Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
షుగర్ ను ధరిచేరనివ్వదు... బరువును తేలికగా తగ్గిస్తుంది...!

బ్రౌన్ రైస్ (దంపుడు బియ్యం)తో వండిన అన్నం కంటికి ఇంపుగా ఉండదు.కానీ ఒంటికి మాత్రం ఖచ్చితంగా మంచిది. బియ్యాన్ని పాలిష్ చేసి, ఆకర్షణీయంగా చేసే పద్ధతిలో అందులోని జీవ పదార్ధం, ఆరోగ్య రక్షణకి ఎంతగానో అవసరమైన బీ-కాంప్లెక్స్ విటమిన్లు పోతున్నాయి. అయితే కావాలని కోరుకున్నా, ఇప్పుడు పట్టణాలలో దంపుడు బియ్యం కనపడ్డం కష్టం. పాలిష్ చెయ్యని గోధుమలతో తయారైన బ్రౌన్ బ్రెడ్ మాత్రం దొరుకుతోంది. దాని విలువని ప్రజలు గుర్తిస్తున్నారు.
బ్రౌన్ రైస్ లో ఉన్న ప్రత్యేక గుణాలు :
1. బియ్యంలో ప్రధానంగా పిండిపదార్ధాలు ఉన్నాయి. ఇందులో ప్రోటీన్లు తక్కువగా వున్నా, ఉన్న ప్రోటీన్లు మాత్రం శరీరానికి అత్యవసరమైనవి.
2. ఇది చాలా తేలికగా అరుగుతుంది. శరీరానికి పూర్తి శక్తిని ఇస్తుంది. శరీరంలోని ప్రతి అవయవానికీ, కణానికీ శక్తిని అందించి, వాటిని సక్రమంగా పని చేయిస్తుంది.
ఇందులో పీచు పదార్ధం లేదు. కనుక జీర్ణవ్యవస్త మీద చాలా మృదుగుగా పనిచేస్తుంది.
3. బ్రౌన్ రైస్ (దంపుడు బియ్యం)లో ఉండే విటమిన్ బి-కాంప్లెక్స్ శరీరం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది చర్మానికీ, రక్తనాళాలకీ పోషణ అందిస్తుంది.
4. దంపుడు బియ్యంతో వండిన అన్నం తేలికగా జీర్ణమయ్యే పదార్ధం కనుక ఎన్నో అనారోగ్యాలకు ఇది పథ్యం. పథ్య అంటే శరీర అవయవాలకు అనుకూలమైనది. అంటే శరీరానికి మంచిది అన్నమాట.
5. చంటి పిల్లలకి విరేచనాలు అవుతూంటే బియ్యాన్ని వేయించి పొడి చేసి, జావలా చేసి, దానిని మజ్జిగలో కలిపి కొద్దికొద్దిగా తినిపిస్తుంటే విరేచనాలు తగ్గుతాయి. డీహైడ్రేషన్ సమస్య రాదు.
6. శరీరానికి పూర్తి పోషణ అందడానికి మెత్తగా వండిన అన్నంలో పాలు కలిపి ప్రతిరోజూ తినాలి. పాలు, అన్నం కలిపి తినడం వలన ప్రోటీన్లు కూడా అందుతాయి. రెండూ కలిపి తినడం వలన ఆహారంలో తీసుకున్న ఇనుము సక్రమంగా రక్తంలోకి చేరుతుంది.
7. ఎక్కువ శాతం కొలెస్ట్రాల్, హై బ్లడ్ ప్రషర్ మొదలైన లక్షణాలున్న మోనోపాజ్ దశ దాటిన మహిళలకు దంపుడు బియ్యం తినటం వల్ల ఆరోగ్యంగా చాలా మెరుగుపడినట్లు సమాచారం.
8. దంపుడు బియ్యం మన శరీరంలోని Ldl బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
9. బరువు తగ్గించుకోవటానికి ఉపయోగపడుతుంది.
10. హోల్ గ్రైయిన్స్ లో లోఫ్యాట్ సాచురేటెడ్ ఫ్యాట్ మరియు కొలెస్ట్రాల్ తక్కువ శాతంలో ఉండటం వల్ల గుండె జబ్బులను కొన్ని రకాల కేన్సర్లను నిరోధించే శక్తి వీటిలో ఉంది. దంపుడు బియ్యం తినేవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ. టైఫాయిడ్, అల్సర్, విరేచనాలు, పైల్స్ లాంటి అనేక ఆరోగ్య సమస్యలలో మెత్తగా వండిన అన్నంలో ఒక గ్లాసు మజ్జిగ, ఒక అరటిపండు కలిపి యిస్తే మంచిది. తేలికగా అరుగుతుంది. అరగడమే కాదు, ఇదే ఒక ఔషధంగా పనిచేసి జీర్ణాశయాన్ని రక్షిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
