Latest Updates
-
డేటింగ్ యాప్లో పరిచయం.. వీడియో కాల్తో బ్లాక్మెయిల్! మీ ఫోన్లో ఈ యాప్స్ ఉంటే జాగ్రత్త -
ఢిల్లీలో సీఏ కిడ్నాప్… వెనుక ఉన్నది ఆర్మీ జవాన్ అని తెలిసి షాక్! అసలేం జరిగింది? -
ప్రతిసారీ బిర్యానీనేనా? ఈ వీకెండ్ కొత్తగా, రుచిగా చికెన్ తహారీ రుచి చూడండి! -
గ్రహాల అనుకూలతతో ఈరోజు ఈ రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..అదృష్టం మీ వెంటే! -
ఆయుష్మాన్ సర్వార్థ సిద్ధి యోగం: ఈరోజు ఈ రాశుల వారికి తిరుగులేదు.. అదృష్టం మీ తలుపు తడుతోంది! -
రాత్రి అన్నం మిగిలిందా? పారేయకండి, ఇలా కరకరలాడే వడియాలు చేయండి! -
ఈరోజు అశ్విని నక్షత్రం ప్రభావం ఎలా ఉంది? కొత్త పనులు మొదలుపెట్టే ముందు ఈ ముహూర్తాలు చూశారా? -
వృషభ సంక్రాంతి: సూర్యుడి రాశి మార్పుతో ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు.. అదృష్టం మీదే! -
వృషభం, తుల, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 15 మే 2026 -
బట్టతల నాన్న,తాత వల్ల వస్తుందా? అమ్మ వల్లా? అసలు విషయం తెలిస్తే అవునా,నిజమా అనాల్సిందే!
మీ బెల్లీ ఫ్యాట్ కరగకపోవడానికి 9 అసలైన కారణాలు
వ్యాయామం మరియు జిమ్ చేస్తూ బరువు, అధిక క్యాలరీలు తగ్గించుకొంటున్నారా? జిమ్ కు వెళుతున్నా, వ్యాయామం చేస్తున్నా మీ శరీరంలోని క్యాలరీలు తగ్గడంలేదా దాంతో బెల్లీ ఫ్యాట్ కరగడం లేదా? ఇప్పటి నుండి మనందరికి తెలిసిన విషయం వర్కౌట్ లేకుండా బెల్లీ ఫ్యాట్ కరించగలేమని, తెలుసుకోవాలి. కేవలం డైటింగ్ వల్ల బెల్లీ ఫ్యాట్ కరగదు. అందువల్ల, మీరు వ్యాయామాలు చేస్తున్నా బెల్లీ ఫ్యాట్ కరగకుండా ఉన్నట్లైతే, అప్పుడు అందుకు మరో కారణం ఏదైనా ఉండవచ్చు.
బెల్లీ ఫ్యాట్ కరింగించుకోవడం కోసం వర్కౌట్స్ మాత్రమే సరిపోవు . అందుకు మీరు ఖచ్చితంగా సరైనటువంటి వర్కౌట్స్ ను ఎంపిక చేసుకోవాలి. కేవలం క్రచెస్ ద్వారా మాత్రమే బెల్లీ ఫ్యాట్ కరుగుతుందనుకోవడం పొరపాటే. ఆబ్డోమినల్ క్రంచెస్ చేయడం. ఇది ఫ్యాట్ ను త్వరగా తగ్గించుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఎక్సర్ సైజ్. కానీ,పూర్తి బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి పొత్తికడుపు వ్యాయామాలు కూడా ఉపయోగపడలేదంటే, అప్పుడు మీరు మరింత ఛాలెంజింగ్ వ్యాయామాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
బెల్లీ ఫ్యాట్ కరగకపోవడానికి అనేక కారణాలు బాధ్యతకలిగి ఉన్నాయి. ఆబ్డోమినల్(పొత్తికడుపు)వ్యాయామాలు రెగ్యులర్ గా చేస్తూ, ఈ వ్యాయామాలతో పాటు స్ట్రిట్ డైట్ ను అనుసరించడం ద్వారా మీ బెల్లీ కండాలు కరుగుతాయి. బెల్లీ ఫ్యాట్ కరగకపోవడానికి లేక తగ్గకపోవడానికి కొన్ని కారణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

మీరు 40ఏళ్ళు పైబడిన వారైతే
వయస్సు పెరిగే కొద్దిగా మీ నడుము చుట్టు కొవ్వు పేరుకోవడం జరుగుతుంది. వయస్సు పెరిగే కొద్ది ఇది శరీరం యొక్క మెటబాలిజంలో నేచురల్ గా జరిగే మార్పు. శరీరంలో జీవక్రియలు పనిచేసే సామర్థ్యం తగ్గడం వల్ల ఇలా జరగవచ్చు. కాబట్టి, వయస్సు పెరిగేకొద్ది , వర్కౌట్స్ రెగ్యులర్ గా చేయడం వల్ల ఫిట్ గా ఉండగలుగుతారు.

మీరు తగినంత క్యాలరీలను కరిగించకపోవడం
నాచురల్ గా యాపిల్ సైజ్ లు ఉండే వారు , ఖచ్చితంగా నడుము చుట్టూ, పిరుదుల చుట్టు, తొడల వద్ద ఫ్యాట్ అధికంగా చేరి ఉంటుంది . మీర ఖచ్చితంగా ఈ ఫ్యాట్ ను కరిగించుకోవాలను కుంటే, చాలా కష్టంగా భావిస్తారు. కష్టంగా ఉంటుంది కూడా.

మీరు వ్యాయామాలు తప్పుగా చేస్తుండవచ్చు
బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడం కోసం చేసే వ్యాయామాలు తప్పుగా ఉండవచ్చు. కాబట్టి, వ్యాయామ నిపుణుల సమక్షంలో యోగా, వెయిట్ ట్రైనింగ్ మరియు ఇతర అనేక వర్కౌట్స్ ను చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ ను కరిగించి టమ్మీ ఫ్లాట్ గా పొందవచ్చు.

మీరు పిసిఓడితో బాధపడుతుండవచ్చు
మీగర్భాశయంలో పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ తో బాధపడుతున్నట్లైతే, అప్పుడు మీలో టెస్టోస్టిరాన్ లెవల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి . ఇది మీ శరీరంలో నేచురల్ గా ఫ్యాట్ పెరిగేలా చేసి, బెల్లీ ఉబ్బినట్లుగా అనిపించేలా చేస్తుంది

స్ట్రెస్ లో ఉండటం వల్ల
శరీరంలో స్ట్రెస్ హార్మోనులు అధికంగా రిలీజ్ అవ్వడం వల్ల, తరచూ ఒత్తిడికి గురౌతున్నట్లైతే, అప్పుడు, మీరు బరువు తగ్గడానికి ఏటువంటి వర్కౌట్లు ఉపయోగపడవు.

సరిగా నిద్రపోకపోవడం వల్ల
నిద్రను దాటవేయడం లేదా సమయానికి నిద్రపోకపోవడం వల్ల మీరు బరువు పెరుగుతారు . ప్రతి రోజూ మీకు కనీసి 8గంటల నిద్ర ఖచ్చితంగా అవసరం అవుతుంది.

బెల్లీ ఫ్యాట్ టెండెన్సీ
ఆపిల్ లాగా నేచురల్ గానే మీ శరీరాఆకారం మారినట్లైతే, కొంతమందిలో ఈ టెండెన్షీ వల్ల బరువు పెరగడం కొంత మందిలో జరుగుతుంది. కాబట్టి, మొత్తం శరీరం యొక్క బరువు తగ్గించుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవచ్చు.

మీరు ప్రొసెస్డ్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం వల్ల
మీరు అధికంగా కోల్డ్ కట్స్, చిప్స్ లేదా తినడానికి రెడీగా ఉన్నఆహారాలు తీసుకోవడం వల్ల మీరు ఎప్పటికీ బరువుతగ్గించుకోలేరు.

మీరు ఎల్లప్పుడూ ఒకే విధమైనటువంటి వ్యాయామాలు చేస్తున్నారా
ప్రతి స్టెప్ లోనూ మీ శరీరాన్నివంపులుగా తిప్పడానికి ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. ఒకసారి ఇలా మొత్తం శరీరం కదలికలు ఏర్పడినప్పుడు శరీరంలో క్యాలరీలు కరగడం ప్రారంభం అవుతుంది. దాంతో బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది . అందుకు డిఫరెంట్ టైప్ క్రంచెస్ ను మీరు అనుసరించాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications