Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బరువు తగ్గేందుకు ఇంటి పానీయాలు!

వేడి నీరు - నిమ్మరసం : సాధారణంగా డైటింగ్ చేసేవారు ఈ పానీయాన్ని తాగుతూనే వుంటారు. వేడినీరు శరీరానికి మంచిది. బరువు తగ్గిస్తుంది. వేడినీరు, నిమ్మరసం కలిసిన మిశ్రమం శరీర కొవ్వును కరిగిస్తుంది. మంచి పోషక పానీయం కూడాను. ప్రతి భోజనం తర్వాత ఈ పానీయాన్ని తాగితే శరీర కొవ్వు కరిగిపోతుంది.
వేడినీరు - తేనె: ఉదయంవేళ పొట్ట ఖాళీగా వున్న సమయంలో వేడి నీరు, తేనెల మిశ్రమం శరీరానికి ఎంతో లాభం చేకూరుస్తుంది. బరువు తగ్గించటమేకాదు, ఈ డ్రింక్ మంచి చురుకుదనాన్నిచ్చి మీ జీవప్రక్రియను వేగిరపరుస్తుంది. తేనెలో వుండే అమినో యాసిడ్లు, ప్రొటీన్లు, మినరల్స్ అధిక బరువు రాకుండా నిలుపు చేస్తాయి.
గ్రీన్ టీ: దీనిని ఇంటిలోనే తయారు చేసుకొని వేడి లేదా చల్లగా కూడా తాగవచ్చు. గ్రీన్ టీ బరువు తగ్గటానికి బాగా పని చేస్తుంది. శరీరంలోని మలినాలను విసర్జించి ఆరోగ్యంగా వుంచుతుంది. జుట్టు రాలటం, చర్మం పొడిబారకుండా చేయటం వంటివి చేస్తుంది.
వెజిటబుల్ జ్యూస్ - కాకర రసం కొవ్వు తగ్గించేందుకు బాగా పని చేస్తుంది. షుగర్ లెవెల్ అదుపులో వుంచి శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. దీనితో పాటు బచ్చలి ఆకు లేదా కేరట్ లేదా టొమాటో జ్యూస్ వంటివి కూడా తాగి బరువు తగ్గించుకోవచ్చు.
బరువు తగ్గాలనుకునేవారు ఇంటిలోనే ఈ పానీయాలను తయారు చేసుకొని తాగితే మంచి ఫలితాలు వస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications