Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
ఎన్ని వర్కవుట్లు చేసినా...బరువు తగ్గటం లేదా? శోధించండి....!

బరువు తగ్గకపోవటానికి 5 ప్రధాన కారణాలను పరిశీలిద్దాం!
1. సరిగాలేని ఆహార ప్రణాళిక - మీ శరీర అవసరాలను బట్టి మీ ఆహారం నిర్ణయించాలి. అంతే కాని వెయిట్ మాస్ ఇండెక్స్ ను బట్టి నిర్ణయించవద్దు. మీరు చేసే పనిని బట్టి మీ ఆహారం వుండాలి. రోజులో ఒక్క గంట జిమ్ వర్కవుట్లు చేసి మిగిలిన రోజంతా నిద్రపోతే మీ ఆహారం సాధారణమైన దానికంటే కూడా తక్కువే వుండాలి. అవసరమనుకుంటే పోషకాహార నిపుణుడిని సంప్రదించండి.
2. అసలు బరువు ఎపుడు తగ్గుతుంది? వ్యాయామాలు మొదలు పెట్టగానే బరువు తగ్గరు. మొదట మీ శరీరంలోని నీరు ఖర్చవుతుంది, తర్వాత కొంత ఎనర్జీ, దాని తర్వాత అధికమైన కొవ్వు కరగటం మొదలవుతుంది. శరీరం ఫలితం చూపే వరకు వర్కవుట్లు, దానికి తగిన ఆహారం కొనసాగించాలి. ఎంత సమయంలో ఎంత బరువు తగ్గామనేది ప్రతి మనిషికి వివిధ రకాలుగా వుంటుంది.
3. ఎప్పుడూ ఒకేరకమైన వ్యాయామం చేస్తున్నారా? మార్చండి. కనీసం 15 రోజులకొకసారి లేదా నెలకొకసారి మీ వ్యాయామ ప్రణాళిక మార్చండి. అందుకుగాను మీ శిక్షకుడిని సంప్రదించండి. వ్యాయామం మార్చితే ఫలితాలు బాగా వుంటాయి కూడాను.
4. వ్యాయామం గుండె సంబంధిత ట్రెడ్ మిల్, వాకర్, మెట్లెక్కడం, సైకిలింగ్, స్పాట్ జోగింగ్ గాను మరియు కండలను నిర్మించే వెయట్ లిఫ్టింగ్ గాను సమపాళ్ళలో వుండటం మంచిది. అవసరాన్నిబట్టి ఏది ఎక్కువ, ఏది తక్కువ అనేది నిర్ణయించుకోండి.
5. హార్మోన్ల సమతుల్యత - పై చిట్కాలు ఆచరించినప్పటికి బరువు తగ్గటం లేదా? అయితే, ఇక శరీరంలోని హార్మోన్ల సమతుల్యతపై చెక్ చేయండి. ధైరాయిడ్ గ్రంధి మొదలైనవి చెక్ చేయించండి. హార్మోన్లు సమతుల్యతకు వస్తే, ఇక మీరు ఎంతో సహజంగా బరువు తగ్గటం తధ్యం.
సమస్య ఎక్కడుందో ఒక సారి విశ్లేషిస్తే, బరువు తగ్గే సమస్యలకు పరిష్కారం కనుగొన్నట్లే!
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
