Latest Updates
-
జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా.. -
Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు -
ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం -
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం! -
ముంబై ఫేమస్ బాంబే ఐస్ హల్వా.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి -
జామ ఆకుల టీని రోజుకు ఒక్క కప్పు తాగితే చాలు.. ఈ 4 భయంకరమైన ఆరోగ్య సమస్యలు మాయం! -
అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్.. సొరకాయ కోఫ్తా కర్రీ ఇలా చేశారంటే కేక టేస్ట్! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి జామ్..మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా.. -
హెల్తీగా ఉంటాం, బరువు తగ్గొచ్చని ఓట్స్ తింటున్నారా? ఈ విషయం తెలియకుంటే డేంజర్ లో పడతారు! -
ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్
బరువు తగ్గించే 5 సుంగంధ ద్రవ్యాలు
భారతీయ వంటల్లో సుగంధ ద్రవ్యాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. ఇతర దే శాలతో పోలిస్తే మనదగ్గర స్థూలకాయం సమస్య చాలా తక్కువ. అందుకు ఈ సుగంధ ద్రవ్యాలే కారణమని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. స్థూలకాయంతో బాధపడేవారు ఆహారంలో వీటిని కూడా చేర్చుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు.

అల్లం
అల్లానికి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యం ఉంది. మూత్రవిసర్జన సాఫీగా జరిగేందుకు ఇది ఎంతగానో సహకరిస్తుంది. జీవక్రియలు సాఫీగా సాగేందుకు సైతం ఇది తోడ్పడుతుంది. ఉపయోగాలు: తీసుకున్న ఆహారంలో చెడును వెంటనే బయటకు నెట్టేస్తుంది. దాంతో బరువు పెరగకుండా ఉండడం సాధ్యమవుతుంది. వొవేరియన్ క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేసే అల్లానికి ఉందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. జలుబు, మైగ్రేన్, ఉదయం పూట మగతగా ఉండే ఇబ్బందులను సైతం ఇది తొలగిస్తుంది. ఈ సుగంధ ద్రవ్యాల వల్ల బరువు తగ్గించడంతో పాటు అనేక రకాల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకే మన రోజు వారీ ఆహారంలో వీటిని ఉపయోగించడం ఎంతో అవసరం.

మిరపకాయ
ఎర్రటి పొడవైన మిరపకాయల్లో క్యాప్సాసిన్ అనే రసాయనం ఉంటుంది. దీనికున్న గుణమేంటంటే కేంద్రనాడీ వ్యవస్థను ఉత్తేజపరచి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఉపయోగాలు: ఆ వేడికి శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుందని పరిశోధనల్లో స్పష్టమైంది. ఆకలి పుట్టించే గుణం కూడా దీనికుంది. ఈ రసాయనం శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకోకుండా చూడడంలో అద్భుతంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.

దాల్చినచెక్క
రోజులో ఒక్క చెంచాడు దాల్చినచెక్క పొడిని తీసుకున్నారంటే మీ అధిక బరువు క్రమంగా తగ్గిపోతుంది. ఆరోగ్యం, అందం కూడా మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు జరిపిన పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఉపయోగాలు: దీనికి రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించే గుణం ఉంది. చెడు కొలెస్టరాల్‌ను 27శాతం వరకూ తగ్గించే శక్తి దీని సొంతం. టైప్ 2 మధుమేహ రోగులకు ఇది మంచి ప్రయోజనకారి. రక్తం గడ్డకుండా నిరోధిస్తుంది. దీన్ని మోతాదుకు మించి తీసుకోకూడదు. అలా తీసుకుంటే దీనిలో ఉండే కొమారిన్ అనే రసాయనం లివర్‌కి హాని చేస్తుంది.

నల్ల మిరియాలు
ఇప్పుడంటే వీటిని ఆహారంలో వాడడం తగ్గించాం కానీ పూర్వం మిరపకాయలకు బదులుగా మిరియాల పొడినే ఉపయోగించేవారు. నల్ల మిరియాలతో మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఉపయోగాలు: జీర్ణశక్తిని వృద్ధి చేయడానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి. తీసుకున్న ఆహారం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ పోషకాలందేలా చూస్తాయి. దీనిలో ఉండే పిపరిన్ రసాయనం దేహంలోని జీవక్రియలను ఉత్తేజపరుస్తుంది. శరీర బరువు సమతుల్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది. తాజా మిరియాల్లో ఔషధ గుణాలెక్కువగా ఉంటాయి.

ఆవాలు
ఇక ఈ జాబితాలో తర్వాతి స్థానం ఆవాలదే. ఇవి కూడా దేహంలో జీవక్రియలను ఉత్తేజపరుస్తాయి. దాంతో అధికంగా ఉన్న కొవ్వు వేగంగా కరిగిపోయి బరువు తగ్గడం సులభమవుతుంది. ఉపయోగాలు: రోజుకొక చెంచాడు ఆవపిండిని తీసుకుంటే 25 శాతం మేరకు జీవక్రియలు ఉత్తేజితమవుతాయని ఇంగ్లాండ్ లోని ఆక్స్ఫర్డ్ పాలిటెక్నిక్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. అధిక రక్తపోటు తగ్గించడానికి ఆవనూనె చక్కగా పనిచేస్తుంది. వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఐరన్, మాంగనీస్, జింక్, ప్రొటీన్, కాల్షియం, నయసిన్ సమృద్ధిగా లభిస్తాయి.



Click it and Unblock the Notifications
