For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టైప్ 2 డయాబెటిక్ పేషెంట్లు ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే మంచిది?

|

బ్రేక్‌ఫాస్ట్, టిఫిన్, నాష్టా, అల్పాహారం పేరు ఏదైనా సరే ప్రతి మనిషికి ఉదయాన్నే తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైనది. ఒక రోజు ప్రశాంతంగా ప్రారంభమై, సజావుగా సాగాలంటే ఉదయాన్నే తీసుకు బ్రేక్‌ఫాస్ట్ హెల్తీగా, పౌష్టికంగా ఉండాలి.

ప్రత్యేకించి మధుమేహ వ్యాధిగ్రస్తులకు (డయాబెటిస్ పేషెంట్లకు) ఈ అల్పాహారం ఎంతో ముఖ్యమైనది మరియు చాలా అవసరనది కూడా. ఎందుకంటే, ఇది అలాంటి వారు దాదాపు ఎనిమిది తొమ్మిది గంటల విరామం (ఉపవాసం) తర్వాత తినే మొదటి భోజనం కాబట్టి.


ప్రస్తుతం మానవ జీవనశైలిలో టైప్ 2 డయాబెటిస్ అనేది సాధారణమైన విషయంగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఈ సమస్యతో బాధ పడుతున్నారు. వాస్తవానికి టైప్ 2 డయాబెటిస్ సాధారణమైనదే అయినప్పటికీ, అది మానవ శరీరంలో కలిగించే దృష్పభావాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి.

టైప్ 2 డయాబెటిస్ వలన ఊబకాయం, మూత్రపిండాలు మరియు గుండెకు హాని కలిగించే జబ్బులు రావటం వంటివి జరగవచ్చు. ఈ జబ్బుకు సరైన చికిత్స అంటూ ఏదీ లేదు, దీని నివారణ ఒక్కటే మార్గం. ఈ విషయంలో మన ఆహారపు అలవాట్లను మార్చుకుంటే, ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు.

టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయి విషయంలో సరైన శ్రద్ధ తీసుకోకపోయినట్లయితే, రక్తంలో చక్కెర మోతాదు అధికమై, అది శరీరంలో ముఖ్యమైన అవయవాలకు హాని కలిగించే ప్రమాదం ఉంది. అదేసమయంలో, రక్తంలో చక్కెర స్థాయిల మరీ తక్కువగా ఉన్నా అలసటం రావటం, ఆపై అపస్మారక స్థితికి చేరుకునే ప్రమాదం కూడా లేకపోలేదు.

కాబట్టి, మధుమేహ వ్యాధిగ్రస్తులు అల్పాహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడే ఆరోగ్యకరమైన అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. మరి టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలని, ఎలాంటి ఆహారాన్ని తినకూడదనే విషయాన్ని తెలుసుకుందాం రండి.

ఎక్కువ ఫైబర్, తక్కువ షుగర్ ఉండే సిరియల్స్

ఎక్కువ ఫైబర్, తక్కువ షుగర్ ఉండే సిరియల్స్

మార్కెట్లో దొరికే సిరియల్స్ (తృణధాన్యాలు) పిల్లల నుండి పెద్దల వరకూ అందరూ ఇష్టపడే అల్పాహారం. అయితే, డయాబెటిస్ పేషెంట్ల కోసం ప్రత్యేకమైన సిరియల్స్ అందుబాటులో ఉంటాయి. అలాంటి వాటిలో అధిక-ఫైబర్, తక్కువ-షుగర్స్ ఉన్న వాటిని ఎంచుకొని క్రమం తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవాలి.

ఓట్‌మీల్

ఓట్‌మీల్

టైప్ 2 డయాబెటిస్ ఉన్న పేషెంట్లకు ఓట్‌మీల్ దివ్యౌషధం లాంటింది. ఓట్స్‌లో ఫైబర్ అధికంగా లభిస్తుంది. ఓట్స్ తినడం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అంతేకాదు, ఇవి బరువు తగ్గడంలో కూడా సహకరిస్తాయి. కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో ఓట్స్ చక్కగా పనిచేస్తాయి. ఓట్స్‌ని ప్రతిరోజూ ఒకేలా తినడం బోర్ అనిపిస్తే, దానిని వివిధ రకాలుగా వండుకొని కూడా తినొచ్చు.

హోల్‌గ్రెయిన్ బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్

హోల్‌గ్రెయిన్ బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్

టైప్ 2 డయాబెటిస్ పేషెంట్స్‌కి వైట్ బ్రెడ్ లేదా మిల్క్ బ్రెడ్ చాలా ప్రమాదకరమైనది. అయితే, ఇందులో లభించే బ్రౌన్ వీట్ బ్రెడ్ లేదా హోల్ గ్రెయిన్ బ్రెడ్ లేదా ఓట్స్‌తో చేసిన బ్రెడ్స్ చాలా మంచివి. వీటిలో పీచు పదార్థం (ఫైబర్) కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ షుగర్ సమస్య ఉన్నవారికి ఇదొక చక్కటి బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది.

 అవకాడో

అవకాడో

డయాబెటిక్ పేషెంట్లకు అవోకాడో చాలా ఆరోగ్యకరమైన పండు. ఇందులో అనేక ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి. ఈ పండును నేరుగా తినడం ఇష్టం లేనివారు తమ సాలడ్‌లోని కానీ లేదా బ్రెడ్ స్లైస్‌ల మధ్యలో ఉంచుకొని ఎంచక్కా లాగించేయవచ్చు.

మరిన్ని బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్

మరిన్ని బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్

మధుమేహ వ్యాధిగ్రస్తులకు తీసుకోవాల్సిన ఇతర ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్లలో చక్కెర తక్కువగా ఉండే తాజా పండ్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, మంచి పోషకాలతో నిండిన రాగి జావ మొదలైన వాటిని ఎంచుకోవచ్చు.

 మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోకూడని ఆహార పదార్థాలు:

మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోకూడని ఆహార పదార్థాలు:

డయాబెటిక్ పేషెంట్లు తమ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి తీసుకునే అల్పాహారంలో కొన్ని పదార్థాలను ఖచ్చితంగా మానుకోవాల్సి ఉంటుంది. వీటి వలన రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోయి, ప్రాణానికే ప్రమాదం వాటిళ్ల వచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి.

-> టీ, కాఫీలో పంచదార

-> తాజా లేదా ప్యాక్ చేసిన పండ్ల రసాలు

-> పంచదారతో నిండిన స్మూతీలు

-> రీఫైన్డ్ బ్రెడ్ (వైట్ బ్రెడ్ లేదా మిల్క్ బ్రెడ్)

-> పంచదారతో నిండిన సిరియల్స్

-> బ్రెడ్స్‌పై ఉపయోగించే చక్కెరతో కూడిన స్ప్రెడ్స్ లేదా జామ్స్

-> పేస్ట్రీలు మరియు బేకరీ ఆహారాలు

-> ప్యాక్ చేసిన లేదా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు

English summary

Healthy Breakfast Choices For Type 2 Diabetic Patients

Healthy Breakfast Choices For Type 2 Diabetic Patients. Read in Telugu.