For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ డైట్ తో ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకొనే వారి కోసం మాత్రమే...!

|

సాధారణంగా మనం బరువు పెరుతున్నట్టు మనకు అనిపించిన వెంటనే...బరువు తగ్గాలని మన మనస్సు అనిపిస్తుంది. అందుకు వెయిట్ లాస్ డైయట్ పాటించాలని. ఈ వెయిట్ లాస్ డైయట్ ఫస్ట్ మనస్సు అనిపిస్తానే త్వరగా బరువు తగ్గాలనే ఆలోచనతో, హాడావిడితో క్రాష్ డైయట్ పాటించేస్తారు చాలా మంది. సన్నగా, నాజూగ్గా కావాలని కోరుకునేవారు చాలామందే ఉంటారు. అయితే నలుగురూ లావుగా ఉన్నావంటూ వెక్కిరిస్తున్నారనే తొందరలో అప్పటికున్న ఆరోగ్య పరిస్థితులు, శారీరక, మానసిక సామర్థ్యాలను పట్టించుకోకుండా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు డైటింగ్‌ చేసేస్తే నాజూకుతనం మాట ఎలా ఉన్నా, ఉన్న ఆరోగ్యానికే ముప్పు ఏర్పడి మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే డైటింగ్‌ చేయబోయే ముందు కొన్ని నియమ నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. అవేంటో చూద్దాం!

చాలా కొద్దిమందికి మాత్రమే క్రాష్ డైట్ గురించి తెలుసు. క్రాష్ డైట్ వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని, హాని కలుగుజేస్తుందని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. క్రాష్ డైట్ వల్ల బరువు సులభంగా తగ్గించవచ్చు. అంతే కాదు చాలా త్వరగా కూడా ఈ ప్రక్రియ ముగుస్తుంది. అయితే, ఇటువంటి క్రాష్ డైట్ వల్ల మీ జీవితాన్ని క్రుంగ దీస్తుంది. ఎందుకంటే బరువు తగ్గాలనే లైట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరానికి అందాల్సిన విటమిన్స్ ,న్యూట్రీషియన్స్ మరియు మినిరల్స్ తగినన్ని అందవు. దాంతో శరీరం ఫుల్ ఫిల్ అవ్వదు.

మీరు బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నట్లైతే, దీర్ఘకాలంలో మీ ఆరోగ్యానికి ఎటువంటి హాని తలపెట్టని వెయిట్ లాస్ డైట్ బరువు కోల్పోవడానికి ప్రభావవంతగా పనిచేసే ఆహారాలు దాంతో పాటు రోజువారి శరీరానికి కావల్సిన పోషకాంశాలతో కూడా డైట్ ను పాటించడం వల్ల కొన్ని పౌండ్ల బరువును తొలగించుకోవచ్చు. బరువు తగ్గించుకోవడంలో అలాంటి ప్రభావంతమైన మరియు ఆరోగ్యకరమైన డైట్స్ ఉన్నాయి. ఈ హెల్తీ డైట్ ను మీ జీవిత కాలం పాటు పాటిస్తే మరింత మంచిది. మరి మీరు కూడా హెల్తీ డైట్ తో ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకొనే వారి కోసం ఈ వెయిట్ లాస్ డైయట్...

బరువు తగ్గడానికి క్రాష్ డైట్ వద్దు...హెల్తీ డైట్ ముద్దు...!

గ్రీన్ వెజిటేబుల్ డైట్: ఇది ఒక హెల్తీ టైప్ ఆఫ్ డైట్. ఈ గ్రీన్ వెజిటేబుల్ డైట్ లో లోక్యాలరీలు కలిగి ఫ్యాట్స్ మరియు లో క్యాలరీలు కలిగి ఉంటాయి. అయితే వీటిలో శరీరానికి కావల్సిన విటమిన్స్, మినిరల్స్ మరియు న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. హెల్తీ డైట్ పాటించే వారికి ఆకుకూరలు, బ్రొకోలీ, ఆస్పరాగస్, కొత్తిమీర, కీరదోస, పెప్పర్, టమోటో వంటి ఆరోగ్యకరం మరియు బరువు సులభంగా కోల్పోవడానికి సహాయపడుతాయి.

బరువు తగ్గడానికి క్రాష్ డైట్ వద్దు...హెల్తీ డైట్ ముద్దు...!

జిఇఆర్ డి డైట్: జిఇఆర్ డి (గ్యాస్ట్రియోసోఫాగెల్ రిఫ్లెక్ డిసీజ్)డైట్ ఇది స్పెషల్ డైట్. ఈడైట్ ను ఎక్కువగా బరువు పెరిగే వారికి మరియు వాసిడ్ రిఫ్లెక్స్ సమస్య ఉన్నవారికి ఈ డైట్ పాటించమని సలహా ఇస్తుంటారు. లీన్ మీట్, గుడ్లు, కొత్తిమీర, గ్రీన్ వెజిటేబుల్స్, మరియు పండ్ల జిఇఆర్ డి కలిగిన ఆరోగ్యకరమైన ఆహారం.

బరువు తగ్గడానికి క్రాష్ డైట్ వద్దు...హెల్తీ డైట్ ముద్దు...!

మధ్యధరా ఆహారం(mediterranean diet): బరువు తగ్గడానికి ిది ఒక హెల్తీ డైట్ మరియు మధుమేహాన్ని నిరోధిస్తుంది. ఈ ట్రెడిషినల్ మెడిటేరియన్ డైట్ లో పండ్లు, వెజిటేబుల్స్, ఫైబర్స్, మరియు ఆరోగ్యకరమైన క్రొవ్వులు కలిగి ఉండి, టైప్ 2 డయాబెటిస్ రాకుండా రక్షణ కల్పించి , బరువు తగ్గించడానికి బాగా సహాయపడుతాయి.

బరువు తగ్గడానికి క్రాష్ డైట్ వద్దు...హెల్తీ డైట్ ముద్దు...!

డాష్ డైట్)(DASH Diet): డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్. ఇది హెల్తీ డైట్. ఇది శరీర మరియు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ డైట్ లిస్ట్ లో లోఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్, గ్రీన్ వెజిటేబుల్స్, తాజా పండ్లు, హెల్తీ నట్స్-బాదాం వంటివి గుండె ఆరోగ్యానికి మాత్రమే కాదు, బరువును కూడా తొలగిస్తుంది.

బరువు తగ్గడానికి క్రాష్ డైట్ వద్దు...హెల్తీ డైట్ ముద్దు...!

ప్లాన్డ్ మెను డైట్: ఈ టైప్ డైట్ లో మీ భోజనంలో తీసుకోవల్సిన ఆహారాలను లిస్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒక పద్దతిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి హాని కలిగించే ఫాట్ ఫుడ్స్, ఫైడ్ స్నాక్స్, పిజ్జా బర్గర్ వంటి వాటి మీద మనస్సు పోకుండా అదుపులో ఉంచుతుంది.

బరువు తగ్గడానికి క్రాష్ డైట్ వద్దు...హెల్తీ డైట్ ముద్దు...!

ఫ్యాట్ బర్నింగ్ డైట్: ఈ టైప్ డైట్ లో ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ అధికంగా ఉంటాయి. దాంతో శరీరంలోని క్రొవ్వు నిల్వలను విచ్చిన్నం చేస్తాయి. మంచి ఆకారాన్ని పొందడానికి ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ ధాన్యాలు, పెప్పెర్, వెల్లుల్లి, లీన్ మీట్ లో ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ మరియు సిట్రస్ పండ్లు మీ డైలీ డైట్ లో చేర్చుకోవాలి.

బరువు తగ్గడానికి క్రాష్ డైట్ వద్దు...హెల్తీ డైట్ ముద్దు...!

గ్లిసెమిక్ డైట్: ఇది కూడా హెల్తీ డైట్. దీన్ని మధుమేహగ్రస్తులు మరియు లోషుగర్ ఫుడ్స్ తీసుకోవాలని కోరుకొనే వారికి ఈ డైయట్ చాలా బాగా సహాయపడుతుంది. ఈ డైయట్ బల్ల డైరెక్ట్ గా బరువు తగ్గరు. అయితే రక్తంలోని చెక్కర స్థాయిలను తగ్గించి క్రొవ్వు కరడగానికి సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి క్రాష్ డైట్ వద్దు...హెల్తీ డైట్ ముద్దు...!

వెజ్ డైట్: ఇది చాలా పాపులర్ డైట్. ఈ డైట్ ను సెలబ్రెటీలు కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వెజిటేరియన్ ఆహారాల్లో ఫ్యాట్ అతి తక్కువగా ఉంటుంది. క్యాలరీస్ తక్కువ మరియు విటమిన్స్, న్యూట్రీషియన్స్ పుష్కలం. ఒక వేళ మీ శరీరానికి అనిమల్ ప్రోటీన్స్ అందనట్లైతే మీ డైట్ లో పప్పులు, చిక్కుళ్ళు, పాలు మరియు పాల ఉత్పత్తులు మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

బరువు తగ్గడానికి క్రాష్ డైట్ వద్దు...హెల్తీ డైట్ ముద్దు...!

డిటాక్స్ డైట్: ఈ డైట్ ఫాలో అవ్వడానికి చాలా కారణాలున్నాయి. ఈ డైట్ ను పాటించడం వల్ల బరువు తగ్గుతారు. శరీరం శుభ్రపరుస్తుంది, ఫ్రీరాడికల్స్, టాక్సిన్స్ నుండి విముక్తి పొందుతారు మరియు చర్మానికి మంచి మెరుసు వస్తుంది.

బరువు తగ్గడానికి క్రాష్ డైట్ వద్దు...హెల్తీ డైట్ ముద్దు...!

తృణధాన్యాలు ఆహారం: బరువు తగ్గడంలో ఇది మరో పాపులర్ డైట్.ఈ తృణధాన్యాలలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, న్యూట్రీషియన్స్, విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. లోఫ్యాట్స్ లోక్యాలరీస్ కలిగి ఉంటాయి. కాబట్టే బరువు సులభంగా తగ్గడానికి సహాయపడుతాయి. ఇతర ఆహారాల మీద కోరికలను నియంత్రిస్తాయి.

English summary

Healthy Types Of Diet For Weight Loss | బరువు తగ్గడానికి క్రాష్ డైట్ వద్దు...హెల్తీ డైట్ ముద్దు...!

As soon as we start gaining weight, the only thing that pops on our mind is a weight loss diet. This weight loss diet that first attacks our mind is actually a crash diet. This is because it has immediate and effective solution to lose weight.
Story first published: Sunday, March 17, 2013, 9:36 [IST]
Desktop Bottom Promotion