For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిస్ పై నియంత్రణ లేకపోతే అనర్థాలు తప్పవంటున్న వైద్యులు..

|

డయాబెటిస్ తీయ్యని శత్రువు వంటిది. ఒకరకంగా చెప్పాలంటే ఇది సైలెంట్ కిల్లర్. చాపక్రింద నీరులా శరీరంలోని ప్రతి కణాన్నీ అవయవాన్నీ దెబ్బతీస్తుంది. కానీ కొందరు సాధారణ జబ్బుగా కొట్టిపారేస్తున్నారు. సరైన వైద్యం తీసుకోవడం లేదు, చికిత్సలకు దూరంగా ఉంటున్నారు. అంతే కాదు, తినే ఆహారాల్లో పంచదార తీసుకోకుంటే సరిపోతుందని, షుగర్ కు దూరంగా ఉంటూ చిన్ని చిన్న చిట్కాలు పాటిస్తూ వ్యాధి తగ్గుతుందని భావిస్తున్నారు.

ఒకసారి డయాబెటిస్ భారీన పడితే

ఒకసారి డయాబెటిస్ భారీన పడితే

కానీ ఒకసారి డయాబెటిస్ భారీన పడితే దాన్ని నియంత్రణలో ఉంచుకోవడం తప్ప..నయం అవ్వటం అనేది ఉండదు. తీవ్రత పెరిగే వరకూ వ్యాధిగ్రస్థులు సరైన శ్రద్ద తీసుకోకపోవడంతో శస్త్రచికిత్స దాకా వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ మధ్య కాలంలో డయాబెటిస్ ఉన్న వారు సరైన శ్రద్ధ తీసుకోకపోవడంతో శస్త్ర చికిత్స వరకు వెళ్ళే పరిస్థితి వస్తోంది. డయాబెటిస్ ఉన్న వారిలో శస్త్రచికిత్సల భారీన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకోకపోతే..

డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకోకపోతే..

డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకోకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుండటం, పుండ్లు త్వరగా మానకపోవటం జరుగుతోంది. కిడ్నీ, గుండె జబ్బులను తగ్గించేదుందకు శస్త్రచికిత్సలు తప్పనిసరి అవుతున్నాయని వైద్యులు సూచిస్తున్నారు.

వ్యాధిని నియంత్రణలో ఉంచుకోకుండా

వ్యాధిని నియంత్రణలో ఉంచుకోకుండా

వ్యాధిని నియంత్రణలో ఉంచుకోకుండా అత్యవసరంగా శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చినప్పుడు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే..మధుమేహులలకు చేసే శస్త్రచికిత్సల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. 24 గంటల్లో నొప్పి, పాదాలకు పుండ్లు వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ సోకకుండా వెంటనే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది.

కానీ మధుమేహం అదుపులో లేకుంటే శస్త్రచికిత్సల అనంతరం

కానీ మధుమేహం అదుపులో లేకుంటే శస్త్రచికిత్సల అనంతరం

కానీ మధుమేహం అదుపులో లేకుంటే శస్త్రచికిత్సల అనంతరం రోగులు సాధారణ స్థితికి వచ్చేందుకు ఎక్కువ సమయం పడుతుంది. తరచుగా ఇన్ఫెక్షన్ల బారినపడుతుండటం, జబ్బులు, పుండ్లు త్వరగా మానకపోవటం, కిడ్నీ, గుండె జబ్బులు రావడం, కంటిచూపు తగ్గటం వంటివి వేధిస్తాయి.

డయాబెటిస్ బారిన పడ్డవారు కొన్నాళ్ళు మందులు

డయాబెటిస్ బారిన పడ్డవారు కొన్నాళ్ళు మందులు

డయాబెటిస్ బారిన పడ్డవారు కొన్నాళ్ళు మందులు బాగానే వేసుకుంటారు. మధ్యలో వైద్యపరీక్షలు చేయించుకునే గ్లూకోజ్ అదుపులో ఉందని తేలగానే స్వయంగా నిర్ణయం తీసుకుని మాత్రలు తగ్గింస్తున్నారు. అయితే ఆహార నియమాలను గాలికి వదిలేస్తున్నారని వైద్యులు తెలుపుతున్నారు.

శస్త్రచికిత్సలకు కారణం

శస్త్రచికిత్సలకు కారణం

డయాబెటిస్ ఉన్నవారు హాస్పిటల్ కు వెళ్లేవారిలో గ్లూకోజ్ మోతాదు పెరిగి ఉంటుంది. అదే సమయంలో డాక్టర్లు మందులు సరిగా వాడుతున్నారా అని అడిగినప్పుడు కొంత మంది మాత్రలతో నీరసం వచ్చింది. షుగర్ తగ్గినందున మానివేసినట్లు చెబుతున్నారు. ఇలా చెయ్యటం వల్ల శస్త్రచికిత్సలకు దారితీస్తోందని డాక్టర్లు పేర్కొంటున్నారు.

జబ్బు తీవ్రరూపం

జబ్బు తీవ్రరూపం

ఇలాంటి వారు మందులు సక్రమంగా వాడితేనే చాలా వరకు అనారోగ్య సమస్యలను కొంతకాలం వాయిదా వేయడానికి మాత్రమే ఉపకరిస్తాయని తెలిపారు. పేదలు, మధ్యతరగతి వారు దెబ్బలు తగిలినప్పుడు చిన్న విషయంగా భావించి నొప్పి నివారణ మందులు వాడి మిన్నకుండిపోతున్నారు. దీని వల్ల జబ్బు తీవ్రరూపం దాలుస్తోందని సర్జన్లు పేర్కొంటున్నారు.

డయాబెటిస్ ను గుర్తించడం ఎలా?

డయాబెటిస్ ను గుర్తించడం ఎలా?

  • రక్తంలో గ్లూకోజ్ స్థాయిల బట్టి డయాబెటిస్ ఉందాల లేదా అన్న విషయాన్ని నిర్థారిస్తారు.
  • రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఆహారాన్ని తీసుకోకముందు 110mg ఉంటే అనుమానించాలి.
  • ఆహారం తీసుకున్న తర్వాత 140mg లోపే ఉండాలి.
  • 200mg లు దాటితే మధుమేహం ఉందనే అర్థం.
  • రోజులో ఎప్పుడైనా చేసే పరీక్షలో 200mg దాటితే మధుమేహం ఉన్నట్లే.
  • 160, 170mg ఉంటే మరిన్ని పరీక్షలు చేయాలి.
  • ర్తపోటు విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలి.

English summary

What you Need to Know about Surgery and Diabetes

Surgery is sometimes unavoidable, and if you're one of the nearly 30 million Americans suffering from diabetes, getting your body ready for surgery is critical to ensuring a healthy recovery. Taking care of your body in the weeks and months leading up to your surgery can have a huge impact on how well your body is able to recover.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more