For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Drinking coffee or tea good for diabetes: డయాబెటిస్ లేదా షుగర్ ఉన్న వారు టీ, కాఫీలు తాగవచ్చా ?

Drinking coffee or tea good for diabetes: డయాబెటిస్ లేదా షుగర్ ఉన్న వారు టీ, కాఫీలు తాగవచ్చా ?

|

సాధారణంగా చాలా మందికి ఉదయం నిద్రలేవగానే టీ మరియు కాఫీ తాగందే ఆ రోజు ప్రరంభం కాదు. అయితే కెఫిన్ అధికంగా ఉన్న కాఫీ తాగకూడదని, అది ఆరోగ్యానికి హానికరమైనదని చాలా మంది అభిప్రాయపడతారు. అయితే కాఫీ ఆరోగ్యానికి మంచిదేనని మరికొందరు అంటున్నారు.

is drinking coffee or tea good or bad for diabetic patient? know in telugu

కానీ, రెగ్యులర్ గా కాఫీ తాగేవారు కాఫీలో ఉండే కెఫిన్ కంటెంట్ గురించి కొంచెం ఆలోచించాల్సిందే. ఎందుకంటే కెఫిన్ కంటెంట్ శరీరంలోనికి ఎక్కువగా చేరితే అది ఆరోగ్యానికి ఎక్కువ దుష్ఫ్రభావాలను కలిగిస్తుంది . సాధారణ ప్రజలకంటే మధుమేహగ్రస్తుల్లో ఈ సందేహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, డయాబెటిస్ ఉన్న వారు కాఫీ తాగవచ్చా లేదా అనే విషయాన్నిమీరు ఈ కథనంలో తెలుసుకుంటారు.

కెఫిన్ కంటెంట్

కెఫిన్ కంటెంట్

డయాబెటిస్ ఉన్న వారు వారి రెగ్యులర్ డైట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని వైద్యులు చెబుతుంటారు

ముఖ్యంగా ఉదయాన్నే నిద్రలేవగాని పర కడుపుతో అందులో పంచదార కలిపిన టీ, కాఫీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే రెండింటిలోనూ కెఫిన్ అధిక మోతాదులో ఉంటుందని అంటున్నారు.

అధ్యనం ఏం చెబుతుంది

అధ్యనం ఏం చెబుతుంది

అలాగే కొన్ని అధ్యయనాల ప్రకారం డయాబెటిస్ ఉన్న వారు మితంగా కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నాయి.

ఎందుకంటే డయాబెటిస్ ఉన్న వారు రెగ్యులర్ కాఫీ తాగడం వల్ల కాఫీలో కెఫిన్ కంటెంట్ రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరగకుండా నిరోధిస్తుందని మరియు మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందని వారు తమ అధ్యయనంలో వెల్లడించారు.

 పంచదార కలపకుండా రోజుకు ఒకసారి కాఫీ తాగవచ్చు

పంచదార కలపకుండా రోజుకు ఒకసారి కాఫీ తాగవచ్చు

కెఫిన్ కంటెంట్ ఉన్న కాఫీ మరియు టీని పంచదార కలపకుండా రోజుకు ఒక సారి మితంగా తాగితే రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా నిరోధిస్తుందని వెల్లడించారు.

కొన్ని అధ్యయనాల్లో

కొన్ని అధ్యయనాల్లో

అంతే కాకుండా డయాబెటిస్ లేనివారు కూడా రెగ్యులర్ గా కాఫీ తాగితే రానున్న రోజుల్లో ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధి వచ్చే అవకాశం చాలా తక్కువని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కెఫిన్ పానీయాలతో జాగ్రత్త

కెఫిన్ పానీయాలతో జాగ్రత్త

మీరు ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్నట్లయితే. ఇటువంటి కెఫిన్ పానీయాలతో జాగ్రత్తగా ఉండండి.

మరీ ముఖ్యంగా రోజూ తీసుకునే టీ-కాఫీలో చక్కెరను కలపకూడదు. లేకపోతే, రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది మరియు మధుమేహం నియంత్రణలో ఉండదు.

ఆఖరి మాట

ఆఖరి మాట

డయాబెటిస్ ఉన్న వారు ఉదయం టీ, కాఫీలకు బదులుగా , నిద్రలేచిన వెంటనే గోరు వెచ్చని నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే, శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ుంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సక్రమంగా నిర్వహించబడుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

English summary

is drinking coffee or tea good or bad for diabetic patient? know in telugu

Read to know more how is drinking coffee or tea good or bad for diabetic patient? know in telugu.
Story first published:Friday, January 20, 2023, 13:28 [IST]
Desktop Bottom Promotion