For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ ఉల్లిపాయ రసం తాగితే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటుంది

మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ ఉల్లిపాయ రసం తాగితే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటుంది

|

డయాబెటిస్ అనేది అసాధారణ రక్తంలో చక్కర స్థాయిలు ద్వారా వర్గీకరించబడిన రుగ్మతల సమూహం. శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు , రక్తంలో గ్లూకోజ్ ని తీసుకునే హార్మోన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయినప్పుడు ఇది సంభవిస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ ను నిర్వహించడం చాలా ముఖ్యం.

Benefits of onion juice for diabetes in telugu

డయాబెటిస్ నిర్వహణలో మీ ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహం ఉన్న వారు రోజూ తినే ఆహారం, బరువు, మరియు జీవనశైలిపై శ్రద్ద వహించాలి. పోషకాలు, ప్రోటీన్లు, తక్కువ కొవ్వు మరియు కేలరీలున్న ఆహారం మధుమేహుల్లో ఆరోగ్య సమస్యలను నివారిస్తుందని ఆరోగ్యనిపుణులు భావిస్తున్నారు. మనం రోజూ తినే అనేక ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో ఉల్లిపాయను చేర్చుకుని ఉల్లి రసం తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

మధుమేహ నియంత్రణకు ఉల్లిపాయ ఎలా సహాయపడుతుంది?

మధుమేహ నియంత్రణకు ఉల్లిపాయ ఎలా సహాయపడుతుంది?

ఉల్లిపాయ ప్రతి ఇంట్లో రోజువారి వంటలలో క్రమం తప్పకుండా ఉపయోగించే ఒక కూరగాయ. ఉల్లిలో క్యాలరీలు తక్కువ. కానీ విటమిన్లు, మినిరల్స్ మరియ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దాంతో వివిధ ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే రెండు ముఖ్యమైన రసాయనాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

క్వెర్సెటిన్

క్వెర్సెటిన్

ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్ క్వెర్సెటిన్ ఉల్లిపాయలలో అధిక మొత్తంలో ఉంటుంది. మరియు ఆర్గానిక్ సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి .ఇది మధుమేహం లక్షణాలను తగ్గిస్తుందని కనుగొనబడింది. ఇది చిన్న ప్రేగు, ప్యాంక్రియాస్, అస్థిపంజర కండరం, కొవ్వు కణజాలం మరియు కాలేయంతో సహా శరీరం అంతటా రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఉల్లిపాయలు కూడా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అంటే, ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది, రక్తప్రవాహంలోకి చక్కెర నెమ్మదిగా విడుదల అవుతుంది.

మధుమేహం కోసం ఉల్లిపాయ యొక్క ప్రయోజనాలు

మధుమేహం కోసం ఉల్లిపాయ యొక్క ప్రయోజనాలు

  • ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ మరియు ఆర్గానిక్ సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది.
  • ఎముకలకు మంచిది
  • గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
  • క్యాన్సర్‌తో పోరాడే సమ్మేళనాలను కలిగి ఉంటుంది
  • జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
  • ఉల్లిపాయ రసం -1

    ఉల్లిపాయ రసం -1

    పొట్టు తీసిన ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి కొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత రసాన్ని వడకట్టి, దానికి 1 నుంచి 2 చెంచాల తేనె వేసి బాగా మిక్స్ చేసి తాగాలి.

    ఉల్లిపాయ రసం -2

    ఉల్లిపాయ రసం -2

    ఉల్లిపాయ రసం తయారుచేయడానికి, మీకు 2 తరిగిన ఉల్లిపాయలు, 1 కప్పు నీరు, 1 టీస్పూన్ నిమ్మరసం మరియు 1 చిటికెడు నల్ల ఉప్పు అవసరం. ఇప్పుడు ఈ వస్తువులన్నింటినీ బ్లెండర్‌లో వేసి బాగా గ్రైండ్ చేయండి. తర్వాత దీన్ని వడకట్టకుండా తాగండి. ఎందుకంటే దీనితో రసంతో పాటు పీచు కూడా అందుతుంది. మధుమేహాన్ని నియంత్రించడమే కాకుండా, మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో మరియు చర్మంపై కాంతిని తీసుకురావడంలో ఉల్లిపాయ రసం కూడా ఉపయోగపడుతుంది.

     దోసకాయ మరియు ఉల్లిపాయ సలాడ్

    దోసకాయ మరియు ఉల్లిపాయ సలాడ్

    సగం ఉల్లిపాయ మరియు సగం దోసకాయలను తరిగి, వాటిని ఒక గిన్నెలో సరిగ్గా కలపండి. నిమ్మరసం, ఉప్పు మరియు మిరియాల పొడితో మీ అభిరుచికి అనుగుణంగా తయారు చేసి తినండి.

    అధిక మోతాదులో ప్రమాదాలు

    అధిక మోతాదులో ప్రమాదాలు

    ఉల్లిపాయలో ఉండే కార్బోహైడ్రేట్లు గ్యాస్ మరియు ఉబ్బరానికి కారణమవుతాయి. డయల్ డైసల్ఫైడ్ మరియు లిపిడ్ ట్రాన్స్‌ఫర్ ప్రొటీన్ ఉల్లిపాయలలో ఉండే కొన్ని సమ్మేళనాలు.

    ఉల్లిపాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల ముక్కు కారటం, ఉబ్బసం, కళ్ళు ఎర్రబడటం, దురద దద్దుర్లు మరియు కాంటాక్ట్ డెర్మటైటిస్ వంటి అలర్జీ లక్షణాలు వస్తాయి.

    ఉల్లిపాయ యొక్క ఇతర ఆరోగ్య ప్రయోజనాలు

    ఉల్లిపాయ యొక్క ఇతర ఆరోగ్య ప్రయోజనాలు

    • ఉల్లిపాయల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి కానీ విటమిన్లు మరియు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.
    • అవి యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
    • ఉల్లిపాయ ఔషధ వినియోగం యొక్క సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. ఉల్లిపాయలో ఫైబర్, ఐరన్, విటమిన్ సి మరియు ఇతర సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఆకులు అనేక విధాలుగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
    • కొన్ని వారాల పాటు రోజూ 100 మి.లీ ఉల్లిపాయ రసాన్ని తీసుకోవడం వల్ల ఎముక ఖనిజ సాంద్రత మెరుగుపడుతుంది.
    • ఉల్లిపాయలు ఫైబర్ మరియు ప్రీబయోటిక్స్ యొక్క గొప్ప మూలం, ఇవి గట్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
    • ఉల్లిపాయ ఎంత తినాలి?

      ఉల్లిపాయ ఎంత తినాలి?

      అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ADA) మధుమేహ వ్యాధిగ్రస్తులు పిండి లేని కూరగాయలను తినాలని సిఫార్సు చేస్తోంది. ఎందుకంటే ఇందులో కేలరీలు మరియు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, ఉల్లిపాయలు వంటి పిండిపదార్థాలు లేని కూరగాయలను రోజుకు 1 1/2 కప్పుల ఉడికించిన ఉల్లిపాయలు లేదా 1 కప్పు పచ్చి ఉల్లిపాయలు తినడం ఉత్తమం. కానీ మీరు ఇంతకంటే ఎక్కువ తింటే, మీ కార్బోహైడ్రేట్ తీసుకోవడం పెరిగే అవకాశం ఉంది" అని అచంగమ్ చెప్పారు.

English summary

Benefits of onion juice for diabetes in telugu

A new study that has revealed that onion juice could be a miracle superfood that can lower blood sugar levels by 50 percent.
Story first published:Tuesday, January 24, 2023, 16:48 [IST]
Desktop Bottom Promotion