తి రక్తంలో గ్లూకోజ్ లేదా చక్కెర స్థాయిలు అస్తవ్యస్థ పోకడలకు గురైనప్పుడు మధుమేహంతో బాధించబడుతారు. ఒక వ్యక్తి యొక్క దేహం ఇన్సులిన్ తయారుచేయలేని స్థితిలో ఉన్నప్పుడు, టైప్ 1 మధుమేహంతో బాధించబడుతారు. మరియు ఇన్సులిన్ సరైన మొత్తంలో ఉపయోగించడంలో శరీరం విఫలమైనప్పుడు టైప్ 2 మధుమేహ వ్యాధికి గురవడం జరుగుతుంటుంది.
ఈ మధుమేహ చికిత్సకోసం కాలానుగుణంగా వివిధ రకాల చికిత్సా పద్ధతులు అభివృద్ధి చెందాయి, మరియు అమలులో కూడా ఉన్నాయి. ప్రధానంగా ఇన్సులిన్ అందివ్వడం ఇందులో ప్రముఖంగా ఉంటుంది. క్రమంగా ఈ చికిత్సా పద్దతులు మధుమేహ సంకేతాలను మరియు లక్షణాలను నిర్వహించడానికి సహాయపడతాయి. మధుమేహ చికిత్సలో అత్యంత సాధారణమైన మరియు సమర్థవంతమైన పద్ధతిగా ఇన్సులిన్ ఇంజెక్షన్ చెప్పబడుతుంది. దీనిని ఇన్సులిన్ షాట్స్ (సూది మరియు సిరెంజ్) అని వ్యవహరిస్తారు, పెన్స్, పంప్స్, ఇన్హేలర్, ఇంజెక్షన్ పోర్ట్ మరియు జెట్ ఇంజెక్టర్ రూపాలలో లభ్యమవుతుంది. ఇన్సులిన్ గ్లూకోజ్ స్థాయిలను సాధారణ స్థితిలో ఉంచేందుకు సహాయపడుతుంది, తద్వారా వ్యక్తులు సాధారణ జీవితాన్ని నడిపేందుకు దోహదపడుతుంది.
అయితే, ప్రతి ఒక్కరి జీవనశైలి ప్రామాణికాలు భిన్నరీతులలో ఉన్న నేపధ్యంలో, కొన్నిసందర్భాలలో గ్లూకోజ్ స్థాయిలని స్థిరంగా నిర్వహించాల్సిన అవసరం కష్టతరంగా ఉండవచ్చు. వారానికి లేదా రోజువారీ ఇన్సులిన్ షాట్లను తీసుకోవడం కూడా ఒక్కోసారి మరిచిపోయే సందర్భాలను తీసుకుని రావొచ్చు, క్రమంగా శరీరానికి సరిపడా ఇన్సులిన్ అందివ్వలేకపోవచ్చు. మధుమేహ ఔషధాల యొక్క ప్రభావశీలతపై ఇటీవల జరిపిన పరిశోధనల ప్రకారం, పరిశోధకులు బయోపాలిమర్ ఇంజెక్షన్లను అభివృద్ధి చేయడం జరిగింది. ఇది వారాలకు సరిపడా గ్లూకోజ్ నిల్వల నియంత్రణను నిర్వహించడానికి అనువుగా ఉంటుందని చెప్పబడుతుంది. ప్రస్తుత కథనంలో, ఇన్సులిన్ ఇంజెక్షన్ల మీద బయోపాలిమర్ ఇంజెక్షన్ల యొక్క సంభావ్య ప్రభావం గురించిన వివరణను పొందుపరచడం జరిగింది.
బయోపాలిమర్ ఇంజెక్షన్లు అంటే ఏమిటి ?
బయోపాలిమర్లు అనేవి పాలిమర్ రకానికి చెందిన జీవసంబంధ పదార్థాలు లేదా జీవ సంశ్లేషక జీవుల ద్వారా రసాయనికంగా అభివృద్ధి చెందిన సహజ వనరుల ఉత్పత్తులుగా చెప్పబడుతాయి. ప్రాథమికంగా, ఇది బయోడిగ్రేడబుల్ కెమికల్ నిక్షేపాలను కలిగి ఉంటూ, అదనంగా కొన్ని ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, DNA, RNA, లిపిడ్స్, న్యూక్లియిక్ ఆమ్లాలు, పెప్టైడ్లు, గ్లైకోజెన్, స్టార్చ్ మరియు సెల్యులోజ్ వంటి పాలీసాచురైడ్లను కలిగి ఉంటాయి. బయోపాలిమర్లు ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటాయి. అవి వరుసగా స్టార్చ్ ఆధారిత బయోపాలిమర్లు, చక్కెర ఆధారిత బయోపాలిమర్ లు, సింథటిక్ మెటీరియల్ బయోపాలిమర్లు మరియు సెల్యులోజ్ ఆధారిత బయోపాలిమర్లుగా ఉన్నాయి.
పాలీపెప్టైడ్లను, అమైనో ఆమ్లాల యొక్క గొలుసులుగా అభివర్ణించడం జరుగుతుంది. ఈ బయోపాలిమర్లు డయాబెటిస్ చికిత్సలో పురోగతి సాధించాయి. డ్యూక్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేసిన హీట్-సెన్సిటివ్ పాలీపెప్టైడ్, గ్లూకగాన్-వంటి పెప్టైడ్-1 అణువుల (GLP1)తో చర్యలను జరుపగలదని ధ్రువీకరించారు. ఇది మధుమేహ రోగుల సంరక్షణలో సమర్థవంతమైన చికిత్సగా నిర్ధారించబడింది. సాధారణ ఇన్సులిన్ ఇంజెక్షన్ల కన్నా, ఈ ఇంజెక్షన్లు మరింత ప్రభావవంతమైనవిగా ఉంటూ, ఇన్సులిన్ ఇంజెక్షన్ల వలె నిరంతర ప్రాతిపదికన ఉపయోగించాల్సిన అవసరంలేనివిగా ఉంటాయి.
దీర్ఘకాలిక మధుమేహ చికిత్సకు బయోపాలిమర్ ఇంజెక్షన్లు గొప్ప చికిత్సా ఎంపికగా కూడా సూచించబడుతుంది...
మధుమేహ రోగులు సాధ్యమైనంత త్వరగా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించవలసిన అవసరం ఉంటుంది. టైప్ 2 మధుమేహం ఉన్న వ్యక్తుల్లో ఇన్సులిన్ స్థాయిలు సరైన నిక్షేపాలలో లేని పక్షాన, తీవ్రమైన సంక్లిష్టతలకు దారితీసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఏ వ్యక్తి అయినా ఇన్సులిన్ మోతాదులను సరైన మోతాదులలో పొందలేని పక్షంలో, అది రక్తంలోని చక్కెర లేదా గ్లూకోజ్ యొక్క అధిక పెరుగుదలకు దారితీస్తుంది. క్రమంగా ఈ పరిస్థితి, అంధత్వం, మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి వాటికి దారితీయడమే కాకుండా, శరీర దిగువ అవయవాలను తొలగించడానికి సైతం కారణమవుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇన్సులిన్ విషయంలో సరైన నిర్వహణ చేయలేని పరిస్థితుల్లో, అది ప్రాణాంతక సమస్యలకు దారితీసున్న నేపధ్యంలో, డ్యూక్ విశ్వవిద్యాలయంలోని బయోమెడికల్ ఇంజనీర్స్, బయోపాలిమర్ ఇంజెక్షన్లు అభివృద్ధి చేయడం జరిగింది. వాస్తవానికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు ప్రభావవంతంగా ఉన్నప్పటికీ, స్వల్పకాల జీవితాన్ని కలిగి ఉన్న GLP1 అణువుల కారణంగా, రోజులో కనీసం రెండుసార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అనుసరించవలసి ఉంటుంది. ఇది శరీరం నుండి త్వరగా అదృశ్యమయ్యే లక్షణాన్ని కలిగి ఉంటుంది. కానీ, పరిశోధకులు అభివృద్ధి చేసిన బయోపాలిమర్లు వెంటనే స్పందించి లోపలికి వచ్చే శరీర వేడికి తట్టుకోగలిగి, నెమ్మదిగా ఇన్సులిన్ను శరీరంలోకి విడుదల అయ్యేలా కరుగుతాయి.
ఇక వినియోగంలోని వస్తే, నెలలో ఒకటి లేదా రెండుసార్లు చొప్పున బయోపాలిమర్ షాట్లు తీసుకోవలసి ఉంటుంది. ఇవి, టైప్ 2 మధుమేహం నియంత్రించడానికి అవసరమైన రోజువారీ లేదా వారానికి సరిపడా ఇన్సులిన్ షాట్లను భర్తీ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ దీర్ఘకాలిక ఇంజెక్షన్ను ఒక మధుమేహ నియంత్రణ అణువు మరియు ఎలాస్టిన్ వంటి పాలీపెప్టైడ్ (ELP)తో కూడుకున్న గ్లూకాన్-1 వంటి పెప్టైడ్-1 (GLP1)తో కలపడం ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత వద్ద GLP1-ELP యొక్క కాంబినేషన్ ఒక బయో డీగ్రేడబుల్ జెల్ వంటి ' depot ' ని అభివృద్ధి చేస్తుంది. ఇది గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించగల ఔషధాన్ని విడుదల చేస్తుందని చెప్పబడుతుంది.
బయోపాలిమర్ ఇంజెక్షన్, పీక్-అండ్-వ్యాలీ ఫార్మకోకైనెటిక్స్ తొలగించడం ద్వారా, సంరక్షణా స్థాయిలను పెంచడం మరియు క్షమతను మెరుగుపరచడం వంటి చికిత్సా ఫలితాలను అందించగలుగుతుందని డ్యూక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సూచించారు. ఈ బయోపాలిమర్లు GLP1 మాత్రమే కాకుండా, ప్రోటీన్ థెరపాటిక్స్ మరియు పెప్టైడ్ల యొక్క పనితీరును కూడా పెంచుతుందని చెప్పబడింది.
టెక్సాస్ అధ్యయనం :
2014లో టెక్సాస్లో కోతులు మరియు ఎలుకలపై నిర్వహించబడిన ఒక అధ్యయనంలో, కోతులలో పెరిగిన గ్లూకోజ్ నిల్వల నియంత్రణను కనుగొనడం జరిగింది. ఎలుకలు లేదా కోతులు కన్నా మనుషులలో జీవక్రియలు నెమ్మదిగా ఉంటాయి. క్రమంగా ఈ మందులు మనుషుల మధుమేహ చికిత్సలో అత్యంత ప్రభావవంతంగా ఉంటాయని గంటాపధంగా చెప్తున్నారు. క్రమంగా బయోపాలిమర్ల ఔషదాల విడుదలలో స్వల్ప మార్పులను చేయడంపై దృష్టి సారించడం ద్వారా, కేవలం ఒక ఇంజెక్షన్ ద్వారా, ఔషధం యొక్క విడుదల వ్యవధిని పెంచడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మధుమేహ చికిత్సలో ఉపయోగించే ఇతర ఔషధాలకంటే మూడు రెట్లు ఎక్కువకాలంతో బయోపాలిమర్ ఇంజెక్షన్లు ఉంటాయని ఈ అధ్యయనం వెల్లడించింది. 2 నుండి 3 రోజుల ఇన్సులిన్ ఇంజెక్షన్లతో పోలిస్తే, ఒక బయోపాలిమర్ ఇంజెక్షన్ 14 రోజుల అధిక ప్రభావాన్ని కలిగి ఉంటుందని చెప్పబడింది. క్రమంగా మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు స్థిరమైన ఇంజెక్షన్ల భారాన్ని తగ్గించేందుకు కూడా సహాయం చేయగలవు. మరియు హైపోగ్లైకేమియా లేదా బరువు పెరుగుటను కూడా నివారించవచ్చునని చెప్పబడింది.
చివరిగా ..
డయాబెటిక్ పేషంట్స్ రోగనిరోధక వ్యవస్థపై బయోపాలిమర్ ఇంజెక్షన్ల ప్రభావాన్ని పూర్తిస్థాయిలో అర్థంచేసుకునేందుకు ప్రస్తుతం అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. మధుమేహానికి దీర్ఘకాలిక చికిత్సగా కాకుండా, బయోపాలిమర్ల నియంత్రిత విడుదల లక్షణాల కారణంగా దీర్ఘకాలికంగా నొప్పి నివారణిగా కూడా పనిచేస్తుంది. టైప్ 2 మధుమేహం ఉన్న రోగుల్లో దాదాపు సగానికి పైగా, ఆహార ప్రణాళికలలో అస్తవ్యస్త పోకడలను ఎదుర్కొంటున్న కారణంగా, బయోపాలిమర్ ఇంజెక్షన్లు సమర్థవంతమైన పరిష్కారంగా మారే అవకాశాలు అధికంగా ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. పూర్తిస్థాయిలో పరిశోధనలు జరుగుతున్న కారణంగా, వినియోగంలోనికి రావడానికి కొన్ని సంవత్సరాల సమయం కూడా పట్టవచ్చు. కానీ ఇవి వినియోగంలోనికి వచ్చి విజయవంతం అయితే, మధుమేహ రోగంతో బాధపడుతున్న వ్యక్తులకు ఊరటగా ఉంటుందనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.