Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శరీర లోపలి భాగాలు సహజంగా శుభ్రపడాలంటే!

నల్లని మిరియాలు - వీటికి యాంటీ సెప్టిక్ గుణం వుంది. శరీరంలోని విష పదార్ధాలను తొలగిస్తాయి.వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణవ్యవస్ధను కాపాడతాయి. వ్యాధులు రాకుండా చేస్తాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. డయోరియా వంటి వ్యాధులు నయమవుతాయి. ఫుడ్ పాయిజన్ జరిగితే మిరియం వాడండి. పొట్ట వ్యాధులకు ఇంటి చిట్కా.
వెల్లుల్లి - గుండె జబ్బుల రోగులకు మంచి పోషక సుగంధ ద్రవ్యం. వాసన వదిలేయండి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చాలాబాగా పనిచేస్తాయి.శరీరలోపలి భాగాలు శుభ్రం చేయటమే కాక, ఈ వెల్లుల్లి కేన్సర్, ఇతర వ్యాధులు రాకుండా చేస్తుంది.
పసుపు - సాధారణంగా ఏ వంటకం చేసినా పసుపు వేస్తారు. వంటకం పసుపు రంగులో ఆకర్షణీయంగా కనపడుతుంది. పసుపు చర్మ కాంతిని మెరుగు చేస్తుంది. శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. కడుపులో మంట తగ్గించి జీర్ణక్రియ మెరుగుచేస్తుంది. వైరల్, ఫంగల్ వ్యాధులనుండి కాపాడుతుంది.
అల్లం - అల్లపు రసం జీర్ణక్రియకు ఒక టానిక్. శరీర లోపలిభాగాలను బాగా శుభ్రం చేస్తుంది. మంటను తగ్గిస్తుంది. యాంటాసిడ్ మరియు విరేచనాన్ని కలిగించే పదార్ధాలున్నాయి. అజీర్ణం తగ్గించాలంటే, చిన్న అల్లం ముక్క తింటే చాలు. పొట్టవ్యాధులు తగ్గిస్తుంది. తలనొప్పి తగ్గాలంటే, మీరు తాగే టీ లో కొద్దిపాటి అల్లం వేస్తే చాలు మంచి రిలీఫ్ వస్తుంది. జలుబు, దగ్గు వంటివి తగ్గాలంటే, వెల్లుల్లి తోకలిపి తింటే సత్వర ఫలితాలుంటాయి.
దాల్చిన చెక్క - మీరు తాగే టీలో లేదా తినే కూరల్లో దాల్చిన చెక్క వేస్తే, మంచి రుచి వస్తుంది. జీర్ణక్రియను బలపరుస్తుంది. దాల్చిన చెక్క పొడితో రక్తంలోని షుగర్ స్ధాయిలను కూడా నియంత్రించవచ్చు.
ఎర్ర మిర్చి లేదా కారం - ఇది తింటే మంట. ఎంతో వేడి చేస్తుంది. మంట తగ్గాలంటే నీరు తాగటమే మార్గం. శరీరంలోని మలినాలను తేలికగా విసర్జిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications