For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిక్ వారు తినవల్సిన 15 రకాల ఉత్తమ పండ్లు

|

మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి డైట్ చార్ట్ ను సిద్దంచేసుకోవడంలో అత్యంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎటువంటి ఆందోళనా లేకుండా అనుసరించగల ఆహారాలు కొన్ని ఉన్నాయి. అయితే, వాస్తవానికి వారి రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచగల ఆహారాలు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. ఇక పండ్ల విషయానికి వస్తే, ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళికల దృష్ట్యా, సహజ సిద్దమైన పండ్లు మరియు కూరగాయలు చేకూర్చే ఆరోగ్యకర ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావని, మనందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ, మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు., ఈ సందర్భంలో ఒక గందరగోళాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. పండ్లలోని చక్కెరలు తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి., వాటిని అనుసరించవచ్చునా ? అని. అవునా ?

డయాబెటిక్ వారు తినవల్సిన 15 రకాల ఉత్తమ పండ్లు

మధుమేహ రోగగ్రస్తులకు సిఫార్సు చేయదగిన ఉత్తమమైన పండ్లు ఏవి ?

మధుమేహంతో బాధపడుతున్న రోగులకు పండ్లు సురక్షితమైనవి కావు అనే భావన పూర్తిగా తప్పు. అనేక రకాల పండ్లు, విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ నిక్షేపాలతో లోడ్ చేయబడి ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అత్యుత్తమంగా సహాయపడుతాయి. అలాగే టైప్ 2 మధుమేహం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వీటితో పాటు పీచు పదార్థం ఉన్నకారణంగా, కడుపు నిండిన అనుభూతికి లోనుచేయడం ద్వారా, అనారోగ్యకర ఆహార కోరికలను అరికట్టడం, అతిగా తినడం వంటి వాటిని నివారించగలదు. ఆరోగ్యవంతమైన బరువు నిర్వహణ అనేది, మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. మరియు మధుమేహం నిర్వహణలో కూడా సహాయపడుతుంది.

గ్లైసీమిక్ ఇండెక్స్ అనేది కార్బోహైడ్రేట్లను కలిగి ఉన్న ఆహారం, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిల్ని ఏవిధంగా పెంచుతుందో లెక్కించే గణాంకంగా చెప్పబడుతుంది. మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు సరైన ఆహార పదార్ధాలను ఎంపిక చేసుకోవడానికి గ్లైసెమిక్ గైడ్ ను ప్రధానంగా అనుసరించడం జరుగుతుంటుంది. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ విలువ కలిగిన ఆహారాలు, తక్కువ GI విలువ కలిగిన ఆహారాల కన్నా అధికంగా, మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి మొగ్గుచూపుతాయి. 55 లేదా అంతకన్నా తక్కువగా ఉంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అని , 56 నుండి 69 వరకు ఉన్న ఎడల మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ అని, మరియు 70 లేదా అంతకన్నా ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న వాటిని, అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ గా పరిగణించబడుతుంది.

మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తి తక్కువ మరియు మీడియం గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను తీసుకోవచ్చునని సూచించబడుతుంది. అయితే వీటిలో కూడా తక్కువ GI ఉండే పండ్లకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాకుండా, నీటి ఆధారిత పండ్లు మధుమేహ రోగగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటాయని నమ్మబడుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలలోని అసమతుల్యతలపరంగా ఆందోళన చెందకుండా, మధుమేహ రోగగ్రస్థులు స్వీకరించదగిన అత్యుత్తమ పండ్ల రకాల గురించిన సమగ్ర వివరణను వ్యాసంలో పొందుపరచడం జరిగింది. మరిన్ని వివరాలకు వ్యాసంలో ముందుకు సాగండి.

మధుమేహరోగగ్రస్తులకు సూచించదగిన ఆరోగ్యకరమైన పండ్లు :

ఒక మోస్తరు మొత్తాలను, మీ వైద్యుల పర్యవేక్షణలో వినియోగిస్తే,క్రింద సూచించిన ఈ పండ్ల రకాలు, మధుమేహం లేదా రక్తంలోని అధిక చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడగలవని చెప్పబడింది.

 1. గ్రేప్ ఫ్రూట్ :

1. గ్రేప్ ఫ్రూట్ :

వాస్తవానికి గ్రేప్ ఫ్రూట్లో దాదాపు 91 శాతం నీరు ఉంటుంది. అదేవిధంగా గ్రేప్ ఫ్రూట్లో విటమిన్ సి నిల్వలు కూడా అధికంగా ఉంటాయి. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా 25 గా ఉంటుంది మరియు దీనిలో డైల్యూటెడ్ ఫైబర్ నిల్వలు అధిక మొత్తాలలో ఉంటాయి. గ్రేప్ ఫ్రూట్లో నారింగెనిన్ అనే పదార్ధం ఉంటుంది, ఇది ఒకరకమైన ఫ్లేవనాయిడ్, ఇది దేహంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంపొందిస్తుంది. కావున మీ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచేందుకు రోజూవారీ క్రమంలో భాగంగా గ్రేప్ ఫ్రూట్ తీసుకోవచ్చునని సూచించబడుతుంది.

 2. స్ట్రాబెర్రీ :

2. స్ట్రాబెర్రీ :

స్ట్రాబెర్రీస్ మీ మధుమేహాన్ని నియంత్రించడానికి సహాయపడే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ తో లోడ్ చేయబడి ఉంటాయి. అంతేకాకుండా, స్ట్రాబెర్రీలకు గ్లైసీమిక్ ఇండెక్స్ 41 గా ఉంటుంది. మరియు కార్బోహైడ్రేట్లు కూడా తక్కువ మొత్తాలలో ఉంటాయి. స్ట్రాబెర్రీస్ మీ పొట్టను నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. మరియు శక్తిస్థాయిలు కోల్పోకుండా సహాయపడుతుంది. మీ రక్తంలోని చక్కర నిల్వలను క్రమబద్దీకరించడానికి సహాయపడుతుంది. రోజూ సుమారు 3/4 కప్పు స్ట్రాబెర్రీలను తీసుకోవడం మూలంగా, మధుమేహ వ్యాధిగ్రస్తులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పబడుతుంది.

 3. నారింజ పండు :

3. నారింజ పండు :

పీచు పదార్థంలో ఎక్కువగా ఉండటం, చక్కెరలలో తక్కువగా ఉండటం, విటమిన్ సి మరియు థయామిన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండటం మూలంగా నారింజ పండ్లను తీసుకోవడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంచడానికి సహాయపడుతాయి. ఇవి 87 శాతం నీటి నిల్వలను కలిగి ఉండి, తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. నారింజ మీ బరువును నియంత్రణలో ఉంచడానికి కూడా సహాయపడుతుంది. మీ మధుమేహాన్ని సమర్ధవంతంగా నిర్వహించేందుకు, రోజూ నారింజను తీసుకోవచ్చునని చెప్పబడుతుంది. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ 44 గా ఉంటుంది.

 4. చెర్రీ :

4. చెర్రీ :

తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ 22 గా ఉన్నచెర్రీలు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్, బీటా కెరోటిన్, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం మరియు ఫైబర్ నిక్షేపాలను అధికంగా కలిగి ఉంటాయి. చెర్రీస్ మధుమేహరోగులకు అత్యంత ప్రయోజనకారిగా ఉంటుంది. అంతేకాకుండా చెర్రీస్ పూర్తిగా ఆంథోసియానిన్స్ ను కలిగి ఉంటుంది. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని 50 శాతం పెంచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను కిందికి తీసుకునివస్తాయని నమ్మబడుతుంది. కావున రోజులో తాజా చెర్రీస్ ఒక కప్ మోతాదులో తీసుకోవచ్చునని సూచించబడుతుంది. రోజులో 1 కప్పు చెర్రీలను సేవించడం ద్వారా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి సహాయకారిగా ఉంటుంది.

 5. ఆపిల్ :

5. ఆపిల్ :

విటమిన్ సి, డైల్యూటెడ్ ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆపిల్స్ అధికంగా తీసుకోవడం మూలంగా, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. ఇవి పెక్టిన్ను కలిగి ఉంటాయి., మరియు ఇవి మీ శరీరం నుండి విషతుల్య రసాయనాలను తొలగించడానికి మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఇన్సులిన్ అవసరాలను దాదాపు 35 శాతం తగ్గించడానికి సహాయపడతాయి. మరియు దీని గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా 38గా ఉంటుంది.

 6. పియర్ :

6. పియర్ :

పియర్ మధుమేహ రోగులకు సూచించదగిన మరో ఉత్తమమైన పండుగా ఉంటుంది. ఇది, ఫైబర్ మరియు విటమిన్లను అధిక మొత్తాలలో కలిగి ఉండడంతోపాటుగా, 84 శాతం నీటి నిల్వలను కలిగి ఉండి, రక్తంలోని చక్కర స్థాయిలను అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది. పియర్స్ మధుమేహానికి అత్యంత ప్రయోజనకరంగా భావించబడుతుంది. ఎందుకంటే ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంపొందించడానికి తోడ్పడడంతో పాటుగా, గ్లైసీమిక్ లెవల్ 38 గా తక్కువగా ఉంటుంది. క్రమంగా రోజులో ఒకటి తీసుకోవచ్చునని సూచించబడుతుంది.

 7. ప్లమ్ :

7. ప్లమ్ :

క్యాలరీలలో తక్కువగా ఉండటమే కాకుండా, ప్లమ్స్ గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా తక్కువగానే ఉంటుంది. ప్లమ్స్ అనేది ఫైబర్ నిక్షేపాలకు గొప్ప వనరుగా ఉంటుంది. ఇది మధుమేహం మరియు హృద్రోగులకు సూచించదగిన, ఆదర్శవంతమైన పండుగా ఉంటుంది. అనేక మంది మధుమేహరోగులు, మలబద్దకంతో బాధపడడం మనం గమనిస్తూనే ఉంటాం. ఆ క్రమంలో భాగంగా, ఈ ప్లమ్స్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో, మరియు మలబద్దకాన్ని నివారించడంలో ఉత్తమంగా సహాయపడుతుంది. ఇది 24 కన్నా తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ కలిగి ఉంది.

 8. అవకాడో :

8. అవకాడో :

అవొకాడోలో ఉండే ఆరోగ్యకరకొవ్వులు మరియు పొటాషియం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా అవొకడో శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ మరియు చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడానికి సహాయపడుతుంది. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ అత్యంత తక్కువగా 15 ఉంటుంది.

 9. నెక్టారిన్ :

9. నెక్టారిన్ :

ఇది మధుమేహ రోగులకు సూచించదగిన మరొక ఉత్తమ సిట్రస్ జాతి పండు. నెక్టారిన్లో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, ఇది టైప్-2 డయాబెటిస్ అవకాశాలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ 30గా ఉంటుంది.

10. పీచ్ :

10. పీచ్ :

ఈ పండులో తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న కారణంగా, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అలాగే పీచ్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ కూడా మధుమేహ రోగులకు నిజంగా మేలు చేకూరుస్తాయని చెప్పబడుతుంది. ఇది గ్లైసీమిక్ ఇండెక్స్ లో 28 గా ఉంటుంది.

11. బ్లాక్ జామూన్ :

11. బ్లాక్ జామూన్ :

సాంప్రదాయకంగా, ఈ పండును సాధారణంగా గ్రామ ప్రాంతాలలో నివసించే ప్రజలే ఎక్కువగా ఉపయోగిస్తారు. నేడు పట్టణ ప్రాంతాలలో కూడా ఈ బ్లాక్ జామూన్లు కనిపిస్తున్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు సూచించదగిన పండ్లలో ఇది చోటు సంపాదించుకుంది కూడా. బ్లాక్ జామూన్ రక్తంలోని చక్కర నిల్వలను మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. విత్తనాలను పొడి చేసినట్లయితే, విత్తనాలను కూడా వినియోగించవచ్చునని చెప్పబడుతుంది. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ 28 గా ఉంటుంది.

12. పైనాపిల్ :

12. పైనాపిల్ :

యాంటీ వైరల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండే పైనాపిల్స్ మధుమేహంతో బాధపడే వ్యక్తులు తీసుకోడానికి అనువుగా ఉంటుందని చెప్పబడుతుంది. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ 56 గా ఉంటుంది, మరియు ఇది మద్యస్థ గ్లైసెమిక్ రకానికి చెందినదిగా ఉన్న కారణాన, దీనిని తీసుకోవడం సురక్షితంగా చెప్పబడుతుంది.

 13. దానిమ్మ :

13. దానిమ్మ :

ఈ పండును సేవించడం మధుమేహ రోగులకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఇది శరీరంలో రక్తంలోని చక్కర నిల్వలను మెరుగుపరచడంలో అత్యుత్తమంగా సహాయపడుతుంది. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ 18 గా ఉంటుంది.

 14. ఉసిరి :

14. ఉసిరి :

ఈ ఉసిరి పండులో, విటమిన్ సి మరియు ఫైబర్ నిక్షేపాలు ఎక్కువగా ఉన్న కారణాన మధుమేహ రోగులకు మంచిదిగా సూచించబడుతుంది. పసుపుపచ్చగా ఉండే ఉసిరి పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్థులు రోజువారీ ఆహార ప్రణాళికలో భాగంగా తీసుకోవచ్చునని చెప్పబడుతుంది. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ 40గా ఉంటుంది.

15. బొప్పాయి :

15. బొప్పాయి :

ప్లెతోరా న్యూట్రియంట్స్లో అధికంగా ఉండే బొప్పాయి మధుమేహాన్ని నివారించడంలో, సహాయపడే గుణాలను అత్యుత్తమంగా కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే మధుమేహ ఆధారిత గుండె ప్రమాదాలను నివారిస్తుంది. ఇవి హానికరమైన ఫ్రీరాడికల్స్ నుండి మధుమేహ రోగులను రక్షించే ఎంజైములను కలిగి ఉంటాయి. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ 60గా ఉంటుంది. ఈ పండ్లను మధుమేహ రోగుల ఆహారంలో పొందుపరచడం, అత్యంత ఉత్తమంగా ఉంటుందని వైద్యులు సలహా ఇస్తున్నారు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

మధుమేహ రోగులు తీసుకోదగిన 15 ఉత్తమమైన పండ్ల రకాలు

Fruits with low glycemic index and water-based fruits are useful in controlling diabetes. Many types are fruits are loaded with vitamins, minerals & fibre, which can help regulate blood sugar as well as decrease your risk of developing type 2 diabetes. Apart from this, the fibre can promote the feeling of fullness, curb unhealthy cravings and avoid overeating.
Desktop Bottom Promotion