Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
ఆరోగ్యానికి నడక మంచిదా? పరుగు మంచిదా?

ఈ రెండు వ్యాయామాలలోను వున్న మంచి ప్రయోజనాలను పరిశీలిద్దాం......
ఈ రెండు వ్యాయామాల మధ్య ప్రధానంగా వున్న తేడా తీవ్రత. పరుగు లేదా జోగింగ్ నడకకంటే శ్రమ కలిగించేది. కనుక బరువు తగ్గటం అనేది జోగింగ్ లో నడక కంటే కూడా మెరుగైనదే. అలాగని నడక ఏదో విశ్రాంతిగా చేసేది కాదు. పార్కులో స్నేహితులతో కలసి షికారు గా చేసేది కాదు. నడక అనేది వ్యాయామంగా చేస్తేనే నడక అవుతుంది. లేదంటే నడకకుగల ప్రయోజనాలు మీకు రావు. నడక అనేది ఒంటరిగానే చేయాలి. ఎవరితోనైనా కలిస్తే, వారి వేగానికి ఎక్కువైనా, తక్కువైనా సరే మీరు రాజీ పడాలి. వేగం తగ్గితే మీ సామర్ధ్యం తగ్గుతుంది. వేగమెక్కువైతే ముందుగానే మీరు అలసిపోతారు. కనుక నడక ప్రయోజనాలు మీకు రావాలంటే, ఒంటరిగానే నడవండి.
జోగింగ్ ప్రయోజనాలు చూస్తే, అధికబరువుకై జోగింగ్ సత్వర ఫలితమిస్తుంది. గుండెకు చాలా మంచి వ్యాయామం. గుండె నుండి అధిక రక్తం సరఫరా అవుతూంటుంది. ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయి. చిన్నవయసులో ఇది ఎంతో ప్రయోజనకరం. నడక మంచిదా లేక జోగింగ్ మంచిదా అనేది మీకు కావలసిన ఫలితాన్ని బట్టి చేయాలి. బరువు సమస్యలేదు...ఫిట్ గా వుండాలి. అపుడు మీకు వాకింగ్ మంచిది. బరువు అధికం...వేగంగా తగ్గించాలి. జోగింగ్ చేయండి. వాకింగ్ లో ఫలితాలు సత్వరమే రావు. మరో విషయంగా మీరు ఏ వయసులో వున్నారనేది కూడా ఆలోచించాలి. యువతకు జోగింగ్ మంచిది. వీరు నడిస్తే కండరాలు సడలుతాయి. బిగువు కొరకు వీరు పరుగెత్తాల్సిందే. వయసు 50 సంవత్సరాలు పైబడితే వేగవంతమైన నడక మంచిది. గుండెపై ఒత్తిడి ఈ వయసులో మంచిది కాదు.
కనుక చర్చ కొనసాగుతున్నప్పటికి, పై అంశాల పరిశీలనతో మీకు కొంత అవగాహన ఏర్పడే వుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
