Latest Updates
-
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి!
అలసట పోగొట్టే మార్గాలు?

డైటింగ్ అతిగా చేయకండి. బరువు తగ్గే ప్లానులు, వేగంగా లావుతగ్గాలని చేసే ఆహార నియమాలు వంటివి ఆరోగ్యం కాదు. ఆహారాలన్నిఒకేసారి మానేయకండి. ఇప్పటికే బరువు తగ్గిన వారైతే, పోయిన మీ బరువును, ఉత్సాహాన్ని పొందేందుకు ఆరోగ్యకరమైన జీవన విధానం మాత్రమే అని గ్రహించండి.
బ్రేక్ ఫాస్ట్ ఎపుడూ మానకండి. చాలామంది ఈ తప్పు పని చేస్తారు. దీని వలన రోజంతా చిరుతిండి తింటారు. ఆకలితో మీ పేగులు అలమటిస్తూంటాయి. కనుక లేచిన మూడు గంటలలోపు ప్రొటీన్లు, పీచు బాగా వుండే బ్రేక్ ఫాస్ట్ తప్పక తీసుకోండి.
రక్త హీనత వుందా? పరీక్షించండి. రక్తహీనత మీలో అంతులేని అలసట కలిగిస్తుంది. శరీరంలో ఎణర్రకణాలు బాగా తగ్గిపోతాయి. బలహీనత, శ్వాస సరిగా ఆడకపోవటం కూడా వస్తాయి. ఇది పురుషులకంటే స్త్రీలలో అధికం. అదికూడా వారి రుతుక్రమంలో తగిన ఐరన్ తీసుకోకపోవటంతో వస్తుంది.
ప్రతిరోజూ వ్యాయామం చేయండి. వారానికి కనీసం 4 లేదా 5 సార్లు వ్యాయామం చేయాలి. అది మీలో శక్తి స్ధాయిలు పెంచుతుంది. అనారోగ్యాన్ని దూరం చేస్తుంది. వ్యాయామాలు చేయాలంటే అలసటగా వుంటోందా? కారణాలు పరిశీలించండి. సరిగా తినకపోవడం, తగినంత నీరు తాగకపోవటం, లేదా అధికంగా శారీరక శ్రమ చేయటం కూడా కావచ్చు.
అధికంగా తినకండి. అధికంగా తింటే మీ ఎనర్జీ అంతా అది జీర్ణం అవ్వటానికే సరిపోతుంది. మూడు సార్లు అధికంగా తినే బదులు, అయిదు సార్లు తక్కువ తక్కువ మొత్తాలు తినండి. బ్లడ్ షుగర్, ఇన్సులిన్ వంటివన్ని నియంత్రించబడతాయి. అలసట దూరం అవుతుంది. ఐరన్ అధికంగా వుండే ఆహారాలు తీసుకోండి.
తగిన వ్యాయామాలు చేసి మీ కీళ్ళను, ఎముకలను సవ్యంగా పనిచేసేలా చేయండి. చేసే వ్యాయామాలు మీకు బలాన్ని మరియు శరీర ధృఢత్వాన్ని కలిగించాలి. వ్యాయామాలు తగిన శిక్షణతో చేయండి.
మందులు వాడేవారు వాటి సైడ్ ఎఫెక్టులు గమనించాలి. నొప్పులకు తరచుగా మాత్రలు వాడకండి. అవి అలసట కలిగిస్తాయి. మందంగా వుండటమనేది వీటివలన కలిగే అలసట లక్షణంగా గుర్తించండి.
మీలోని ఒత్తిడిని నియంత్రించుకోండి. అందుకుగాను నిరాశ, విచారం వంటివి భావించకండి. ప్రోత్సాహం, మెమొరీ సమస్యలు లేకుండా చేసుకోండి. లక్ష్యంలేనివారుగా, వ్యర్ధ జీవితం అనుకునేవారిగా వుంటే అవి మీఆహారంపై ప్రభావం చూపి బలం లేకుండా చేస్తాయి. కనుక ఇటువంటి భావనలు రానీయకండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications