For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షుగర్ పేషంట్స్ ఉదయాన్నే ఈ ఆహారాలను తినకూడదు.. తింటే షుగర్ లెవల్స్ పెరిగి, ప్రాణాలకే ప్రమాదం...

షుగర్ పేషంట్స్ ఉదయాన్నే ఈ ఆహారాలను తినకూడదు.. తింటే షుగర్ లెవల్స్ పెరిగి, ప్రాణాలకే ప్రమాదం...

|

ప్రస్తుత ఆరోగ్య రిత్యా తీసుకుంటే ప్రపంచంలో డయాబెటిస్ తో బాధపడే వారికి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. డయాబెటిస్ నియంత్రణలో అత్యంత ముఖ్యమైనది జీవనశైలి ఆహారపు అలవాట్లు. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఒక్క సారి డయాబెటిస్ వచ్చిందంటే దాన్ని పూర్తిగా తగ్గించలేము కానీ, సరైన జాగ్రత్తలు తీసుకుంటే నియంత్రించవచ్చు. డయాబెటిస్ అని తెలిసిన తర్వాత ఒకటి మీకు ఇష్టమైన ఆహారం తినడానికి కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నందున, తప్పుడు ఆహారాన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి మరియు గుండె జబ్బులు, కంటి సమస్యలు, మూత్రపిండాల వ్యాధి మరియు ప్రాణాంతకమైన అనేక ఇతర తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

The Worst Breakfast Foods to Avoid for Diabetes Patients

ఇక మనం ప్రతి రోజూ తీసుకునే ఆహారాల్లో అల్పాహారం చాలా అవసరం. అలాగే ఉదయం పూట మీరు తినే ఆహారం మీ రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ వారు ఉదయం పూట తినే ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఈ రోజుల్లో బ్రేక్ ఫాస్ట్ కోసం అనేక ఆహారాలు ప్రజలలో ప్రాచుర్యం పొందాయి. కానీ డయాబెటిస్ వారు తమ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలనుకుంటే, అల్పాహారం కోసం క్రింది లిస్ట్ లో ఉన్నఈ 5 ఆహారాలకు దూరంగా ఉండాలి. అవి ఏమిటో చూద్దాం.

చక్కెరతో నిండిన క్యాండీస్

చక్కెరతో నిండిన క్యాండీస్

క్యాండీస్ డయాబెటిస్ వారు దీన్ని ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ గా భావిస్తే అది తప్పు. ఎందుకంటే క్యాండీస్ లో చెక్కర శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది డయాబెటిస్ వారికి చాలా చెడ్డది. మరియు అల్పాహారంలో తీసుకునే క్యాండీస్ లో ప్రోటీన్లో తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రకమైన క్యాండీస్ కు దూరంగా ఉండటం ఉత్తమం. కావాలనుకుంటే, ఓట్స్‌ను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం నట్స్, డ్రై ప్రూట్స్ మరియు కొన్ని పండ్లతో కలిపి తినవచ్చు.

ఫ్రూట్ జ్యూస్ లు

ఫ్రూట్ జ్యూస్ లు

ఉదయం అల్పాహారానికి పండ్ల రసాలు ఆరోగ్యకరమైనవని చాలా మంది భావిస్తారు. కానీ ఫ్రూట్ జ్యూస్ లు కూడా డయాబెటిస్ వారికి ఖచ్చితంగా చెడ్డ పానీయం. ఎందుకంటే పండ్ల రసాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతాయి. ఎందుకంటే పండ్లలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి పండ్ల రసాలు తాగే బదులు పూర్తిగా పండ్లు తినడం మంచిది.

రుచిగల పెరుగు

రుచిగల పెరుగు

ఎక్కువ ప్రోబయోటిక్స్ ఉన్న పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కానీ క్యాన్డ్ యోగర్ట్‌లు రుచికరమైనవి. కానీ వాటిలో చక్కెర మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కాబట్టి డయాబిస్ ఉన్న వారు పెరుగు తినాలనుకుంటే, సాధారణ పెరుగులో మీకు నచ్చిన కొన్ని పండ్లను జోడించండి.

పాన్ కేక్

పాన్ కేక్

పాన్‌కేక్‌లు మీ నాలుకను రుచిగా అనిపించవచ్చు. కానీ డయాబెటిస్ ఉన్నవారు మాత్రం వీటిని బ్రేక్ ఫాస్ట్ గా తినకూడదు. ఎందుకంటే వీటిలోని మైదా, అరచెంచా, వెన్న మొదలైనవి ప్రస్తుతానికి మన నాలుకపై రుచి మొగ్గలను సంతృప్తిపరుస్తాయి. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా చెడ్డ మరియు ప్రమాదకరమైన ఆహార పదార్థం. ఎందుకంటే అవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచే చక్కెర మరియు కార్బోహైడ్రేట్‌లను కలిగి ఉంటాయి. వీటిలో ఫైబర్ లేదా ప్రోటీన్ ఉండదు. కాబట్టి డయాబెటిస్ వాళ్ళు ఈ ఆహారానికి దూరంగా ఉండాలి.

స్మూతీ

స్మూతీ

డయాబెటిస్ వారు అల్పాహారంగా తినకూడని మరో ఆహార పదార్థం స్మూతీస్. ఈ స్మూతీస్ మన కడుపు నింపగలవు. కానీ ఈ స్మూతీలు రుచిగల పెరుగు, వివిద రకాల పండ్లు మరియు చక్కెరతో లోడ్ చేయబడి ఉన్నందున, అవి త్వరగా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. మరియు స్మూతీస్‌లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి మరియు ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి స్మూతీ తాగే బదులు, అవకాడో, యాపిల్, బచ్చలికూర మొదలైన వాటితో గ్రీన్ జ్యూస్ తయారు చేసి మీ రోజును ప్రారంభించండి.

English summary

The Worst Breakfast Foods to Avoid for Diabetes Patients

Eating the wrong breakfast foods can have a major impact on your blood sugar levels. Learn which foods to avoid if you have diabetes to keep your blood sugar levels in check.
Story first published:Wednesday, February 1, 2023, 13:08 [IST]
Desktop Bottom Promotion