Latest Updates
-
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.!
స్తనాలు వదులవ్వడానికి ఈ చెడు అలవాట్లే కారణమా?
స్తనాలు ఎందుక వదులవుతాయి? వక్షోజాలు బిగువుగా లేకుండా వదులవ్వడానికి లేదా సాగిపోవడానికి వివిధ రకాల కారణాలున్నాయి. అందుకు అనారోగ్యకరమైన అలవాట్లు ముఖ్య కారణం. మరి ఆ చెడు అలవాట్లు ఏంటి?మరి అవేంటో తెలుసుకుందాం. నిజానికి వయస్సు పెరిగే కొద్ది ముఖ్యంగా మోనాపాజ్ దశ చేరుకొనే సరికి మరియు వయస్సు పెరిగే కొద్ది కొన్ని ప్రత్యేమైన ఆనారోగ్య కారణాల వల్ల స్తనాలు వదులవ్వడం లేదా సాగడం జరుగుతుంది. అంతే కాదు, బ్రెస్ట్ ఫీడింగ్ (పిల్లలకు పాలు పట్టడం)వల్ల కూడా స్తనాలు వదలవ్వడం లేదా జారడానికి ఒక కారణం. శరీరంలో ఎప్పుడైతే ఎలాసిటి(స్థితితాపకత)తగ్గుతుందో అప్పుడు అనివార్యంగా బ్రెస్ట్ సాగుతుంది. ఇది చాలా సింపుల్ గా కొంత వయస్సు పెరిగిన తర్వాత ఈ సమస్య ఉంటుంది. కొంత మంది మహిళల్లో జన్యుపరమైన కారకాలు కూడా కారణం కావచ్చు.
READ MORE: స్తనాల సైజ్ ను నేచురల్ గా తగ్గించుకోవడానికి 10 మార్గాలు
అయితే, కొన్ని చెడు అవాట్ల వల్ల కూడా ఛాతీ ఆకారంలో మార్పు వస్తుందనుకుంటే, ఆశ్చర్యం కలగక మానదు. అందుకు అలాంటి చెడు అలవాట్లు ఏంటో ఒక సారి తెలుసుకొని, ఆ అలవాట్లను మానుకోవడం చాలా ఉత్తమం. ఛాతీ వదలవ్వడానికి లేదా జారడానికి సరైన కారణాలు లేదా వాస్తవాలు తెలుసుకొంటే, ఈ సమస్యను నివారించడానికి ప్రయత్నించవచ్చు. స్తనాల ఆకృతి అందంగా ఉన్నప్పుడు, మహిళలు మరింత అందంగా కనబడతారు . ఇలాంటి సమస్యను మీరు కూడా ఎదుర్కొంటుంటే, మరి ఈ సమస్యకు గల కారణాలు తెలుసుకొని, నివారించే ప్రయత్నం చేయండి. ఇలా చేయడానికి ముందుగా ఈ సమస్యకు గల కొన్ని కారణాలు మీరు గుర్తుంచడం కోసం ఈ క్రింది విధంగా...

1. స్మోకింగ్:
స్తనాలు జారిపోవడానికి స్మోకింగ్ కూడా ఒక కారణం అని రీసెంట్ గా ఒక పరిశోధన ద్వారా వెల్లడైనది. మహిళలు తరచూ స్మోక్ చేయడం వల్ల స్తనా వద్ద చర్మం యొక్క స్థితిస్థాపకత తగ్గి, చర్మం వదులుగా మారుతుంది. దాంతో ఛాతీ వదులైనట్లు లేదా సాగినట్లు కనబడుతాయి. కాబట్టి, సాధ్యమైనంత వరకూ స్మోక్ చేయడం నివారించాలి.

2. డీహైడ్రేషన్:
మీరు రోజులో సరిపడా నీళ్ళు త్రాగాలి. శరీరం డీహైడ్రేషన్ కు గురైతే, చర్మం వదులౌతుంది. స్థనాలు వదులవడానికి లేదా సాగడానికి ఇది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు.

3. బ్రా సైజ్ తప్పైతే:
మీరు ఎంపిక చేసుకొనే బ్రా సైజ్ కరెక్ట్ గా ఉండాలి. లేదంటి ఇది స్థనాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. సరైన సైజ్ ఎంపిక చేసుకోకపోతే, స్తనాలు ఫిట్ గా కుదరక ఛాతి వదులవుతుంది లేదా సాగుతాయి.

4. సూర్య రశ్మి:
ఈ మద్యన జరిపిన పరిశోధనల ద్వారా సూర్య రశ్మి కూడా స్తనాలు వదులవ్వడానికి కారణం అవుతాయని కనుగొన్నారు . మీరు బయట ఎండలో తిరగాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయాలి.

5. నిద్రభంగిమ:
నిద్రించే భంగిమ కరెక్ట్ గా ఉండాలి. వెల్లకిలా పడుకోవడం వల్ల చాతీమీద ముడుతలను నివారించవచ్చు మరియు వెన్ను నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది . దాంతో పాటు, ఛాతీ సాగడం నివారించవచ్చు.జ

6. బరువు తగ్గడం:
బరువు తగ్గడం వల్ల స్తనాల్లో మార్పులు?పరిశోధనలు అవుననే చెబుతున్నాయి . కాబట్టి, బరువు తగ్గడానికి మీరు డైట్ ను అనుసరించేటప్పుడు, పరిమితికి మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

7. కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు:
ఈ విషయంలో ఖచ్చితమైన ఆధారాలు కూడా ఉన్నాయి . కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు చేయడం ద్వారా స్తనాలు వదులౌతాయని అంటారు. కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు ఛాతీ మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి, అలాంటి వ్యాయామాలను చేయకపోవడమే ఉత్తమం.

8.కూర్చొనే భంగిమ:
కూర్చొనే భంగిమ కూడా ఛాతీ మీద ప్రభావం చూపుతుంది . కూర్చొన్నప్పుడు, వెన్ను నిటారుగా అప్ రైట్ బ్యాక్ పొజీషన్ లో కూర్చోవాలి. మీరు కూర్చొనే భంగిమ కూడా ఛాతీ మీద ప్రభావం చూపుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి.



Click it and Unblock the Notifications
