Latest Updates
-
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.!
ఉదయం అల్పాహారంగా నాలుగు ఆహారాలు!

గోధుమలు - గోధుమలలో విటమిన్ ఇ మరియు పీచు అధికంగా వుంటాయి. గోధుమ ఆహారం రోజంతా శక్తినిచ్చి మిమ్మల్ని ఉత్సామంగా వుంచుతుంది. వేరే గింజ ఆహారాలతో పోలిస్తే గోధుమలలో కొవ్వు, చెడు కొలెస్టరాల్ తక్కువ, తేలికగా జీర్ణం అవుతాయి. గోధుమ అన్నం వంటివి మీ ఆకలిని చాలాసేపు నియంత్రిస్తాయి. కనుక మీరు డైటింగ్ చేసేవారైతే, గోధుమ ఆహారం బరువుతగ్గేందుకు కూడా తోడ్పడుతుంది. శరీరంనుండి మలినాలను విసర్జిస్తుంది.
ఓట్ గింజలు - తీపిపై మక్కువ కలవారికి ఓట్లు ఆహారంగా బాగుంటాయి. ఆరోగ్యం దానితో పాటు చక్కని తీపికల ఈ బ్రేక్ ఫాస్ట్ తినేందుకు ఆనందం కలిగిస్తుంది. ఓట్లు కనుక తీపివి దొరకకపోతే ఓట్ మీల్ లో కొద్దిగా తేనె కలిపితే మరింత రుచిగా వుంటుంది. ఓట్ ఆహారంలో తాజా పండ్లు కూడాచేర్చి తినవచ్చు. ఓట్ ఆహారంలో అనేక విటమిన్లు, ఫోలిక్ యాసిడ్ వుంటాయి.
బార్లీ గింజలు - మీరు డయాబెటిక్ రోగి అయినట్లయితే, బార్లీ గింజల ఆహారం ఎంతో మేలు చేస్తుంది. ఈజింజలు మీ బ్లడ్ షుగర్ స్ధాయిలను చక్కగా నియంత్రిస్తాయి. వీటిలో ఫైబర్, ఎమినో యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, జింక్ అధికంగా వుంటాయి. ఆరోగ్యమే కాదు కడుపు కూడా ఈ ఆహారం నింపుతుంది.
గ్రేప్ నట్ సిరియల్ - గోధుమ , బార్లీ గింజలు రెండూ చేర్చి కూడా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమానికి ద్రాక్ష పండు కలిపితే, మంచి రుచి వస్తుంది. ఒకమారు తినే ఈ ఆహారంలో షుమారుగా 7 గ్రాముల పీచు, 6 గ్రాములు ప్రొటీన్, మరియు 4 గ్రాముల షుగర్ వుంటుంది. కనుక విటమిన్ ఢి, ఫోలిక్ యాసిడ్, పీచు కల ఈ ఆహారం మిమ్మలని రోజంతా చురుకుగాను, ఆరోగ్యంగాను వుంచుతుంది.
ఈగింజధాన్యాల ఆహారం మీకు ఆరోరగ్యం కలిగించటమే కాదు, మంచి రుచిని కూడా కల్గించి మీ ఉదయంవేళ బ్రేక్ ఫాస్ట్ గా ఏ ఆహారం తీసుకోవాలనే సమస్యను నివారిస్తాయి. వీటికిమరింతరుచి కలిగించేందుకు మీ కిష్టమైన స్ట్రాబెర్రీలు, ఆపిల్స్, అరటిపండు, కివి, ద్రాక్ష వంటి పండ్లు కూడా చేర్చవచ్చు. ఈ వంటకాలలో షుగర్ కు బదులుగా తేనె లేదా పండు ఖర్జూరం కలిపితే, సహజ తీపి వస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
