Latest Updates
-
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది! -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. శని దేవుని అనుగ్రహం ఎవరికి? - శనివారం, 20 జూన్ 2026
నవరాత్రి ఉపవాస సమయంలో వ్యాయామం: చిట్కాలు
సరైన అవగాహన మరియు ప్లానింగ్ లేకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరానికి హానికరం. ఈ నవరాత్రి సమయంలో ఉపవాసంలో ఉన్నప్పుడు ఈ వ్యాయామం చేసే వారికి ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఒక్క నవరాత్రి ఉపవాస సమయంలోనే కాదు, మరే సందర్భంగా అయినా, మీరు ఉపవాసం ఉన్నట్లైతే వ్యాయామం విషయంలో సరైన అవగాహన కలిగి ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు, ఆహారం ఏమి తీసుకోకపోవడం వల్ల మీ శరీరానికి అవసరం అయ్యే పోషకాలు అందకపోవడం వల్ల ఎనర్జీ లెవల్స్ తగ్గిపోతాయి. ఎనర్జీ లెవల్స్ తగ్గిపోవడం వల్ల వ్యాయామం చేయలేరు.
మీరు ఉపవాసం ఉన్నాకూడా వ్యాయామం చేయడం ఆరోగ్యకరం, అందుకు సరైన ప్లానింగ్ అవసరం. ఎటువంటి ప్లాన్ లేకుండా, అలాగే వెళ్ళి, వ్యాయామం చేయడం సరికాదు, అలా చేయడం వల్ల మీ అంతట మీరు ఒక్కువ ఒత్తిడికి గురికావల్సి వస్తుంది. మీరు చురుకుగా ఉండాలి మరియు ఫిజికల్ యాక్టివిటిస్ లో పాల్గొనడానికి తగినంత శక్తిసామర్థ్యాలు కలిగి ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఉపవాసం సమయంలో కూడా మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు ఎనర్జిటిక్ గా ఉంచుకోవచ్చు.
కొన్ని పరిశోధనల ప్రకారం ఉపవాసం ముగిసిన తర్వాత మీరు తీసుకొనే ఆహారంతో చాలా గొప్ప ఆరోగ్య ప్రయోజనాలున్నట్టు నిర్ధారించారు . అందువల్ల ఈ నవరాత్రి సమయంలో మీరు ఉపవాసం ఉండదలచుకొన్నట్లైతే, ఈ సింపుల్ టిప్స్ ను అనుసరించండి...

1. తక్కువ సామర్థ్యం కలిగిన వ్యాయామం: ఉపవాసం ఉన్న సమయంలో సింపుల్ గా ఉండే ఏరోబిక్స్, లేదా గార్డెనింగ్ లేదా ఒక చిన్న నడక ఆరోగ్యానికి మంచిది . ఉపవాసంలో ఉన్నప్పుడు, ఎక్కువ వ్యాయామానికి మరియు జిమ్ కు వెళ్ళకపోవడమే మంచిది. కాబట్టి, మీరు చేసే వ్యాయామం చాలా సింపుల్ గా మరియు ఎఫెక్టివ్ గా ఉన్న వాటిని ఎంపిక చేసుకోండి.
2. స్ట్రెచ్చింగ్ వ్యాయామం: నవరాత్రి సమయంలో ఉపవాసం ఉన్న వేళల్లో స్ట్రెచ్చింగ్ వ్యాయామం మరియు వాకింగ్ సురక్షితమైన వ్యాయమం. అయితే ఏదైనా సరే అధికంగా చేయకూడదు, అలా చేస్తే ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.
3. బరువులు ఎత్తడం జాగ్రత్త వహించాలి: మీరు వెయిట్ లిప్టింగ్ ట్రైనింగ్ లో న్నట్లైతే ఉపవాసం వేళల్లో మీరు కొన్ని విషయాలను మనస్సులో ఉంచుకోవాలి. వ్యాయామం మొదలు పెట్టడానికి ముందు ఏదైనా హెల్తీ ఫుడ్ తీసుకోవడం మంచిది. లేదంటే మీ శరీరంలో ఎనర్జీలెవల్స్ తగ్గిపోతాయి. మజిల్స్ బలహీనపడి, మిమ్మల్ని వీక్ గా మార్చుతాయి.
4. గార్బ: నవరాత్రి సమయంలో, గార్బ డ్యాన్సింగ్, ఒక ముఖ్యమైనటువంటి ఆచారం. మీలో స్టామినాను స్టోర్ చేయడానికి గార్బా డ్యాన్స్ ఒక ఉత్తమ మార్గం. అదే సమయంలో బరువును కూడా తగ్గించుకోగలుగుతారు. గార్బ డ్యాన్స్ వల్ల మీ చేతులు, కాళ్ళు యొక్క కదలికలు అధికంగా ఉంటుండం వల్ల మజిల్స్ బలపడుతాయి. కొవ్వును కరిగిస్తాయి.
5. శరీరంను హైడ్రేషన్ లో ఉంచుకోవాలి: ఉపవాసం ఉన్న సమయంలో వ్యాయామం చేయాలనుకునే వారు ఎక్కువ ద్రవాలు తీసుకోవాలి. ఎక్కువగా పాలు, తాజా పండ్ల రసాలు మరియు సరిపడినంత నీరు తీసుకోవాలి. దాని వల్ల మీ శరీరంలో పూర్తి హైడ్రేషన్ లో ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications