Latest Updates
-
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026
జిమ్ తో పొట్ట తగ్గదు... ఈ ఔషదాలతో పొట్ట మాయం... బాడీ స్లిమ్
ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలికి తగ్గట్టుగానే విపరీతమైన బరువును భరిస్తూ... అందవిహీనంగా మారుతున్నారు. మళ్ళీ బరువు తగ్గాలంటూ ఎంతో కష్టపడతారు. ప్రతిరోజూ వ్యాయామం, డైటింగ్ వంటివి చేస్తూనే ఉంటారు. కాని బరువు తగ్గటంలో ఫలితాలు తక్కువగానే ఉంటూ ఉంటాయి. కాని కొన్ని సార్లు వారికి తెలియకుండానే కొన్ని తప్పులు జరిగిపోతూంటాయి.
సాధారణంగా ఎంత డైటింగ్ లో ఉన్నప్పటికి, కొన్నిసార్లు తెలిసో తెలియకో డైటింగ్ చేసేవారు డైట్ కోక్స్ లేదా ఇతర కార్బోనేటెడ్ డైట్ డ్రింక్ లు తాగుతూంటారు. అయితే ఇవి ఆరోగ్యకరం కాదు. వీటిలో అధికంగా షుగర్ మరియు కేలరీలు వుండి కొంతకాలంపాటు బరువు తగ్గించినప్పటికి తర్వాతి కాలంలో అనేక ఆరోగ్య సమస్యలనిస్తాయి
బాడీ స్లిమ్ గా అవ్వడానికి జిమ్ కు వెళుతుంటారు. అయితే ఎక్సాట్రా వర్క్ ఔట్స్ చేయడం వల్ల బాడీ తగ్గుతుంది కానీ, పొట్ట మాత్రం తగ్గదు. కాబట్టి వ్యాయామంతోపాటు..తినేటటువంటి ఆహార పదార్థాల ఎంపికలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి. అప్పుడే శరీరంలో పేరుకొన్న అధిక కొవ్వు తగ్గుతుంది. అదనంగా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. చూడచక్కని రూపం మన సొంతమవుతుంది. అవేంటో చూద్దాం..

తేనె
పంచదారతో పోలిస్తే తేనెలో కెలొరీలు అధికంగా ఉన్నా.. వేడినీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకొన్న కొవ్వు కరుగుతుంది. క్రమంగా బరువూ తగ్గుతాం. అలాగే తేనె, నిమ్మరసం, దాల్చిన చెక్క...కలిపి తీసుకోవడం వల్ల శరీర బరువులో ఎంతో తేడా ఉంటుంది. ఊబకాయం ఉన్నవారు వంటకాల్లో బెల్లం, పంచదారకు బదులు తేనెను వాడితే మంచిది. అందుకు గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచా తేనె, కలిపి పరకడుపున తీసుకుంటే ఎంతో మార్పు ఉంటుంది.

ఆలివ్ ఆయిల్
వంట నూనెల్లో రారాజు ఆలివ్ ఆయిల్. సన్‌ఫ్లవర్, గ్రౌండ్‌నట్ ఆయిల్స్‌తో పోల్చుకుంటే దీని ఖరీదు ఎక్కువ. అయినా అన్ని నూనెలకంటే ఇందులోనే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ హృద్రోగులకు ఎంతో మేలు చేస్తాయి. ఆలివ్ అయిలో మ్యూఫా చాల ఉంటాయి. మ్యూఫా అంటే మోనో శాచ్యురేటడ్ ఫ్యాటి అని అర్థం. ఇవి శరీరంలోని మంచి కోలెస్ర్టాల్ ను తగ్గించకుండా చెడు కొలెస్ర్టాల్ ను తగ్గిస్తాయి. ఈ విధంగా గుండె జబ్బులు దూరం అవుతుంది. గుండె పదిలంగా ఉడంటంతో పాటు మీరు హాయిగా జీవిస్తారు.

గ్రీన్ టీ
అధికబరువు తగ్గేందుకు ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకునేవారు గ్రీన్ టీ తప్పనిసరిగా తాగాలి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. శరీరంలో అధికకెలోరీలను తగ్గించడమే కాదు. దృడమైన ఆరోగ్యాన్నీ అందిస్తుంది ఈ గ్రీన్ టీ.

ద్రాక్ష
ద్రాక్ష తినడానికి కొంచెం పుల్లగా ఉంటాయి. అవి ఆరోగ్యానికి చాలా ఆరోగ్యం కరం. ఇది కొవ్వును తగ్గించడానికి బాగు ఉపయోగపడతుంది. వీటిని ప్రతి రోజూ మీ డైయట్ చేర్చుకోనవసరం లేదు. ఆయా సీజన్ లో లభించే టప్పుడు తీసుకొన్నా సరిపోతుంది. ద్రాక్ష ఇది మరొక బరువు తగ్గించే ఆహారం. సిట్రస్ జాతికి చెందినదే. యాంటీ ఆక్సిడెంట్లు అధికం. శరీర కొవ్వును తేలికగా కరిగిస్తుంది. వంద గ్రాముల రసంలో 69 కేలరీల శక్తి వుంటుంది.

ఆస్పరాగస్
ఆస్పరాగస్ పూర్తిగా కొవ్వును వ్యతిరేకించే ఫుడ్. ఇందులో ఎక్కువగా ఫోలేట్ మరియు విటమిన్ ఎ, సి మరయు కె అధికంగా ఉంటుంది. ఇంకా రిబోఫ్లెవిన్, ఐరన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిని డైయట్ లో తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా బాడీని స్లిమ్ గా మార్చుతుంది.

మొలకెత్తిన పెసలు
వీటిలో ఎ, బి, సి, ఇ, విటమిన్లు ఖనిజ లవణాలు, క్యాల్షియం, ఇనుము, పొటాషియం.. మాంసకృత్తులు, పీచు..వంటివెన్నో పోషకాలు లభిస్తాయి. కొవ్వును కరిగించడంతోపాటు..శరీర బరువును అదుపులో ఉంచుతాయి. అలాగే చాలా త్వరగా జీర్ణమవుతాయి కూడా. పైగా వీటిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది. అందుకే వీటిని రోజూ తీసుకోవాలి.

గ్రనోలా బార్స్
ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ కింద అధిక పీచు పదార్థం కలిగిన ఆహారాన్ని తీసుకుంటే రెండింతల కొవ్వు కరిగిపోతుందని మియామి విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ లిసాడోఫిమాన్ పేర్కొంటున్నారు. రిఫైన్డ్ ఫుడ్ (పీచు పదార్థం తక్కువగా ఉన్న ఆహారం)రక్తంలోని చక్కెర నిల్వలను మరింత పెంచుతాయని, దీనికన్నా ప్రతిరోజూ 4గ్రాముల గ్రనోలా బార్ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు.



Click it and Unblock the Notifications











