Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
వెయిట్ లాస్ తర్వాత కూడా హెల్తీ హ్యాబిట్స్ కంపల్సరీ
బరువు తగ్గడం అంత సులువైన పని కాదు. బరువు తగ్గడానికి ఎన్నో రకాల వ్యాయామాలు, ఫుడ్ హ్యాబిట్స్ అలవరుచుకోవాల్సి ఉంటుంది. ఫ్యాట్ ఫుడ్ తీసుకోకుండా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. నిత్యం వ్యాయామం చేయడం ఇలాంటి అన్ని రకాల అలవాట్లతో బరువు తగ్గించుకోవడం సాధ్యమవుతుంది. లైఫ్ స్టైల్ లో చాలా క్లిష్టమైన మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చేస్తే గానీ బరువు తగ్గడం ఈజీ కాదు.
READ MORE: వేగంగా బరువు తగ్గాలంటే వెంటనే వీటిని ప్రారంభించండి...
అయితే బరువు తగ్గిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే లైఫ్ స్టైల్ ని కంటిన్యూ చేయాలి. ఫిట్ గా ఉండాలంటే.. హెల్తీ హ్యాబిట్స్ అలవరుచుకోవాలి. బరువు తగ్గిన తర్వాత రన్నింగ్, బ్రిస్క్ వాకింగ్, జాగింగ్ తప్పనిసరిగా చేయాలి. ఈ మూడు రకాల వ్యాయామాల వల్ల శరీరం ఫిట్ గా, అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. యోగా చేయడం, ప్రొటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం, తక్కువ క్యాలరీలు ఉన్న ఫుడ్ తీసుకోవడం వంటి ఆహార నియమాలు రెగ్యులర్ గా పాటించాలి.
READ MORE: థైరాయిడ్ పేషంట్స్ కొరకు వెయిట్ లాస్ డైట్ టిప్స్
బరువు తగ్గిన తర్వాత అదే ఫిట్ నెస్ ఉండాలంటే కొన్ని హెల్తీ హ్యాబిట్స్ మెయింటెయిన్ చెయ్యాలి. ఈ అలవాట్లన్నీ సమయంతో కూడినవే అయినా... ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ ఈ అలవాట్లన్నీనిత్యం ఫాలో అవడం వల్ల బీఎమ్ఐ స్థాయి, కండరాలకు రక్షణ, రక్త ప్రసరణ పెంచడానికి, తొడలు, పొట్ట భాగాలలో ఫ్యాట్ చేరకుండా అరికట్టడానికి సహాయపడతాయి.
READ MORE: అకస్మాత్తుగా బరువు తగ్గితే, ఎదురయ్యే ప్రమాధకర ఆరోగ్య సమస్యలు
ఈ హెల్తీ హ్యాబిట్స్ వల్ల బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది. చాలా యాక్టివ్ గా, పవర్ ఫుల్ గా ఉంటారు. బరువు తగ్గడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి బరువు తగ్గిన తర్వాత ఈ నియమాలు పాటించి.. మళ్లీ బరువు పెరగకుండా కంట్రోల్ లో ఉంచుకోండి.

క్యాలరీలు
తక్కువ క్యాలరీలు తీసుకుంటూ.. ఎక్కువ ఎక్సర్ సైజ్ చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఈ పద్ధతి బరువు తగ్గడానికి సహకరించిందని భావిస్తే.. కంటిన్యూ చేయవచ్చు. కాకపోతే శరీరానికి అవసరమైన క్యాలరీలు అందించినప్పుడే జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.

8 గంటల నిద్ర
బరువు తగ్గిన తర్వాత పాటించాల్సిన మరో ముఖ్యమైనది ప్రతి రోజూ రాత్రి ఎనిమిది గంటలు నిద్రపోవడం. 8 గంటల నిద్రను నిర్లక్ష్యం చేస్తే.. శరీరం నీరసపడిపోతుంది, లేజీగా ఉంటుంది. దీనివల్ల ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి.

యాక్టివ్ గా ఉండటానికి
బరువు తగ్గిన తర్వాత రోజంతా.. యాక్టివ్ గా ఉండటం చాలా అవసరం. ఆహారం ద్వారా పొందిన క్యాలరీలను కరిగించడం ద్వారా శరీరం యాక్టివ్ గా ఉంటుంది. కాబట్టి రోజువారీ డైట్ లో ప్రొటీన్స్, హై ఫైబర్ ఫుడ్స్ ఉండేలా జాగ్రత్త పడాలి. వీటి ద్వారా శరీరానికి ఎనర్జీ అందుతుంది.

తక్కువ మోతాదులో ఆహారం
బరువు తగ్గిన తర్వాత టైంకి సరిగ్గా తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం చాలా అవసరం. డైలీ యాక్టివిటీస్ లో శరీరం ఉత్సాహంగా పనిచేయడానికి ఇది సహకరిస్తుంది. అంతేకాదు జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.

మంచినీళ్లు
బరువు తగ్గిన తర్వాత రోజుకి 8 నుంచి 9గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగడం చాలా ఆరోగ్యకరమైన అలవాటు. నీళ్లు శరీరంలోని టాక్సిన్స్ ని తొలగించి, రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహాయపడుతుంది. అంతేకాదు శరీరం ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తుంది.

వ్యాయామం
బరువు తగ్గడానికే మాత్రమే కాదు.. బరువు తగ్గిన తర్వాత కూడా వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. రోజుకి 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సేపు చేయాలి. ఇంట్లోగానీ, జిమ్ లోగానీ వ్యాయామం చేయడం వల్ల అవయవాలు ఉత్సాహంగా, క్యాలరీలను కరిగించి ఫిట్ గా ఉండటానికి సహకరిస్తాయి.

ఒత్తిడికి దూరంగా
ఒత్తిడి చాలా భయంకరమైన వ్యాధి. అన్ హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశాలున్నాయి. ఒత్తిడి దరిచేరకుండా చూసుకోవడం వల్ల శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవచ్చు. లేదంటే మళ్లీ బరువు పెరిగే అవకాశాలున్నాయి.
సో.. బరువు తగ్గాం కదా అని.. వ్యాయామం, ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అంతే సంగతి. కాబట్టి.. బరువు తగ్గిన తర్వాత కూడా అవే హెల్త్ హ్యాబిట్స్ మెయింటెయిన్ చేయండి.



Click it and Unblock the Notifications
