Latest Updates
-
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.!
‘పండ్ల’ను భోజనానికి ముందు తింటేనే ఆరోగ్యానికి అధిక ప్రయోజనం....!
ప్రకృతి పరంగా లభించే పండ్లు, కూరగాయలను తీసుకోవడంతో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. శరీరానికి కావలసిన పోషకపదార్థాలు పండ్లు, కూరగాయల్లో ఉంటాయనడంలో సందేహం లేదు. అనారోగ్యంగా ఉండేవారికి, ఆరోగ్యంగా ఉండే వారికి పండ్లు టానిక్‌లా ఉపయోగపడతాయి. మనిషి ఆయుష్యును పెంచుతాయి. అయితే పండ్లును చేర్చకుండా ఆహారం ఎప్పటికీ సమతుల్యమవదు. పండ్లను కూడా మితంగా తినాలి. కాబట్టి ఆహారంలో పండ్లు తప్పనిసరి. పండ్లు తినడం అనగానే మార్కెట్ నుంచి పండ్లు కొనితెచ్చి కోసుకుని తినడం మాత్రమే కాదు. మనం తీసుకుంటున్న పండ్లు ఎప్పుడు, ఎంత మోతాదులో, ఎలా తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమే. కాబట్టి పండ్లు తినే పద్ధతి గురించి తెలుసుకుందాం.
పండ్లు ఎపుడు తినాలి? సాధారణంగా పండ్లు ఇంట్లో ఉన్నాయంటే చాలు ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తుంటారు కొంతమంది. అయితే అది మంచి పద్దతి కాదు. పండ్లను తినటానికి మంచి సమయం అంటే, ఉదయం వేళ ఒక గ్లాసు నీరు తాగిన తర్వాత. పండ్లను భోజనం తర్వాత తినటమనేది సరియైనదికాదు. భోజనం తర్వాత వెంటనే తింటే అవి సరిగా జీర్ణం కావు. వాటిలోని పోషకాలు సరిగా జీర్ణవ్యవస్ధ చే పీల్చబడవు. మీ భోజనానికి ఒక పండు తినటానికి కనీసం 30 నిమిషాల వ్యవధి వుండాలి. లేదా భోజనానికి ఒక గంట ముందు లేదా ఎసిడిటీ, డయాబెటీస్ వంటి సమస్యలున్నవారైతే భోజనం తర్వాత రెండు గంటలకు తినాలి. ఎందుకంటే డయాబెటీస్ తో కొన్ని జీర్ణ క్రియ సమస్యలుంటాయి. పండ్లు ఎప్పుడూ ఖాళీ కడుపుతో తింటే చాలా మంచిది. ఇలా ఖాళీ కడుపుతో పండ్లు తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. అంతే కాదు బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక మంచి ప్రత్యామ్నాయ ఆహారంగా కూడా ఉంటుంది.

పండ్లను ఇతర ఆహారాలతో కలిపి తినవచ్చా? అజీర్ణం లేదా ఎసిడిటీ వంటివి లేకుంటే మీరు పండ్లను పెరుగు తో కలుపుకొని తినవచ్చు. పైన్ ఆపిల్, ఆరెంజ్, పుచ్చకాయ, దానిమ్మ వంటివి పెరుగుతో మీరిష్టపడితే, తప్పక తినవచ్చు. బెర్రీలు, డ్రై ఫ్రూట్స్ కూడా పెరుగుతో తినవచ్చు. సాధారణంగా ఇతర ఉడికించిన ఆహారాలకంటే కూడా పండ్లు త్వరగా జీర్ణం అయిపోతాయి. వీలైనంతవరకు పండ్లను ఉడికించిన ఆహారాలమధ్య తినరాదు.
పండ్లు ఎంత తాజాగా వుండాలి? అరటిపండు మూడు రోజులలోపు, ఆపిల్ ఒక వారంలోపు, రేగిపండు అయిదు లేదా ఆరు రోజులు, బొప్పాయి, పండిన రెండు లేదా మూడు రోజులలోపు, సపోటాలు పండిన రెండు రోజులలోపు తినాలి. ఇతర పండ్లు, చాలావరకు మూడు రోజులవరకు రిఫ్రిజిరేటర్ లో పెట్టుకొని తినవచ్చు. పండ్ల రసాలకంటే పండును అచ్చంగా అలా తినేయడమే మేలు. అందువల్ల శరీరానికి మేలు చేసే పండ్లలో ఉండే అన్ని సుగుణాలను అందించవచ్చు. ఒక వేళ పండును రసంగా తీసుకోదలచుకున్నపుడు తప్పకుండా తాజాగా తీసిన దాన్ని మాత్రమే తీసుకోవాలి. రసాన్ని నోటి నిండుగా తీసుకొని అది నోటిలోని లాలాజలంతో కలిసేలా నెమ్మదిగా మింగాలి. నెలలో మూడు రోజులు కేవలం పండ్లు మాత్రమే తీసుకుంటే శరీరాన్ని లోపలి నుంచి శుభ్రపరచవచ్చు. వండిన పండ్లు, వేడి చేసిన పండ్ల రసాలు తీసుకోకూడదు. ఎందుకంటే వండిన ఫలాలో పోషకాలు నశిస్తాయి.
సరియైన పద్ధతిలో పండ్లు తినడం వల్ల క్యాన్సర్ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. పండ్లు తినడం వల్ల ఆయుష్షు పెంచుకోవచ్చు, జుట్టు తెల్లబడటం నుంచి కాపాడుకోవచ్చు, కళ్లకింద నల్లటి వలయాలను నివారించవచ్చు, బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. వీటితో పాటు సంతోషంగా ఉండొచ్చు. కాబట్టి తప్పకండా రోజు తీసుకునే ఆహారంలో కొంత భాగాన్ని పండ్లకివ్వండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
