Latest Updates
-
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.!
భోజనం మధ్యలో నీరు తాగకండి!

మరి అసలు మన శరీరానికి తగినంత నీరు తాగుతున్నామా? అనే అంశం ఎలా తెలుసుకోవాలి? అందుకు సూచనగా మీకు దాహం వేస్తుంది. కనుక మీరు ఎంత దాహం భావిస్తున్నారనేది ముందుగా పరిశీలించుకోండి. అలాగని మీరు భోజనం చేసే సమయంలో గ్లాసులకొద్ది నీటిని తాగేయటం సరికాదు. నీరు ఆహారం తీసుకునేటపుడు తాగరాదు.
మన భారతీయులలో చాలామందికి భోజనం వద్ద పెద్ద చెంబు లేదా గ్లాసులతో నీరు పెట్టుకొని భోజనం మధ్యలో తాగే అలవాటు వుంది. ఈ రకంగా భోజనం మధ్యలో నీరు తాగితే, మీరు తినే ఆహారాన్ని అది కడిగేస్తుంది. ఇది చాలా చెడ్డ విధానమని గుర్తించండి. జీర్ణక్రియకు చెడు కలిగిస్తుంది. అజీర్ణం సమస్యలు కలిగిస్తుంది. మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వుంటాయి. నీరు తాగితే పలుచనైన ఆ ఆహారాన్ని జీర్ణం చేయాలంటే, మీ పొట్టలో మరోమారు అవసరమైన జీర్ణరసాలు ఘాటుగా ఊరాలి. అందుకు సమయం పడుతుంది. కనుక తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు.
మన పొట్టలకు మనం ఆహారం ఎపుడు తింటామో అపుడు జీర్ణ రసాలను ఉత్పత్తి చేయాలనేది బాగా తెనలుసు. అదే సమయంలో మీరు నీరు తాగితే, మీరు అది ఉత్పత్తి చేసే జీర్ణ రసాలను మరింత పలుచబడేస్తున్నారు. కనుక అవి మీరు తినిన ఆహారాన్ని జీర్ణం చేసి చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టలేదు.
ఆహారం తీసుకునే సమయంలో కొద్దిపాటి నీరు తాగటం సరైనదే అయినప్పటికి, గ్లాసుడు నీరు తాగరాదని అది జీర్ణక్రియకు ఆటంకం అని రీసెర్చి చెపుతోంది. భోజనానికి ఒక గంట ముందుగా లేదా భోజనం తర్వాత రెండు గంటల తర్వాత తాగే నీరు జీర్ణక్రియకు సహకరించి పోషకాలు శరీరంలోని బాగా పీల్చేలా చేస్తాయని రీసెర్చర్లు కనుగొన్నారు.
భోజనం మధ్యలో తాగే నీరు మీ పేగు గోడలు పీల్చేసుకుంటాయి. అక్కడ ఊరే ఘాటైన యాసిడ్లు పలుచబడిపోతాయి. ఆహారం జీర్ణమయ్యేటందుకు అవసరమైన జీర్ణ రసాలు వుండవు. ఫలితంగా తిన్నది జీర్ణం కాక, మరోమారు వెలుపలికి కూడా వచ్చి గుండె, గొంతు మంటలను కలిగిస్తుంది. ఇన్సులిన్ స్ధాయిలు పెరిగి అవి మీ రక్తంలోకి వదలబడి, కొవ్వును పెంచుతాయి.
మరి భోజనం మద్యలో నీరు తాగకుండా వుండేందుకుగాను మీరు తినే ఆహారం మరింత ఉప్పగాను, లేదా కారంగాను లేకుండా చూడండి. నీరు అవసరపడని ఆహారంగా వుండాలి. త్వర త్వరగా తినకండి. మీరు ఆహారం మింగేస్తే నీరు అవసరం అవుతుంది. అందుకని బాగా నమిలి తినండి. ఎంత బాగా నమిలితే, అంతబాగా ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications