For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గాలనుకుంటున్నారా ? ఐతే బనానా డైట్ ఫాలో అవండి

By Nutheti
|

బరువు తగ్గాలను చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారా ? వ్యాయామం, డైట్ ఫాలో అవుతున్నా రిజల్ట్స్ కనిపించడం లేదా ? అయితే ఈ బనానా డైట్ ఫాలో అయిపోండి. ఒక జపాన్ వ్యక్తి చాలా స్ర్టిక్ట్ గా అరటిపండు డైట్ ఫాలో అయి ఈజీగా 18 కేజీలు తగ్గాడు. ఇతను బనానా డైట్ ద్వారా బరువు తగ్గడంతో.. ఈ డైట్ చాలా ఫేమస్ అయింది. బరువు తగ్గాలనుకునే వాళ్లకు ఈ జపాన్ వ్యక్తి ఇన్సిపిరేషన్ గా మారాడు.

ఇంట్లో అరటిపండు ఉంటే చాలు.. బ్యూటీపార్లర్‌ ఇంట్లో ఉన్నట్టే! ఇంట్లో అరటిపండు ఉంటే చాలు.. బ్యూటీపార్లర్‌ ఇంట్లో ఉన్నట్టే!

చాలా మంది తాము బరువు తగ్గాలని, స్లిమ్ గా ఆకట్టుకునేలా కనిపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లు ఈ సింపుల్ అండ్ ఈజీ పద్ధతి ద్వారా బరువు తగ్గించుకోవడానికి ప్లాన్ చేసుకోండి. అందరికీ అందుబాటు ధరలో ఉండే అరటిపండు డైట్ తీసుకోవడం అంత కష్టమేమీ కాదు. ఖర్చు తక్కువలోనే బరువు తగ్గించుకోవడానికి ఇది సరైన మార్గం.

READ MORE: అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు

చాలా మంది అరటిపండులో సోడియం, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఇది బరువు పెరగడానికి కారణమవుతుందని అందరూ ఫీలవుతారు. అరటిపండులో మంచి ఫ్యాట్ ఉంటుందని.. అది బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుందని పోషక నిపుణులు నిర్థారించారు. అయితే ఈ డైట్ ఫాలో అవడం కూడా చాలా ఈజీనే. ఈ మోడ్రన్ అమ్మాయికి, అబ్బాయికి ఈ డైట్ ఫాలో అవడం చాలా తేలికైన పని కూడా. ఇప్పుడు ఈ బనానా డైట్ పాలో అవడం ఎలా ? ఎలాంటి ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలో తెలుసుకుందాం..

బ్రేక్ ఫాస్ట్ బనానా డైట్

బ్రేక్ ఫాస్ట్ బనానా డైట్

అల్పాహారం రోజులో చాలా ముఖ్యమైనది. ఆరోగ్యానికి మంచి చేసే ఆహారంతో రోజుని ప్రారంభించడం చాలా అవసరం. బనానా డైట్ లో భాగంగా.. ముందుగా రెండు అరటిపండ్లు తీసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఆకలిగా ఉంటుంది. మళ్లీ మరొక అరటిపండు తీసుకుని, ఒక కప్పునిండా చక్కెర లేని ఓట్ మీల్ తీసుకోవాలి. అయితే అల్పాహారానికి ముందు నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.

మధ్యాహ్నం భోజనానికి బనానా డైట్

మధ్యాహ్నం భోజనానికి బనానా డైట్

మధ్యాహ్న భోజనంలో ఒక కప్పు అరటిపండు సలాడ్ లేదా జ్యూస్ తీసుకోవాలి. మధ్యాహ భోజనం సమయంలో కనీసం 4 నుంచి 5 అరటిపండ్లు ఖచ్చితంగా తీసుకోవాలి. చిన్న అరటిపండ్లలో క్యాలరీలు ఎక్కువగా ఉండవు. కాబట్టి మధ్యాహ్న భోజనం తర్వాత బనానా డిజర్ట్ తీసుకోవడం మంచిది.

రాత్రి భోజనానికి బనానా డైట్

రాత్రి భోజనానికి బనానా డైట్

రాత్రిపూట 7:30లోపు భోజనం చేయడం చాలా అవసరం. రాత్రిపూట భోజనంలో రెండు రోటీలు లేదా ఒక కప్పు బ్రౌన్ రైస్ చేర్చుకోవాలి. దాల్ గ్రేవీస్ తో పాటు ఒక రోటీతో ఒక బనానా జత చేసుకుని తినాలి. బ్రౌన్ రైస్ తినాలనుకుంటే కప్పు బ్రౌన్ రైస్ కి ఒక స్పూన్ పెరుగు, అరటిపండు ముక్కలు కలుపుకోవాలి.

నీళ్లు

నీళ్లు

బరువు తగ్గడానికి ఫాలో అవుతున్న ఈ బనానా డైట్ లో ఖచ్చితంగా నీటిని చేర్చుకోవాలి. ఎక్కువ మోతాదులో నీళ్లు తీసుకోవడం చాలా అవసరం.

స్నాక్స్

స్నాక్స్

ఒకవేళ ఆకలిగా అనిపించినప్పుడు హెల్తీ స్నాక్స్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. అది కూడా తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఎనర్జీ ఇచ్చే ఆహారం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. తాజా పండ్లు, ఉడకబెట్టి కూరగాయలు తీసుకోవడం మంచిది. ఉప్పులేని పాప్ కార్న్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అది కూడా బనానా డైట్ లో ఈ సాల్ట్ లేని పాప్ కార్న్ చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడం సులువవుతుంది.

నిద్రలో

నిద్రలో

ప్రతి రోజు రాత్రి ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోవాలి. సరిపడా నిద్రపోవడం బరువు తగ్గడానికి చాలా సహకరిస్తుంది. చివరసారిగా తిన్న భోజనానికి నిద్రపోయే సమయానికి మధ్యలో నాలుగు గంటలు ఉండేలా చూసుకోవడం మంచిది.

వ్యాయామం

వ్యాయామం

బనానా డైట్ కి ఎక్కువ వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. వ్యాయామం చేసినా పర్లేదు.. చేయకపోయినా ఫర్వాలేదు. మీ సామర్థ్యంను ఎంచుకోవడం ఎంచుకోకపోవడం నిర్ణయించుకోవాలి.

English summary

Want To Lose Weight? Follow The 'Banana Diet'!: Banana Diet

Japanese man, Hitoshi Watanabe lost more than 18 kgs by strictly following the banana diet. This diet became popular after people got to see the drastic change in Hitoshi Watanabe.
Story first published: Friday, December 4, 2015, 10:44 [IST]
Desktop Bottom Promotion