Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
కండ కావాలంటే మాత్రం ప్రొటీన్ ఆహారం?

1. రిఫైన్డ్ షుగర్ ఫుడ్స్
ప్యాక్ చేసిన ఆహారాలు లేదా ఫాస్ట్ ఫుడ్, అధికంగా రిఫైన్ చేసిన తీపి పదార్ధాలు ఎక్కడ కావాలన్నా కనపడతాయి. ఏదైనా త్వరగా తినేయాలననుకుంటే బేకరీలు, పానీయాలు తేలికగా దొరుకుతాయి. ఇవన్ని వెంటనే మీకు మంచి భావన ఏర్పరచినా తర్వాతి దశలో మిమ్మల్ని డల్ చేయటమే కాక వ్యాధులు కలిగిస్తాయి. దానికి కారణం వాటిలో వుండే షుగర్ పదార్ధం. అది మీ శరీరంలో చేరి మొదట శక్తి నిచ్చినప్పటికి మెల్లమెల్లగా శక్తి తగ్గిపోతుంది. మరల షుగర్ కావాలనిపిస్తుంది. కనుక స్వీటు షాపులు, బేకరీలు లోని వాటికంటే సహజంగా లభించే పండ్లు, కాయలు ఆరోగ్యంగా తినండి. ఇవి తీపి అయినప్పటికి హాని కలిగించవు.
2. నిలువ రసాయనాలతో కూడిన ప్యాకేజ్జ్ ఆహారాలు
షుగర్, రసాయనాలు వేసి అధిక కాలం నిలువ వుండే ప్యాకేజ్జ్ ఆహారాలు హాని కలిగిస్తాయి. వీటిలోని పదార్ధాలు మన రక్తపోటు పెంచి ఒత్తిడి కలిగిస్తాయి.
3. కేఫైన్ కలిపిన ఆహారాలు
మీరు కాఫీ బాగా తాగేవారైతే, అది తాగిన వెంటనే మీ మూడ్ మారటం గమనించే వుంటారు. మరోమారు అది తాగటానికి ఇష్టపడతారు. దానికి కారణం కేఫైన్ ఒక మత్తుపదార్ధం. అది సహజమైనదే అయినా, ఎపుడైనా సందర్భానికి తాగటం మీ మానసిక ఆరోగ్యానికి మంచిది కాని దాని మీద అధికంగా ఆధారపడితే మీరు తాగిన ప్రతిసారి అది మీకు మత్తు కలిగించి ఇక ఆ కాఫీ కప్పు చేతిలో లేనిదే మీరు జీవించలేరనే భావన కలిగిస్తుంది.
4. కొల్లెస్టరాల్ అధికంగా వుండే ఆహారాలు
కొల్లెస్టరాల్ సహజంగా కావలసిన పదార్ధమే కాని అది అధికమైతే ఆరోగ్యానికి హాని. మానసికంగా, శారీరకంగా హాని కలిగిస్తుంది. రక్తనాళాలను మందగిస్తుంది. రక్త ప్రసరణకు అడ్డు కలిగిస్తుంది. అనవసరమైన హార్మోన్ల మార్పులు తెస్తుంది. బంగాళదుంప చిప్స్ ఫ్రెంచి ఫ్రైస్ వంటివి మీ జీర్ణ వ్యవస్ధపై ఒత్తిడి కలిగించి కొవ్వులు కలిగిస్తాయి. అవసరమైన పోషకాలు కోల్పోతారు. జీవప్రక్రియ మారుతుంది.
5. అధికంగా ప్రొటీన్లు కల ప్యాకింగ్ ఆహారాలు
అందరూ ప్రొటీన్లు అధికంగా తినాలనుకుంటారు. అయితే, మీరు ప్రతిరోజరూ జిమ్ కు వెళ్ళి వర్కవుట్లు బాగా చేస్తే తప్ప ప్రొటీన్ల అవసరం అంతగా వుండదు. మానసిక ఆరోగ్యానికి అధిక ప్రొటీన్లు మంచివి కావు. కనుక గుడ్లు, ప్రొటీన్ షేకులు, చేపలు, చికెన్ వంటివి కండలు పెంచాలని భావిస్తే తప్ప తినకండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
