Latest Updates
-
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
బరువు పెరగడానికి 10 సులభ మార్గాలు
స్థూలకాయంతో బాధపడే వాళ్ల సంగతి ఒక ఎత్తైతే.. బక్కపల్చగా ఉన్న శరీరంతో బాధపడేవాళ్ల సంగతి మరో ఎత్తు. బరువున్న వాళ్లు కొవ్వు కరిగించుకోవడానికి తీవ్రంగా ట్రై చేస్తుంటే.. లావు పెరగడానికి తెగ ప్రయత్నిస్తుంటారు సన్నగా ఉన్నవాళ్లు. అయితే బరువు పెరగడానికి ఏది పడితే అది తినేస్తే.. రిస్క్ లో పడతారు. కాబట్టి.. ఏవి తినాలి.. ఏవి తినకూడదో తెలుసుకుని తింటే బెటర్.
READ MORE:వేగంగా బరువు తగ్గాలంటే వెంటనే వీటిని ప్రారంభించండి...
బరువు పెరగడం అంత తేలికైన విషయం కాదు. ప్రణాళిక ప్రకారం ఆహారం తీసుకోకపోతే.. చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు పెరిగి, వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు కారణమౌతాయి. సులభమైన మార్గాల ద్వారా.. ఆరోగ్యంగా బరువును ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూద్దాం..

శక్తిని అందించే ఆహారం
శక్తిని అందించే ఆహార పదార్థాలు డైట్ లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. మిల్క్ షేక్స్, నట్స్, వెన్న, అవకాడో, గింజలు రోజూ తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. శక్తిని అందించే ఆహార పదార్థాలు ఎక్కువ మొత్తంలో క్యాలరీలను కలిగి ఉంటాయి. కాబట్టి బరువు పెరగడానికి ఇవి తోడ్పడతాయి.

వేలకు ఆహారం
టైంకి తినడం చాలా అవసరం. సమయానికి భోజనం, అల్పాహారం, రాత్రి భోజనం చేయాలి. ఆలస్యంగా తినడం మంచిది కాదు. ఏ సమయంలో ఏం తినాలి అని ఒక ప్రణాళిక రూపొందించుకుని ఫాలో అయితే బెటర్.

డ్రై ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్ రుచికరంగానే కాదు.. తక్షణ శక్తిని కూడా అందిస్తాయి. కాబట్టి బాదం, కాజూ, ఎండుద్రాక్ష తీసుకోవాలి. వీటిని డైరెక్ట్ గా అయినా.. ఆహార పదార్థాల్లో మిక్స్ చేసి అయినా తీసుకోవచ్చు.

క్వాంటిటీ
కొంచెం కొంచెం తినడం వల్ల బరువు పెరగలేరు. కాబట్టి.. తీసుకునే ఆహారంలో పరిమాణం పెంచండి. ఎక్కువ పరిమాణంలో ఒకేసారి తినలేం అని ఫీలయ్యేవాళ్లు.. కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తింటే సరిపోతుంది.

స్నాక్స్
రెండు, మూడు గంటలకొకసారి తినడం వల్ల క్యాలరీల స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి.. సాయంకాలం లేదా అప్పుడప్పుడు చిరుతిళ్లు తీసుకోవాలి. పోషకాలు, విటమిన్స్ ఉన్న ఆహార పదార్థాలను స్నాక్స్ రూపంలో తీసుకోవాలి.

తాజా పండ్లు
పండ్లు తక్షణ శక్తితో పాటు.. శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. కాబట్టి.. పండ్లను డైట్ లో చేర్చుకోవాలి. అరటిపండు లాంటివి బరువు పెరగడానికి ఉపయోగపడతాయి. పండ్లు ఇష్టపడని వాళ్లు.. జ్యూస్ రూపంలో తాగితే సరిపోతుంది. తాజాగా ఇంట్లో చేసుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి.

ప్రొటీన్ లు
ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. మాంసం, చేపలు, యోగర్ట్, బీన్స్ వంటి వాటిల్లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. వీటిని డైట్ లో చేర్చుకోవాలి. ఇవి శరీర బరువు పెరగడానికి తోడ్పడతాయి.

రోజుకి 500 క్యాలరీలు
రోజుకి 5 వందల క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల వారానికి ఒక పౌండ్ బరువు పెరగుతారు. ఆహారం తయారు చేసేటప్పుడు వెన్న, చీజ్ లు కలిపితే.. ఎక్కువ మోతాదులో ఈజీగా క్యాలరీలు పెరుగుతాయి. మొక్కజొన్నలు, బఠానీలు కూడా బరువు పెరగడానికి తోడ్పడతాయి.

వ్యాయామం
సన్నగా ఉన్నాం కదా వ్యాయామం ఎందుకులే అనుకుంటారు చాలామంది. కానీ.. బరువు పెరగడానికి బలమైన కండర నిర్మాణం ప్రధానమైనది. క్యాలరీలు తీసుకోటాన్ని పెంచినప్పుడు మీ శక్తి వినియోగం కూడా అంతే మొత్తంలో ఉండాలి. ఈ పద్దతి ద్వారా బరువుతో పాటు.. ఆరోగ్యం బాగుంటుంది.

ఆహార పరిమితులు
బరువు పెరగాలన్న ఆశతో.. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లపై మోజు పెంచుకోకూడదు. వీటిలో ఎక్కువ సోడియం, తక్కువగా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కాబట్టి ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. హెల్తీ ఫుడ్స్ ఎంచుకోవడం వల్ల బరువు పెరగవచ్చు.. ఆరోగ్యంగానూ ఉండవచ్చు.



Click it and Unblock the Notifications