Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
ఫ్లాట్ టమ్మీ పొందడానికి 10 యోగ భంగిమలు: యోగ డే స్పెషల్
ఈ రోజు వరల్డ్ యోగా డే(ప్రపంచ యోగ దినం). యోగ మీ జీవితాన్ని ఎలా మార్చేస్తుందని ఆశ్చర్యపడుతున్నారు? మీ నిజజీవితంలో మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారు? డబ్బు, లక్సరీలైఫ్ మరియు మంచి అందం, నాజూకైన శరీరం అందురూ మెచ్చుకొనేలా అందం, శరీర సౌష్టవం ext....అయితే వ్యక్తిగతంగా ఎరైన ఒక యావరేజ్ వ్యక్తిని మీరు అడిగితే వారు వెంటనే మేం బరువు తగ్గాలి అని సమాధానం చెబుతారు. మరియు చాలా ఖచ్చితంగా వారు పొట్ట తగ్గించుకోవాలి, ఫ్లాట్ టమ్మీ పొందాలని క్లియర్ గా చెబుతుంటారు. అదేలా సాధ్యం అని కూడా అడుగుతారు. అలాంటి వారికోసం 10 ఎఫెక్టివ్ యోగా భంగిమలు ఈక్రింది విధంగా ఉన్నాయి.
నలుగురిలో మీరు కూర్చున్నప్పుడు, లేదా నిల్చన్నప్పుడు మీ బీర్ బెల్లీ, లేదా బాన పొట్ట ముందుకు పొడుచుకొచ్చి ఇబ్బంది కలిగిస్తోందా?అందుకు కొన్ని యోగ భంగిమలు ప్రయత్నిస్తే ఫ్లాట్ ఏబ్స్ పొందవచ్చు. యోగవల్ల మీ నడుము చుట్టుకొలతల్లో ఖచ్ఛితంగా మార్పులు గమనించవచ్చు. మరియు ఈ రోజు ప్రపంచ యోగ రోజున మీరు బరువు తగ్గించుకోవడానికి యోగ ప్రారంభించడానికి ఒక ఫర్ ఫెక్ట్ ఎక్స్యూస్ . మీరు జిమ్ మరియు ప్రీ హ్యాండ్ ఏబ్స్ క్రంచెస్ వంటివి మీరు ప్రయత్నించి ఉంటారు. కానీ యోగభంగిమిన ఫ్లాట్ టమ్మీ పొందడానికి చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి.
ప్రస్తుత రోజుల్లో ఏ సెలబ్రెటీని చూసినా బరువు తగ్గి, నాజూగ్గా తగ్గినట్లు కనబడుతుంటారు. అందుకు రహస్యం యోగ. అందుకు బెస్ట్ ఎక్సాంపుల్ కరీనా కపూర్ మరియు శిల్పాశెట్టి. ఫ్లాట్ స్టొమక్ పొందడానికి యోగాసనాలను వీరు క్రమం తప్పకుండా చేస్తుంటారు. కాబట్టి మీరు కూడా స్లిమ్ గా మారాలన్నా మరియు ఈ సెలబ్రెటీలు లాగా ట్రిమ్ ఫిగర్ పొందాలన్నా, మీరు కొన్ని ఖచ్చితమైన యోగాసనాలను ట్రై చేయాలి...వరల్డ్ యోగా స్పెషల్ సందర్భంగా పొట్ట కరిగించే కొన్ని యోగ భంగిమలు మీకోసం...

ప్రాణాయమ
యోగ ప్రారంభించడానికి ముందుగా మీశరీరాన్ని వామ్ అప్ చేసుకోవాలి. అందుకు ప్రాణాయమం బాగా సహాయపడుతుంది. ఈ బ్రీతింగ్ వ్యాయామం వల్ల శరీరంలో కండరాలు మొత్తం బిగువుగా తయారవుతాయి. ఫోటోలో చూపిన విధంగా లోటస్ పొజిషన్ లో కూర్చొని, బ్యాక్ స్ట్రెయింట్ గా కూర్చొని గాలి పీల్చి (బెల్లీ నుండి గాలీ పీల్చి)వదలాలి.

తదాసన
మీరు ఇంకా వామ్ అప్ ఫేస్ లోనే ఉన్నారు. నిటారుగా నిల్చొని మౌంటైన్ ఫోజులో నిల్చోవడం వల్ల మీ శక్తి తిరిగి పుంజుకుంటుంది.

సూర్య నమస్కారం
సూర్య నమస్కారం యోగాసనం వల్ల మీ శరీరంలో దాదాపు అన్ని అవయవాలు కదలికలు కలిగి ఉంటాయి. సూర్య నమస్కారంలో 12డిఫరెంట్ భంగిమలు కలిగి ఉన్నాయి. అందులో ముందుకు మరియు వెనుకకు వంగడాలు కూడా కలిపి ఉన్నాయి .

పాదహస్తాసన
ఈ యోగా భంగిమను స్టాండింగ్ ఫార్వర్డ్ బెండ్ అంటారు. ఈ భంగిమలో మీరు తదాసన భంగిమలో మొదట నిల్చోవాలి. తర్వాత ఏమాత్రం మోకాళ్ళను వంచకుండా మీరు నడుమును పూర్తిగా వంచి పాదాలను టచ్ చేయాలి.

పశ్చిమోత్తానాసన
చాప లేదా దుప్పటి నేలమీద పరిచి కూర్చోండి. కాళ్లను సమాంతరంగా ముందుకు చాపండి. మీ వెన్నెముకను నిటారుగా ఉంచండి. కాళ్లు రెండూ దగ్గరగా చేర్చండి. మోకాళ్లు సమాంతరంగా ఉండాలి. అలా అని వాటిని మరీ సాగదీయకండి. మీ చేతుల్ని కాళ్ల వెలుపల నుంచి ముందుకు చాపి ఉంచండి. శ్వాస పీలుస్తున్నప్పుడు చేతులను మీ భుజాలపైగా లేపి ఉంచండి. మీ వెన్నెముకను వీలైనంత నిటారుగా నిలిపి ఉంచండి. ఈ స్థితిలో శ్వాస వదులుతూ కూర్చున్న స్థితిలోనే కటిభాగం నుండి ముందుకు వంగడం ప్రారంభించండి. చివరగా, పాదాలను, మడమలను, పిక్కలను పైకి లేకుండా నేలకు ఆనించాలి లేదా మీ చేతులు ఎంతమేరకు ముందుకు వంగగలవో అంతవరకూ వంచి ఉంచండి. ఈ భంగిమలో మీ వెన్నెముక కదలిక లేకుండా స్థిరంగా ఉంటుంది.

నౌకాసనం
పేరు వింటేనే నౌకాసనం ఎలా ఉంటుందనే విషయంపై మీకు ఈపాటికే ఓ అవగాహన వచ్చి ఉంటుంది. అవును నౌకాసన భంగిమ నౌకలాగే ఉంటుంది. ఇందులో అవలంభించే పద్ధతి కొద్దిపాటి తేడాలు మినహాయించి ఊర్ధ్వ పాద హస్తాసన భంగిమలాగే ఉంటుంది.
ఆసన వేసే విధానం: నేలపై అలాగే శరీరం సమతలంగా ఉండేలా పడుకోవాలి. మీ రెండు చేతులను మీ తొడలపై (ఊర్ధ్వపాద హస్తాసనలో ఉన్నట్టు) పెట్టాల్సిన అవసరం లేదు. దానికి బదులు మీ భుజాలను తలదాకా చాచాలి. ఎగువ భుజాలు చెవులను తాకుతున్నట్టు ఉండాలి. గాలి పీలుస్తూ మీ కాళ్లు, నడుము, భుజాలు, మెడ, తల, అలాగే నేల నుంచి 60 డిగ్రీల కోణంలో పైకి లేపాలి.
ఇలా చేసేటపుడు భుజాలను నేరుగా ఉంచండి. అలాగే మీ పాదాల వేళ్లకు సమాంతరంగా మీ భుజాలను ఉంచాలి. కాళ్ల వేళ్లు చేతికొనలకు సమాన స్థాయిలో ఉండాలి. మీ చూపును కాలి మొనలపైనే శ్రద్ధంగా పెట్టండి. ఈ సమయంలోనే మీ శరీరం మీ వెన్నును ఆధారంగా చేసుకుని ఉంటుంది. శ్వాస గట్టిగా బిగపట్టండి. ఇలాగే ఓ ఐదు నిమిషాల పాటు నిలవండి. ఇపుడు మీ శరీరం నౌకాకృతిని సంతరించుకుంటుంది. ఇలా చేయడాన్నే నౌకాసనంగా చెబుతున్నారు. నెమ్మదిగా శ్వాస బయటకు వదులుతూ ఆ స్థితి నుంచి ప్రారంభ స్థితికి రండి.

పవన్ ముక్తాసనం
పవనముక్తాసనం యోగాలో ఒక విధమైన ఆసనం. ఉదరంలో ఉండే ఆపాన వాయువు ఈ ఆసనం వేయడం ద్వారా బయటకు వెళుతుంది. అందుకనే ఈ ఆసనానికి పవన ముక్తాసనం అనే పేరు వచ్చింది. ఈ పవన ముక్తాసన శ్రేణి నేర్చుకోవాలనుకునే వారు సూర్య నమస్కారాలు చేసే విధానాలతో పాటు అవి ఆచరించాల్సిన సమయాలు పద్దతులు క్రమం తప్పకుండా నేర్చుకోవాలి. ఇందులో ప్రణమాసనం, హస్త ఉత్ధానాసనం, పాదహస్తాసనం, అశ్వ సంచలనాసనం, పశ్చివెూత్తానాసనం, తదితరాలు ఉంటాయి. పవన ముక్తాసన శ్రేణి నేర్చుకుంటే... మజిల్స్ సాగి, సూర్య నమస్కార ప్రక్రియ నేర్చుకునేందుకు వీలు గా మీ శరీరం మారుతుంది. అయితే పవన ముక్తాసన శ్రేణి చేయకుండా నేరుగా సూర్య నమస్కారాలలోకి వెళితే జ్వరం, పాదాల వాపు, చర్మం పగిలిపోవటం, కీళ్ల నొపðలు తదితర లక్షణాలతో బాధపడాల్సి వస్తుంది.

ధనురాసనం
ధనురాసనముయోగాలో ఒక విధమైన ఆసనము. ఈ ఆసనం ధనుస్సు లేదా విల్లు ను పోలి ఉండటం వల్ల దీనిని ధనురాసనమని పేరువచ్చింది. ఇది భుజంగాసనం మరియు శలభాసనం అను రెండాసనాల సమన్వయం. ధనుస్ అంటే సంస్కృతంలో విల్లు. శరీరాన్ని విల్లులా వంచి చేసే ఆసనం ధనురాసనం. ఒక క్రమ పద్ధతిలో శరీరాన్ని వెనుకకు వంచి పాదాలను చేతుల్తో పట్టుకుని ఈ ఆసనాన్ని చేయాలి. ఇది చేయాలంటే ముందుగా చదునైన ప్రదేశంలో చాప కాని అలాంటి వేరేదైనా కానీ నేలపై పరచి దానిపై మెత్తటి దుప్పటి లాంటిది వేసి ఆసనాన్ని చేయాలి.
బోర్లా పడుకొని రెండు కాళ్ళను రెండు చేతులతో గట్టిగా పట్టుకోవాలి. కొద్దిగా శ్వాస పీల్చి తలను, కాళ్ళను పైకి ఎత్తాలి. పొట్ట మాత్రం నేలమీద ఉంటుంది.తరువాత కొద్ది సేపు మకరాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.

జంగం అంటే సర్పం
జంగం అంటే సర్పం. ఈ ఆసనం వేసినప్పుడు ఛాతీ, మెడ, తల పెకైత్తి ఉండడంతో ఈ భంగిమ పడగ విప్పిన పామును పోలి ఉంటుంది. కాబట్టి దీనిని భుజంగాసనం అంటారు. ఇదే ఆసనాన్ని కొద్దిపాటి మార్పులతో నాలుగు రకాలుగా సాధన చేయవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది వాటిలో ఒక పద్ధతి.
ఎలా చేయాలి? బోర్లా పడుకుని రెండు చేతులను (ఎడమ అరచేతి మీద కుడి అరచేతిని ఉంచాలి. ఫొటోని గమనించండి) గడ్డం కింద ఉంచుకుని కొద్ది క్షణాలు విశ్రాంతి స్థితిలో ఉండాలి.
బోర్లించి ఉంచిన అరచేతులను ఛాతీ కిందకు తెచ్చుకోవాలి. ఇప్పుడు పూర్తిగా శ్వాస తీసుకుని దేహం బరువుని రెండు చేతుల మీద మోపుతూ తలను పైకి లేపాలి.
ఇలానే ఉండి, నాభి దిగువ ప్రాంతం వరకు పైకి లేపాలి. ఈ స్థితిలో చేతులు నిటారుగా (మోచేతుల దగ్గర వంచకుండా) ఉండాలి, చూపు ఆకాశం వైపు ఉండాలి. రెండు కాళ్లు భుజాలకు సమాంతరంగా ఉండాలి. మనసును వీపు దిగువ భాగం మీద కేంద్రీకరించాలి. ఇలా ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత తిరిగి యథాస్థితికి రావాలి. ఇలా ప్రతిరోజూ మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.

చతురంగ ఆసన
ప్లాంక్ పోజ్. మీ శరీరాన్ని మార్పిడికి గురిచేసే ఆసనం ఇది . మీరు నిటారుగా బోర్లా పడుకోవాలి. తర్వాత నిధానంగా మీ చేతులను మరియు కాళి వేళ్ళను సపోర్ట్ గా పెట్టుకొని పైకి లేవాలి . ఈ భంగిమ వల్ల శరీరంలో కొవ్వు కరిగించబడుతుంది. ఇది పొట్టతగ్గడానికి కూడా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications











